విశుద్ధి ఇంకా క్షుద్రశక్తి

సద్గురు: విశుద్ధి లేదా విశుద్ధ, అంటే ప్రధానమైన అర్ధం వడపోత సాధనం. మీ విశుద్ధి ఉత్తేజితం (క్రియాశీలం) అయితే, అన్నిటినీ వడపోస్తుంది. విషం అనేక రకాలుగా మీలో ప్రవేశించవచ్చు – ఒక చెడు ఆలోచనో, భావావేశమో, శక్తి, లేదా ప్రేరణ - మీ జీవితాన్ని విషతుల్యం చేయవచ్చు. ఉత్తేజితమైన విశుద్ధి మిమ్మల్ని వీటన్నిటి ప్రాబల్యం నుండి రక్షించగలదు. మరోవిధంగా చెప్పాలంటే, ఒకసారి మీ విశుద్ధి క్రియాశీలమైతే, మీ చుట్టూ ఏమి జరుగుతున్నా ఇక మీ మీద ఏవిధమైన ప్రభావం ఉండదు. సాధకులు సాధన చేసేటప్పుడు మేము సామాన్యంగా విశుద్ధిని దాటవేస్తాము, ఎందుకంటే విశుద్ధి ఉత్తేజితం అవటమంటే ఒక విధంగా మీకు రహస్య (క్షుద్ర) శక్తి పొందే ప్రయోజకత్వం కలుగుతుంది. విశుద్ధి రహస్య శక్తులకు కేంద్రం. రెండు రకాలైన రహస్య (క్షుద్ర) శక్తులు ఉన్నాయి. మూలాధార రకం ఒకటి, విశుద్ధి రకం ఒకటి. ఆదియోగి విశుద్ధి రహస్య శక్తికి అధిపతి. అందుకే అతని కంఠం నీలి రంగులో ఉంటుంది.    

ఆదియోగి - విశుద్ధి

మీకు మీ విశుద్ధిపై తగినంత ఆధిపత్యం ఉన్నట్లయితే, వివిధ స్థాయిల్లో కార్యసాధనా సమర్దత కలుగుతుంది. అప్పుడు అందరూ మిమల్ని మనవాతీతంగా ఉన్నారని అనుకుంటారు; వాస్తవానికి జరిగిందేమిటంటే మీరు మరో విధమైన కార్యసాధనా మార్గాలను ప్రాప్తింపజేసుకున్నారు.  ఆదియోగి అనేక విధాలుగా దానికి ప్రతినిధి, అందువలనే విషకంఠ, నీలకంఠ వంటి అనేక ఇతర పేర్లతోను, ఇంకా ఆయనను విశుద్ధికి సాకార స్వరూపంగానూ వర్ణిస్తారు. దీనికి అర్ధం  ఆయనకు కేవలం ఆ లక్షణం మాత్రమే ఉందని కాదు, ప్రజలు అవగాహన చేసుకోలేని అతీతమైన విషయాలను వారు ఆదియోగిలో గుర్తించారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు