సద్గురు మనకు మహాభారత కథను ఆరంభం చేస్తూ - పాండవ, కౌరవుల పూర్వీకులలోని వారి జనన విషయాల గురించి చెబుతున్నారు.

కధను అర్ధం చేసుకోవడానికి ఇందులోని పాత్రలను ఆధారంగా తీసుకోండి.    

మీరు పూర్తిగా ఈ కథలో ఐక్యమై ఇంకెవరి కధగానో లేక చరిత్ర గానో కాక మీ కథగా ఈ పాత్రలలో ఐక్యం కండి. నేను మీకు ముందు చెప్పినట్లుగా 5000 వేల సంవత్సరాల ముందు నివసించిన మనుష్యులను మీరు మీ ఈనాటి సామాజిక విలువలతో, నీతులతో కొలవటం, తీర్పు చెప్పటం అన్యాయం. మీరు మీలా కాక, వారి లాగా ఆలోచించాలనీ, వారిలా ఉండాలని, వారిలా అనుభవం చెందాలని నా ఆకాంక్ష. ఈ కథ జరిగిన కాలంలో భూమికీ మరింకెక్కడో ఉన్న జీవులకీ మధ్య ఇచ్చి పుచ్చు కోవడాలు తరుచుగా జరుగుతుండేవి.

మహాభారతంలో వివిధ అంశాలు మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ మీరు దేనినీ అపనమ్మకంతో చూడకండి.

మహాభారతంలో వివిధ అంశాలు మీకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ మీరు దేనినీ అపనమ్మకంతో చూడకండి. ఈ 21వ శతాబ్దంలో మనం ఆమోదించడం కన్నా నిశితంగా పరిశీలించిడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నాము. ప్రస్తుతం మీరు ఈ కధనీ ఇందులోని పాత్రలని, మనుష్యులని, జంతువులని,యక్ష, కిన్నెర, గణ, దేవతలని, అందరినీ ఆమోదించండి. అప్పుడే మీరు దీనిని అర్ధవంతంగా మీ ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా చూడగలరు. విమర్శనాత్మకంగా చూడటం వల్ల ఈ కధలోని ఆంతర్యాన్ని స్పృశించలేరు.

ఇంద్రుని ఆస్థాన పురోహితుడు - బృహస్పతి 

వేల సంవత్సరాలకు పూర్వం దేవతల రాజైన ఇంద్రుడు గొప్ప పండితుడు, పురోహితుడు అయిన బృహస్పతిని తన ఆస్థాన పురోహితునిగా నియమించాడు. ద్వాపర యుగంలో మనుష్యుల జీవితాలలో యఙ్ఞాది క్రతువులు ముఖ్య అంశంగా ఉండేవి, అందువల్ల పురోహితుడికి ఎంతో ముఖ్య స్థానం ఉండేది. తమ పరిస్థితులపై, తమ జీవితాలపై చుట్టూ ఉన్నవారి జీవితాలపై ప్రభావం, పద్ధతులను, గూర్చి వీరికి బాగా తెలుసు. ఈ ఆచారాలు దక్షిణ భారతదేశం సంస్కృతి లో ఇంకా కొంత ఉంది.

ఇక టిబెట్టులో ఈ హిందూ ఆచారాలు ఎంతో ఘోరంగా వక్రీకరించబడ్డాయి.

దేశంలో మరే ప్రదేశంలో కన్నా కేరళలో ఈ ఆచారాలు ఎక్కువగానూ, కొంతవరకూ స్వచ్ఛంగానూ ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ కథ జరిగిన ఉత్తర భారతంలో ఇవి పూర్తిగా కలుషితం అయ్యాయి. మధ్య భారతంలో కొంతవరకూ ఇవి జరుగుతున్నా, వారికి వీటిని గురించి అవగాహన పూర్తిగా లేదు. ఇక టిబెట్టులో ఈ హిందూ ఆచారాలు ఎంతో ఘోరంగా వక్రీకరించబడ్డాయి.

గౌతమ బుద్ధుడు కలియుగ, ద్వాపరయుగ సంధిలో ఉండి, మానవాళిని ఈ అచారాల బారి నుండి విముక్తి చేయడానికి తన జీవితం అంతా గడిపాడు. తనముందటి ద్వాపర యుగంలోని వారు చాలా క్రతువులు చేసేవారని అని ఆయనకు తెలుసు. ఆయన మానవాళిని ఈ క్రతువులనుంచి విముక్తం చేయదలచారు. అందుకే ఆయన కేవలం ధ్యానం గురించే నొక్కి చెప్పారు. కానీ బౌద్ధ మతంలో ఇప్పుడు హిందూ మతం కన్నా ఎక్కువగా క్రతువులను పాటిస్తున్నారు.

బృహస్పతి, అతని భార్య తార

దేవరాజు ఇంద్రుని ప్రధాన పురోహితుడైన బృహస్పతి భార్య తార. బృహస్పతి గురుగ్రహాన్ని సూచించగా తార అంటే నక్షత్రం. ప్రాచీన భారతదేశంలోని స్త్రీ పురుషులిద్దరికి క్రతువులలో సమాన ప్రాధన్యత ఉండేది. బయటి పరిస్థితులు కఠినంగా ఉన్నాకూడా, భార్య తోడుగా లేకుంటే పురుషుడు క్రతువులు నిర్వహించలేడన్న ఆచారం వల్ల, సమాజం స్త్రీకి సమాన స్థాయిని ఇచ్చింది. భార్య ప్రక్కన లేకుండా భర్తకి వరాలు దొరకవు. భార్య లేకుండా పురుషుడు స్వర్గానికి వెళ్ళలేడు, ముక్తిని పొందలేడు.

ఏ పరిస్థితిలోనూ సాంఘికంగా స్త్రీని అలక్ష్యం చేయడానికి వీలు లేకుండా ఆచారాలనన్నిటినీ ఏర్పాటు చేశారు. ఈ రోజుల్లో స్త్రీకి కొంత స్వతంత్రం ఉంది, కానీ ఈ స్వతంత్రంతో వారు తమకుండే ఎన్నో హక్కులను  కోల్పోతున్నారు. చట్టపరంగా స్త్రీకి ఈ రోజుల్లో సమాన హక్కులు ఉన్నా దురదృష్టవశాత్తూ అవన్నీ పూర్తిగా అమలులోకి రాలేదు కనుక, స్త్రీ కొన్ని కనీస హక్కులకే పరిమితమయ్యింది.

ఆధునిక సాంకేతిక విజ్ఞానం వల్లనే స్త్రీకి సమాన హక్కులు ఇవ్వడం సాధ్యమయ్యింది, అంతేకాని ఇది మానవాళిలో వచ్చిన పరివర్తన వల్ల కాదు.

ఆధునిక సాంకేతిక విజ్ఞానం వల్లనే స్త్రీకి సమాన హక్కులు ఇవ్వడం సాధ్యమయ్యింది, అంతేకాని ఇది మానవాళిలో వచ్చిన పరివర్తన వల్ల కాదు. ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎందరో మహిళలు ఎంతో దూరాలనుంచి, కొందరు విదేశాల నుంచి కూడా వచ్చారు. 2 వేల సంవత్సరాలకు పూర్వం మనం ఈ కార్యక్రమం చేసి ఉంటే, ఎంత మంది సముద్రాలు ఈదుకుంటూనో, ఆరు నెలల ఓడ ప్రయాణం చేసో, మహాభారత కార్యక్రమానికి రాగలిగేవారు? కొంతమంది పురుషులు బహుశా చేరుకునేవారేమో కానీ స్త్రీలు మాత్రం పూర్తిగా మానుకునేవారు. సాంకేతిక విఙ్ఞానం వల్లనే ఇది ఈ రోజు సాధ్యమయ్యింది.

బృహస్పతి కాలంలోని సామాజిక నిబంధనలు, ధర్మం, స్త్రీకి ఎంతో ముఖ్యమైన స్థానం ఇచ్చింది.  స్త్రీని వేధించడం, వాడుకోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగేవి కాదు. శారీరిక బలంతో పురుషుడు స్త్రీ పై పూర్తి విజయం సాధించగలడు కాని ఆధ్యాత్మిక విషయాలలో స్త్రీ ప్రక్కన లేకపోతే అతనికి ఎదీ సాధ్యం కాదు, అందువలన స్త్రీకి పూర్తి విలువ ఇవ్వవలసి ఉంది.

తార చంద్రునితో  ప్రేమలో పడడం

బృహస్పతి ఇంద్రుని ముఖ్య పురోహితుడు, విధి నిర్వహణలో తార తన ప్రక్కన ఉండటం అతనికి ఎంతో ముఖ్యం.  వివాహేతర సంబంధాలలో తాను ఆనందించుతున్నా, తార లేకపోతే తన ఉపాధి పోతుందని, తారని మాత్రం అతను వదలలేదు. ఈ విషయం తెలిసిన తార ఆకాశంలో పున్నమి చంద్రుని చూసి ప్రేమలో పడింది. చంద్రుడు కూడా స్వయంగా భూమికి దిగి రాగా వీరిద్దరి మధ్యా ప్రేమ ముదిరి, కొంతకాలం తరువాత తార చంద్రునితో వెళ్లిపోయింది.

తన ఉద్యోగం, గౌరవం, దేవలోకంలో తన స్థానం కూడ తారతోనే పోతుందని, తనింక దేవలోకంలోకి అడుగు పెట్టలేనని గ్రహించి బృహస్పతి ఉగ్రుడయ్యాడు. ఇంద్రుని పిలిచి, "నాకు నా భార్య కావాలి, నువ్వు ఆమెని తిరిగి తీసుకురావాలి, లేకపోతే నేను మీ క్రతువులను జరుపను" అన్నాడు. ఇంద్రుడు కల్పించుకుని తారని తిరిగి రావలని ఒత్తిడి పెట్టాడు. కుటుంబ వ్యవస్థలో ఉండాలని ఒకరిని ఒత్తిడి చేయడం ఇదే మొదటిసారి. ఇంద్రుడు "నువ్వు తిరిగి రావాలి" అని చెప్పగా, తార "నా ప్రేమ చంద్రునితో" అని నిరాకరించింది. "నీ భావాలతో పని లేదు నీ ధర్మం బృహస్పతితో ఉండటం, పైగా నువ్వు లేకపోతే నా క్రతువులు జరుగవు" అని తారని తిరిగి తీసుకొని వచ్చారు.

తారా చంద్రుల సంతానం

తార గర్భిణిగా ఉండటం తెలిసి బృహస్పతి ఆ శిశువు తండ్రి వివారాలు కోరగా తార మాట్లాడడానికి నిరాకరించింది.  ప్రజలు పోగయ్యరు. తార ఇంకా మౌనంగానే ఉంది. ఇంతలో గర్భాశయం నుండి పుట్టబోయే శిశివు "నిజంగా నేనెవరి సంతానం?" అని ప్రశ్నించాడు. ఆ శిశువు తెలివి చూసి, అక్కడున్నవారంతా "నీ భర్తకి చెప్పడానికి నువ్వు నిరాకరించవచ్చు, దేవతలకి చెప్పడం నిరాకరించవచ్చు కాని పుట్ట బోయే శిశువుకి నువ్వు తప్పక చెప్పాలి" అనగా, తార "ఈ శిశువు చంద్రుని సంతానం" అని చెప్పింది.

శిశువు జన్మించగా బుధగ్రహాన్ని సూచిస్తూ అతనికి ‘బుధ’ అని పేరు పెట్టారు

తన భార్య వేరే పురుషుడి సంతానానికి జన్మ నిస్తున్నదని తెలిసి బృహస్పతికి ఎంతో కోపం వచ్చింది. "స్త్రీ, పురుషులు ఎవరూ కాక నువ్వు నపుంసకుడివిగా ఉండగలవు" అని ఆ సంతానాన్ని శపించాడు. శిశువు జన్మించగా బుధగ్రహాన్ని సూచిస్తూ అతనికి ‘బుధ’ అని పేరు పెట్టారు. పెద్దవాడవ్వుతూ అతను "నేనెలా బ్రతకాలి ఆడగానా? మగగానా? నేనేమి చేయాలి? నా ధర్మం ఏమిటి? నేను పెళ్ళిచేసుకుని గృహస్తుని కావాలా లేక సన్యాసం తీసుకోవాలా? నేను పెళ్ళి ఆడవారితో చేసుకోవాలా లేక మగవారితోనా? అని వాపోయాడు. అది విని తార "ఈ విశ్వంలో కోట్లకొద్దీ నక్షత్రాలకి చోటుంది, ఆడ - మగ కాకపోయినా, దేవతా - దెయ్యం కాకపోయినా మిగతావాటెన్నిటికో చోటుంది. ఈ విశ్వంలో వీటన్నిటికీ చోటుండగా నువ్వు చింతించకు నీకు కూడా చోటుంటుంది. నువ్వు నిశ్చింతగా ఉండు నీ జీవితం నీ దారికే వస్తుంది’’ అని ఊరడించింది.

ఇంకా ఉంది (...)

మరిన్ని మహాభారత కథలు...