సద్గురు: ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లోని చాలామంది బుద్ధిజం టిబెట్ నుండి వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ,  గౌతమబుద్ధుడు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఇంకా బీహార్ ప్రాంతాల్లో సంచరించారు. మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే; బుద్ధుడు ఎంచుకున్న మార్గమే బుద్ధిజంగా - ఒక మతంగా మార్చబడింది. ఇది, ఆయన కాలం తరువాత మాత్రమే జరిగింది. ఆయన కాలంలో, ఇది దేశంలో ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక ఉద్యమాల్లో మరొకటి.

సద్గురు ధమేక్ స్తోప్పం దగ్గర

ఈ భూమిమీద అంతటా, ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్షను విస్తరింపజేయాలనుకున్నారు. ఎందుకంటే, ఆయన వచ్చినప్పుడు ఏదైతే ఎంతో గొప్ప ఆధ్యాత్మిక దేశంగా ఉండేదో, అది ఎంతో మారిపోయింది. ఆధ్యాత్మిక ప్రక్రియ అంతా కేవలం క్రతువులు గానే మిగిలిపోయాయి. అందుకని ఆయన ఆ పరిస్థితిని మార్చాలని అనుకున్నారు. ఆ తరువాత ఎంతోమంది శిష్యులు చేరి దీనిని బుద్ధిజంగా మలిచారు.

కానీ గౌతముడు ఎప్పుడూ ఏదీ ఒక మతాన్ని ఉద్దేశించే దిశగా చెప్పలేదు. బుద్ధుడి విధానం ఇంకా యోగ సాంప్రదాయం, ఈ రెండూ ఒకదాని నుండి మరొకటి వేరు కాదు. గౌతముడు సత్యాన్వేషణ చేస్తున్న ఎనిమిది సంవత్సరాల కాలంలో తానూ ఒక యోగి దగ్గర నుంచి మరొక యోగి దగ్గరకి సంచరించేవారు. అందుకని భారతదేశంలో ప్రజలు ఆయనని మరొక యోగిగానే చూశారు.

అందుకే భారతదేశానికి వెలుపల వృద్ధిచెందినట్లుగా భారతదేశంలో బుద్ధిజం వృద్ధి చెందలేదు. ఈ సంస్కృతిలో కాకుండా వేరే సంస్కృతిలోని ప్రజలకు ఇటువంటి జ్ఞానం ఎప్పుడూ లేదు. ఇది వారికి ఎంతో కొత్తది. అందుకని ప్రజలు ఈ దిశగా చూడడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ దేశమంతా కూడా బుద్ధుడి విదానంలో నడిచింది. కానీ భారతదేశంలో మనకు ఎన్నో ఎంపికలున్నాయి. ఎన్నో మార్గాలలో ఇది ఒకటి.

విభిన్న సంస్కృతుల కలయిక

పద్మసంభవుడు

టిబెట్ లోని బుద్ధిజంకు ఉన్న ప్రాధమిక అంశాలూ, టిబెట్ కు సంబంధించిన ముఖ్యమైన గురువులు, పద్మసంభవుడివంటివారు, వీరంతా కూడా యోగ-తాంత్రిక సంప్రదాయలనుంచి వచ్చినవారే. పద్మసంభవుడు టిబెట్ కు పదమూడు వందల సంవత్సరాల క్రితం వెళ్ళారు.

భారతదేశంలో ఇస్లాం దండయాత్రలు జరిగినప్పుడు, మొట్టమొదట వారు ఆధ్యాత్మిక ప్రదేశాలనే ఆక్రమించేవారు.

ఆపాటికి భారతదేశంలో ఉన్న బుద్ధిజంలో యోగ-తంత్ర పరమైన సంస్కృతులు ఎంతగానో మేళవించబడి ఉన్నాయి. బుద్ధిజం మొట్టమొదట ఏవిధంగా అయితే బోధించబడిందో, అది సాధారణ ప్రజలను ఉద్దేశించినది కాదు. అది సన్యాసులకు ఉద్దేశించబడినది. అందుకని, కొంతమంది ఆత్మజ్ఞానులు యోగ-తాంత్రిక సాంప్రదాయాలను తీసుకుని, బుద్ధుని మార్గంతో కలిపి దీనిని అందమైన జీవనవిధానంగా తీర్చిదిద్దారు.

పద్మసంభవుడు టిబెట్ కు వచ్చినప్పుడు, ఆయన బాన్ మతాన్ని ఈ మార్గంలో మేళవించే ప్రయత్నం చేశారు. అప్పటి వరకూ, టిబెట్లో బాన్ మతం మాత్రమే ఉండేది. టిబెట్లో ఉన్న బాన్ మతం ముఖ్యంగా నిగూఢ విద్యకి సంబంధించినది.

ఏదో కొత్త విధానాన్ని బోధించే ప్రయత్నం చేసే బదులుగా పద్మసంభవుడు బాన్ మతాన్నే మూలంగా తీసుకుని దానిమీద బుద్ధుని మార్గాన్ని, తంత్ర-యోగ సంస్కృతులను అందులో అందంగా కలగలిపారు. ఈరోజున టిబెట్లో ఉన్న బుద్ధిజం వీటన్నిటి మేళవింపే....!

ముక్కలు ముక్కలుగా ఒకటై

తరువాత వచ్చిన గురువులందరూ కూడా వారు టిబెట్కు వెళ్ళాలన్న ఉద్దేశంతో వెళ్ళలేదు. భారతదేశంలో ఇస్లాం దండయాత్రలు జరిగినప్పుడు, మొట్టమొదట వారు ఆధ్యాత్మిక ప్రదేశాలనే ఆక్రమించేవారు. అందుకని ప్రజలు హిమాలయాలకు, టిబెట్ ప్రాంతానికి తరలిపోయేవారు.

మీరు టిబెట్ బుద్ధిజాన్ని చూసినట్లయితే, మీకు తంత్రం అర్థం కాకపోవచ్చు. కానీ, మీరు వారి చిత్రపటాలను చూస్తే, మండలాలూ, మంత్రాలూ అన్నీకూడా తంత్ర విధానం లోనుంచి తీసుకోబడినవే. ఇవన్నీ వారు ముక్కలు-ముక్కలుగా తంత్ర విధానాల నుంచీ, కాశ్మీర శైవాన్నుంచీ ఎంచుకున్నవే. కాశ్మీర శైవంలో యోగ-తంత్ర అంశాలు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నాయి.

టిబెట్ తంగ్క

వారు వీటినుంచి చిన్న-చిన్న ముక్కలను తీసుకుని ఏదో ఆట బొమ్మలని తయారు చెయ్యాలనుకున్నారు కానీ, వారు ఒక పెద్ద యంత్రాంగాన్నే తయారు చేసేశారు. టిబెట్ బుద్ధిజంకి ఉన్న అందం ఇదే.  దాని సరళత కూడా ఇదే. కానీ అదే సమయంలో అది ఎంతో సున్నితమైనది కూడా. ఇది ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనది, విశిష్టమైనది.