మనకు తెలిసిన మహాభారత కథ గణపతి రచించినది కాదు..!!

ganapati

మహాభారతం వ్యాసాల పరంపరలోని ఈ వ్యాసంలో సద్గురు వేదాల సంకలనకర్త, మహాభారత గ్రంధకర్త అయిన వ్యాసుని గురించి తెలియచెప్పుతూ,  సర్వకాలాలలోనూ సాటిలేని ఈ గొప్ప మహాభారతం లోతుల్లోకి వెళ్తున్నారు.

వేదాల సంకలనకర్త వ్యాసుడు

వ్యాసుడు అని పిలువబడే కృష్ణ ద్వైపాయనుడు గొప్ప ఋషి, ఈయన మహాభారత గ్రంధ కర్త మాత్రమే కాదు, వేదాల సంకలనకర్త కూడా. వేదాలు 1,00,000 సంవత్సరాలకు పూర్వం నుండే ఉన్నాయని భావిస్తారు. వీటిని ఒక తరం నుండి ఇంకొక తరానికి మౌఖికంగానే ప్రసరణ చేశారు. శబ్ద ప్రాముఖ్యతా, ప్రభావమూ అర్ధం చేసుకున్నారు కనుక వీటిని లిఖించడానికి వారు నిరాకరించారు. భౌతికంగా మన వాడుకలో ఉన్న వాటన్నింటిలోకీ సూక్ష్మమైనది శబ్దము. విద్యుదయస్కాంత శక్తి దీని పైస్థాయికి చెందినది. మీ మెదడులో తిరిగేది కూడా ఇదే శక్తి. ఆలోచనలకూ, భావాలకూ, మరి వేరే వేటికీ ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అతి సూక్ష్మమైన శబ్దం, దాని ప్రాముఖ్యతనూ గుర్తించి దీనిని ఎంతో ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చని వారు గుర్తించారు.

గంగాతీరంలో వచ్చిన 14 సంవత్సరాల సుదీర్ఘ కరవు వచ్చే వరకూ వేదాలను మౌఖికంగా పలుకడమే సంప్రదాయం.

గంగాతీరంలో వచ్చిన 14 సంవత్సరాల సుదీర్ఘ కరవు వచ్చే వరకూ వేదాలను మౌఖికంగా పలుకడమే సంప్రదాయం. ఆ సమయంలో ఒక్క చుక్క వర్షం పడలేదని అంటారు. పంటలు ఎండిపోయాయి, ఆ నాటి నాగరికత కుంచించుకు పోయింది. జీవించడానికి ఆహారం సేకరించుకునే పనిలో పడిపోయి ప్రజలు వేదాలను వల్లెవేయటం మర్చిపోయారు. తమ సంప్రదాయాలను పూర్తిగా వదులుకున్నారు. వర్షాలు తిరిగి వచ్చిన తరువాత వ్యాస ఋషి వేదాలు లేకపోవటంవల్ల ఈ నాగరికతకి జరిగిన నష్టం చూసి, వేదాలను లిఖిత పూరితం చేయాలని నిశ్చయించారు. వీటిని ఋగ్ వేదం, అథర్వణ వేదం, సామ వేదం, యజుర్ వేదం అని నాలుగు భాగాలుగా విభజించారు. ఇది సంప్రదాయ క్రమం, ఈ రోజుల్లో చెప్పేవరుస క్రమం కాదు. ఈ నాలుగు వేదాలూ ఈ రోజుకి కూడా మానవ చరిత్రలోని అతి గొప్ప లిఖిత ప్రతులుగా గణిస్తారు.

ఇక తరువాత అన్ని కాలాల ప్రజలకీ యుక్తమైన ఒక శాశ్వత గ్రంధం రచించాలని ఆయన అనుకున్నారు. దీనిని ఆయన ఇద్దరికి వినిపించారు. అందులో ఒకరు అయన శిష్యుడు వైశంపాయనుడు. ఇతను పూర్తివిస్మయతో విన్నాడు,  శిష్యులకి వక్రీకరించే అవకాశం ఉందని మీకూ తెలుసు. సత్య యుగంలో మానవ మానసిక శక్తి ఎక్కువగా ఉన్నందున మౌఖికంగా ప్రసారం చేయడానికి తగిన ఙ్ఞాపక శక్తి అప్పటి మనుష్యులలో ఉంది. కలియుగం దగ్గర పడుతున్న కొద్దీ మానవ మానసిక, ఙ్ఞాపక శక్తి తగ్గుతుండటంతో వ్యాసుడు ఇక ఎలాంటి అవకాశాలకూ ఆస్కారం లేకుండా రెండవ వారిగా గణపతిని పిల్చి వేదాలను లిఖితం చేయడానికి పూనుకున్నాడు.

ఈ రోజు మనకు తెలిసిన మహాభారతం వైశంపాయనుడికి గుర్తు ఉన్నది మాత్రమే.. గణపతి లిఖించినది కాదు..!

ఒకరు వ్రాస్తూండగా ఇంకొకరు వింటూ ఉన్నారు. రచన ఎంతో అందంగా ఉండటం చూసి, దేవతలు వచ్చి దురదృష్టవశాత్తూ దానిని దొంగిలించుకొని పోయారు. ఈ రోజు మనకు తెలిసిన మహాభారతం వైశంపాయనుడికి గుర్తు ఉన్నది మాత్రమే.. గణపతి లిఖించినది కాదు..! యుద్ధం అయిపోయిన తరువాత వైశంపాయనుడు మహాభారత కధను యుథిష్టరుని రెండవ తరం వారసుడు, హస్తినాపురం చక్రవర్తి అయిన జనమేజయునికి చెప్పాడు. మనకు ఇప్పుడు తెలిసిన 100,000 పద్యాలు వ్యాసుడు చెప్పిన వాటిలో కొద్ది భాగం మాత్రమే, వాటిలో నేను ఒక 8 శాతంకన్నా తక్కువభాగం వివరిస్తాను.

 

ప్రేమాశిస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *