ప్రశ్న: నేను ఎరుకతో నిదానించాలని చేస్తున్న ప్రయత్నం వల్ల అంతర్లీనంగా ఉన్న ఆనందం చాలా గుర్తించగలుగుతున్నాను. ఎందుకిలా? ఇలా చేయడం మంచిదేనంటారా?

సద్గురు: క్రియాశీలత నుండి కొంత కాలం ఉపసంహరించు కోవడం మంచిదే. కానీ, ఎలా ఉపసంహరించు కోవాలో మీకు తెలీకపోవచ్చు, లేదా మీరు బాగా చిక్కుకు పోలేదు, మీకు ఉపసంహరించుకునే హక్కు లేదు. చాలా మందికి వారికి నచ్చినప్పుడు ఉపసంహరించుకునే హక్కు లేదు. అలాంటి విషయమేదీ వారి జీవితంలో లేనట్టే, ఎందుకంటే వారికి 35 సంవత్సరాల ఇంటి అప్పుతీర్చాల్సి ఉండడమో, 15 సంవత్సరాల కారు లోన్ తీర్చాల్సి ఉండడమో లేదా బీమా చెల్లింపులు ఉండడం లేదా స్మశానంలో స్థలం ఖరీదు చేయడం లాంటివి ఉండటమే ఇందుకు కారణం..! ఇది ఒక అమెరికా వ్యక్తికి జరిగిన సంఘటన. అతడు తనకోసం ఒక శ్రేష్టమైన సమాధి స్థలాన్ని కొనుగోలు చేయడం కోసం తన జీవితంలో సగం సమయాన్ని కేటాయించాడు. సమాధుల్లో కూడా శ్రేష్టమైన  స్థలాలున్నాయి..! అతడు తన 70 సంవత్సరాల వయస్సులో మొట్టమొదటి సారిగా కరేబియన్ దీవులకు ఓడ విహారానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఓడ మునిగిపోయింది. అతను కూడా సముద్రంలో మునిగిపోయాడు.

కానీ మీరు ప్రతీసారీ ఇలా నిదానించాలనుకుంటే మాత్రం మీకు మీరుగా బోల్తా పడినట్లే.

సమాధి లాంటి స్థిరాస్తులను మీరు అమ్మలేరు కూడా. ప్రజలు చాలా రకాలుగా చిక్కుకుపోయి ఉన్నప్పుడు, వారికి ఉన్న ఏకైక మార్గం కాస్త నిదానంగా ఉండడమే, ఎందుకంటే వారు చేస్తున్న పని నుండి ఉపసంహరించుకోవడమనేది ఈ సమయంలో వారికి వీలుకాదు. ఒకవేళ వారు, వారు చేస్తున్న పని నుండి ఉపసంహరించుకున్నా, ఆ సమయంలో వారు ఏమి చేయాలో కూడా వారికి తెలియదు. కాబట్టి కాస్త నిదానంగా ఉండడం అన్నది ప్రజలకి పనిచేయవచ్చు. కానీ మీరు ప్రతీసారీ ఇలా నిదానించాలనుకుంటే మాత్రం మీకు మీరుగా బోల్తా పడినట్లే. ఉదాహరణకి, మీకొక కార్ ఉందనుకోండి. దానిని నెలలో ఒకరోజు బాగుచేయించడానికి(సర్విస్ కోసం) తీసుకెళితే అది తిరిగి వచ్చే వరకు మనం ఎలాగో సర్దుకోవచ్చు, కానీ కార్ తిరిగివచ్చిన తర్వాత, సరియైన వేగంతో నడవగలగాలి. అలా కానప్పుడు మనకి అలాంటి కార్ లేకపోవడమే మంచిది. ఒకవేళ మనం ఎరుకతో నిదానించాలనుకుంటే, కొద్దిరోజుల పాటు అలా వెళ్ళడం మంచిదే.

కానీ మీరు ఇక నిదానంగా వెళితేనే ఆనందంగా ఉంటాను అని అనుకుంటే, మీరు కష్టాల్లో పడ్డట్లే. ఈ శరీరం, మనస్సు, జీవితం మిమ్మల్ని మీ పరిధులు దాటి ఏదోఒకటి సాధించడం కోసం ఉపకరించకపోతే, చాలా విధాలుగా ఈ జీవితం వృధా అయినట్లయితే. మీరు ఇక్కడ ఉన్నది మిమ్మల్ని మీరు భద్ర పరచుకునేందుకు కాదు. మీరు మరణించారనుకోండి, ఒకవేళ మీరు ఏదైనా అరుదైన జాతికి సంబంధించిన వారైతే అప్పుడు మేము మిమ్మల్ని ఎలా భద్రపరచాలో చూస్తాం. కానీ మనం ప్రాణంతో ఉన్నప్పుడు భద్రత గురించి ఆలోచించకూడదు, పూర్తి సామర్థ్యంతో జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయాలి. కాబట్టి జీవితంలో నిదానించడం అన్నది ఒక పరిష్కార మార్గం కాదు. కానీ మనం ఎరుకతో అలా నిదానించడం మంచిదే. ఎందుకంటే అది మీకు ఉపయుక్తమైన దానిని సాధించడం కోసం అవకాశాన్ని, సమయాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు మీ కార్యాచరణ నుండి ఉపసంహరించుకోవడం వీలుకానప్పుడు, నిదానించడం అన్నది ఒక ఎంపిక మాత్రమే. ఇది కేవలం ఒక నిర్ణీత సమయానికే పరిమితం చేయాలి, జీవితాంతం కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు