సద్గురు కాల స్వభావాన్ని పరిశీలిస్తూ, భారతీయ ఋషులు సృష్టిలోని ఈ అద్భుత అంశాన్ని ఎలా అవగాహన చేసుకున్నారో వివరిస్తున్నారు. 108 సంఖ్య ప్రాధాన్యతని కూడా సద్గురు వివరిస్తున్నారు. రుద్రాక్షమాలలో 108 పూసలే ఎందుకుంటాయో, ఇంకా అనేక చోట్ల 108 సంఖ్యకున్న ప్రాధాన్యమేమిటో వివరిస్తున్నారు.  ఈ 108 సంఖ్య ప్రాముఖ్యతను కేవలం మానవుల కోణంలోనే కాక ఇది  భూగోళానికీ, సౌరవ్యవస్థకూ కూడా ఎందుకు ముఖ్యమైనదో చెప్తున్నారు.


Sadhguruఇంకా సృష్టి జరగక మునుపు, అనంతత్వం నుండి సృష్టి జరగడానికి  మూడు సంభావ్యాలు ఉద్భవించాయి. అనంతమైన ఆకాశం ద్వారా అది కాలం, శక్తి, గురుత్వాకర్షణలరూపంలో అభివ్యక్తమైంది. ఈ మూడు ప్రాథమిక లక్షణాలు ఈ కాలరహిత, అపరిమిత స్థలాన్ని కాలనిర్ణీత, పరిమిత సృష్టిలో ఇమిడ్చాయి. ఈ మూడింటిలో కాలం – నిరంతరకాలం – ఉల్లాసపరుస్తుంది, బాధ పెడుతుంది, సంరక్షిస్తుంది, ఆగ్రహిస్తుంది, ఉప్పొంగుతుంది, కిందకు పడుతుంది. కాలం ఎవరికీ విశ్రాంతినివ్వదు. అది కీటకం కావచ్చు, పక్షికావచ్చు, వేటాడబడేది కావచ్చు, వేటగాడు కావచ్చు, పాలితుడు కావచ్చు, పాలకుడు కావచ్చు, బానిస కావచ్చు, చక్రవర్తి కావచ్చు, సుందరమైన శరీరాలు కావచ్చు, అద్భుతమైన మహళ్లు కావచ్చు, మహాయశస్సు కావచ్చు, ఘోరమైన పరాభవం కావచ్చు – ఏదైనా సరే శూన్యంలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, బుడిదగా మారిపోతుంది.

కాలం ఎల్లప్పుడూ చేతనమైనది

'కాలం' - ఇది నిరంతరం కొనసాగుతుంది. మీరు ఈ కాలంపై స్వారీ చేసి అందమైన జీవితం గడపవచ్చు, లేదా నిర్దయమైన కాలచక్రం కింద నలిగిపోవచ్చు. ఒక వ్యక్తి, కాల ప్రక్రియలో పడి నాశనమైపోవచ్చు, లేదా ఈ ప్రక్రియ వల్ల విముక్తులూ కావచ్చు. ఒక వ్యక్తి, కాలప్రక్రియలో  చిక్కుకుపోవచ్చు, మరొకరు ఈ కాల ప్రక్రియని పరిణామం చెందడానికి, తనను తాను ముక్తుణ్ణి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సృష్టిలో కాలమనేది అతి ముఖ్యమైన కోణం – చాలా మంది  అనుకునేటట్లుగా అది కేవలం ఒక మానవ భావన మాత్రమే కాదు. కాలమే లేకపోతే ప్రారంభమూ ఉండదు, అంతమూ ఉండదు. ఆద్యంతాలు లేకపోతే సృష్టే ఉండదు.

కాలమే లేకపోతే ప్రారంభమూ ఉండదు, అంతమూ ఉండదు. ఆద్యంతాలు లేకపోతే సృష్టే ఉండదు.

కాలంలోనే మన ఆస్థిత్వం ఉన్నది. కాలంలోనే మనం జన్మిచాం. కాలంలోనే మనం మరణిస్తాం. ఏ వ్యక్తి ఐనా కాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే, కాలం  ధర్మాన్ని అర్థం చేసుకున్నట్లయితే, కాల ధర్మానికి అనుగుణంగా నడుచుకున్నట్లయితే, ఆ వ్యక్తి జయుడే కాదు, విజయుడవుతాడు. ఒకరిక్కడ సాధించవచ్చు, మరొకరు మరొకచోట. కాలధర్మానికి అనుగుణంగా లేని వ్యక్తి జీవిత ప్రక్రియలో నలిగి నశించిపోతాడు. జీవితం అన్నది కాలం ఆడే ఒక ఆట. దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే ఈ దేశంలోని ప్రాచీన ఋషులు, మునులు, యోగులు కాలంపై అత్యంత శ్రద్ధ పెట్టారు. కాలం అంటే మన భావన ప్రస్తుతము, మన చుట్టూ వెనువెంటనే ఉన్న సృష్టికి – భూగోళానికీ, సౌరవ్యవస్థకూ – సంబంధించినది.

108 సంఖ్య ప్రాధాన్యత

ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్ర రచన అయినటువంటి సూర్యసిద్ధాంతం ప్రకారం సూర్యకాంతి, 0.5 నిమిషాలలో 2,202 యోజనాలు ప్రయాణిస్తుంది. యోజనం అంటే తొమ్మిది మైళ్లు. 2,202 యోజనాలంటే 19,818 మైళ్లు. ఇక్కడ నిమిషం అంటే 16/75 సెకండ్లు. అర నిమిషం అంటే 8/75 సెకండ్లు. అంటే 0.106666 సెకండ్లు. 0.106666 సెకండ్లకు 19,818 మైళ్ల వేగం అంటే అది సెకండుకు 185,793 మైళ్లు. ఇది దాదాపు ఆధునిక శాస్త్రీయ గణాంకాలకు చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు కాంతి వేగాన్ని సెకండుకు 186,282 మైళ్లుగా నిర్ణయించారు. ఆధునిక విజ్ఞానశాస్త్రం ఈ ఫలితాన్ని సాధించడానికి ఎంతో ప్రయత్నం చేసింది, ఎన్నో పరికరాలు ఉపయోగించింది. కాని, కొన్నివేల సంవత్సరాల కిందటే, మానవ వ్యవస్థ, సౌరవ్యవస్థ కలసి ఎలా పనిచేస్తాయో గమనించడం ద్వారా ఈ వేగాన్ని వాళ్లు కనుక్కోగలిగారు.

సూర్యుడికీ భూమికీ ఉన్న దూరం, చంద్రుడికీ భూమికీ ఉన్న దూరం, భూభ్రమణ విధానం, దానికున్న ప్రభావం – వీటన్నిటినీ శ్రద్ధగా పరిశీలించారు.

సూర్యుడికీ భూమికీ ఉన్న దూరం, చంద్రుడికీ భూమికీ ఉన్న దూరం, భూభ్రమణ విధానం, దానికున్న ప్రభావం – వీటన్నిటినీ శ్రద్ధగా పరిశీలించారు. సూర్యుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే సూర్యుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. అట్లాగే చంద్రుడి వ్యాసాన్ని 108 తో గుణిస్తే చంద్రుడికీ, భూమికీ మధ్య దూరం వస్తుంది. సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. అందుకే మనం హారంలో 108 పూసలు గుచ్చుతాం.
ఇట్లా నేను అద్భుతమైన అంకెలెన్నో చెప్పగలను. కాని అన్నిటికంటే ముఖ్యమైంది కాలనిర్మాణానికీ, మానవ శరీర నిర్మాణానికీ ఉన్న గాఢ సంబంధం. ఇది మీకు తెలిసిన విషయమే - భూగోళం ఇంచుమించు గుండ్రంగా ఉంది. దాని కక్ష్య స్వల్పవక్రంగా ఉంది. దాని ప్రయాణం స్వీయ భ్రమణంతో వృత్తాకారంలో జరుగుతుంది. ఒక ఆవృత్తి పూర్తికావడానికి 25,920 సంవత్సరాలు పడుతుందని మనకిప్పుడు తెలుసు. ఈ వంపు ప్రధానంగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల కలుగుతుంది. ఈ ఆవృత్తి కాలాన్ని యుగచక్రం అంటాం. ఒక్కొక్క యుగచక్రంలో ఎనిమిది యుగాలుంటాయి.

భూమి, మనిషి

ఒక అక్షీయ భ్రమణ చక్రం – 25,920 ని 60 (ఆరోగ్యవంతుడైన మనిషి గుండె నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటుంది) తో భాగిస్తే – 432 వస్తుంది. ఈ 432 అనే సంఖ్య అనేక సంస్కృతుల్లో వస్తుంది – నార్స్ సంస్కృతి, ప్రాచీన యూదు సంస్కృతి, ఈజిప్టు సంస్కృతి, మెసెపొటేమియన్ సంస్కృతి, అలాగే భారతీయ సంస్కృతి.  432 ఎందుకు? మీ ఆరోగ్యం చక్కటి స్థితిలో ఉంటే మీ గుండె నిమిషానికి 60 సార్లు కొట్టుకుంటుంది. అంటే గంటకు 3600 సార్లు. అంటే రోజుకు 3600×24 సార్లు, అంటే 86,400 సార్లు. మీరు 864 ను 2 తో భాగిస్తే 432 వస్తుంది.
మీరు ఆరోగ్యంగా ఉంటే నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తారు. మీరెంతో సాధన చేస్తే అది 12 కు వస్తుంది. నిమిషానికి 15 సార్లు శ్వాస అంటే గంటకు 900 సార్లు, రోజుకు 21,600 సార్లు. 216 ను 2 తో గుణిస్తే 432 వస్తుంది. మీరు భూమి చుట్టు కొలతను తీసుకుంటే దాన్ని నాటికల్ మైళ్లలో కొలవాలి. భూగోళ స్వభావానికి అదే అసలైన కొలమానం . మనం వాడే కొలమానాలు మన సౌకర్యానికి సంబంధించినవి.
ఒక వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయని మీకు తెలుసును. అట్లాగే భూగోళం పైనా 360 డిగ్రీలుంటాయి. ప్రతి డిగ్రీని 60 నిమిషాలుగా విభజించవచ్చు. ఒక నిమిషం ఒక నాటికల్ మైలు. అంటే భూమధ్యరేఖ వద్ద భూమి చుట్టుకొలత 21,600 నాటికల్ మైళ్లు – మీరు రోజుకు శ్వాస తీసుకునే పర్యాయాల సంఖ్యకూడా అదే. అంటే భూగోళం తన చుట్టూ తాను సమయం ప్రకారం పరిభ్రమిస్తూ ఉంటేనే మీరు బాగుంటారు. కాని భూపరిభ్రమణం సమయం తప్పితే మన పరిస్థితి అధోగతి. మీరు దానికి అనుగుణంగా లేకపోయినా అది మీకు మంచిదికాదు.

మీరు కాలంపై స్వారీ చేయకపోతే మీ జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది – బహుశా కష్టాలమయంగా కూడా ఉండవచ్చు.

కాలం అన్నది మనం కనుక్కున్న భావన కాదని చెప్పడానికే ఇదంతా – కాలం అన్నది వ్యవస్థలో గాఢంగా వేళ్లూనుకొని ఉంది, మన నిర్మాణమే దానికి అనుగుణంగా జరిగింది. మనం మహాభారతం చదివితే యుగాల గురించీ, అవి ఎలా నడుస్తాయన్న దాని గురించీ ఎన్నో విషయాలు చెప్పారు. మానవజీవితంపై కాలప్రభావాన్ని మీరు పరిశీలించాలని నా కోరిక. ఇదేదో ఎవరో ఊహించింది కాదు – ఇదొక అద్భుతమైన, గొప్ప విజ్ఞానం. యోగా ఎల్లప్పుడూ దీనితో గాఢంగా పెనవేసుకుని ఉంది. దాని గురించి సిద్ధాంతాలు చేయడంలో యోగా దృష్టి పెట్టదు. అభ్యాసంతో మనం మన శరీరాన్ని సృష్టికీ, కాలాలకీ, స్థలాలకీ అనుగుణంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వాటికి అనుగుణంగా లేకుండా మనం ముందుకు సాగలేం. మీరు కాలంపై స్వారీ చేయకపోతే మీ జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది – బహుశా కష్టాలమయంగా కూడా ఉండవచ్చు. మీరు కాలంపై స్వారీ చేయగలిగితే మీ జీవితం అసాధారణంగా ఉంటుంది - మానవ దేహం , మానవ మేధస్సు ఇందుకనుగుణంగానే రూపొందించబడ్డాయి.

సంక్షిప్తంగా అంకెలు :
0.5 నిమిషానికి 2202 యోజనాలు
యోజనం = 9 మైళ్లు
నిమిషం = 16/75 సెకండ్లు
2202 యోజనాలు 0.5 నిమిషంలో = 2202×9 మైళ్లు 0.5× (16/75) సెకండ్లు
= 19818 మైళ్లు 0.10666 సెకండ్లలో
= 185,793 మైళ్లు సెకండుకు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు