సద్గురు: మీరు చూస్తే భారతదేశంలో దక్షిణ భాగంలోని దాదాపు అన్ని నగరాలు - ముంబై, హైదరాబాద్, చెన్నై ఇంకా బెంగుళూరులో గత దశాబ్దంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గతంలో ఇలాంటివి మనం ఎప్పుడూ వినలేదు. వర్షపు నీటిని నిర్వహించడానికి మనం సిద్ధంగా లేనందున ఇది జరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్‌తో, దక్షిణ ద్వీపకల్పంలో రోజులు గడిచేకొద్దీ మరింత ఎక్కువ వర్షాలు కురుస్తాయి ఇంకా మనం దిద్దుబాటు చర్యలు చేసినప్పటికీ, అది సరవ్వడానికి సంవత్సరాలు పడుతుంది. 

మనం నడిచే కాలిబాటలన్నీ కాంక్రీట్‌ అయ్యి ఉండాలని అనుకుంటాము. కాదు, ఉపరితలం స్థిరంగా ఉంటూ అదే సమయంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి తగినంత ఖాళీలు ఉన్న విధంగా ఇది చేయవచ్చు.

వర్షాకాలంలో మన వీధులు చాలా వరకు వాగులు, నదుల్లా ప్రవహిస్తున్నాయి. దీన్ని నిర్వహించడానికి నగర పాలక సంస్థలు కొన్ని చట్టాలను ఆమోదించాలి. ఉదాహరణకు, మనం నడిచే కాలిబాటలన్నీ కాంక్రీట్‌ అయ్యి ఉండాలని అనుకుంటాము. కాదు, ఉపరితలం స్థిరంగా ఉంటూ అదే సమయంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి తగినంత ఖాళీలు ఉన్న విధంగా ఇది చేయవచ్చు. ఇది జరగాలి. 

మనం నగరాల్లోని బహిరంగ ప్రదేశాలలో ఇకపై అన్ని కొత్త నిర్మాణాలు తప్పనిసరిగా పూర్తిగా కాంక్రీట్ కాకుండా చిల్లులు కలిగిన కాంక్రీటును ఉండేలా ఒక చట్టాన్ని తీసుకురావచ్చు.

నగరంలో ప్రస్తుత పరిస్థితి మార్చడానికి ప్రయత్నించడం చాలా పెద్ద వ్యవహారం, కానీ ప్రపంచంలోని కొన్ని నగరాల్లో సాధారణ సాంకేతికతలు అవలంబించబడ్డాయి. నేను ఆ ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేశాను. అమెరికాలో చట్టనూగా ఒక నగరం, ఇది మా యోగా కేంద్రానికి చాలా దగ్గరగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో పార్కింగ్ స్థలాలు అనేక, అనేక చదరపు మైళ్ల వరకు ఉంటాయి. వారు చేసిన ఒక సాధారణ విషయం ఏమిటంటే, పార్కింగ్ స్థలాల  కాంక్రీటు లేదా సపోర్ట్ ఫ్లోరింగ్‌ను రంధ్రాలు ఉన్న చిల్లులు గల కాంక్రీట్ బ్లాకులతో భర్తీ చేయడం. ఇది భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. చట్టనూగా వంటి చిన్న నగరానికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. కాబట్టి దీనికి పెట్టుబడి అవసరం. కనీసం మనం నగరాల్లో బహిరంగ ప్రదేశాలలో ఇకపై అన్ని కొత్త నిర్మాణాలు తప్పనిసరిగా పూర్తిగా కాంక్రీట్ కాకుండా చిల్లులు కలిగిన కాంక్రీటును ఉండేలా ఒక చట్టాన్ని తీసుకురావచ్చు. ఇవన్నీ మనం చేయగల చిన్న, చిన్న పనులు.

అన్నింటికీ మించి, జనాభా సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల, ఈ గ్రహం మీద ఇంకేమీ జరగడానికి ఆస్కారం లేదు. నా చిన్నతనంలో, బెంగళూరు నగరంలో 1000 చెరువులు, సరస్సులు ఇంకా మూడు జీవ నదులు ఉండేవి. నేడు ఈ నదుల జాడ లేదు. ఇంకా కేవలం ఎనభై సరస్సులు, చెరువులు మాత్రమే ఉన్నాయి. వీటిలో, కేవలం ముప్పై ఆరిట్లో మాత్రమే నిజానికి నీరు ఉంది; మిగిలిన వాటిలో కేవలం మురుగు నీరు, రసాయన వ్యర్థాల నురుగులున్నాయి. ఈ నీటి వనరులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదు. ప్రతిచోటా నిర్మాణాలు జరిగిపోయాయి. ఇది నలభై సంవత్సరాల కాలంలో జరిగింది. ఇది జనాభా వల్ల ఒత్తిడి

చెన్నైలో, ప్రజలు తమ ఇళ్లను నది ఒడ్డున, వరద మైదానాలలో నిర్మించుకున్నారని గ్రహించలేదు, మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద వర్షం తర్వాత అన్నీ కొట్టుకుపోతాయి. ఒక సంవత్సరంలో, అది మళ్లీ పొడిగా ఉంటుంది ఇంకా ప్రజలు దాని గురించి మర్చిపోయి మళ్లీ ఏదో కట్టుకుంటారు. బెంగుళూరులోని సుభాష్ నగర్ మైదానంలో ఈరోజు బస్సులు నిలిపి ఉంచిన చోటు నిజానికి ఒక సరసు. సరస్సులు ఉండే చోట ప్రజలు క్రికెట్ ఆడుతున్నారు. మనం ఆహారం తినడం వల్ల, నీళ్లు తాగడం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నామని మర్చిపోకూడదు. మనం చేసే మిగతావన్నీ దీని తరవాతే. ఈ దేశంలోని మట్టి ఇంకా నీరే ప్రధాన సమస్య. 

మన నదులు, సరస్సులు ఇంకా చెరువులు నిండాలంటే, నేల రూపురేఖలను గుర్తించడం చాలా ముఖ్యం, గతంలో నీరు ఎలా ప్రవహించేది ఇంకా ఆ నివాసాలను తొలగించే ధైర్యం మనకు ఉండాలి - అది మీదైనా లేదా నాదైనా. ఈ ఇళ్లను తొలగిస్తే మీకు మరోచోట ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చట్టాలు చేయాలి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ ఇంకా ప్రజలు వివాదాలు చేస్తారు, కోర్టులకు వెళతారు. ఇది క్లిష్టంగా ఉంటుంది, కానీ కనీసం మనం నిర్మించే నగరాల్లోని కొత్త ప్రాంతాల్లో, సహజంగా నీటి సేకరణ జరిగే విధంగా దీన్ని ఖచ్చితంగా తయారు చేయవచ్చు.

ప్రాథమికంగా, భారీ వర్షాలు కురిస్తే, దానిని పట్టుకోవటానికి వృక్షసంపద లేనందున ప్రధాన నగరాల్లో వరదలను చూస్తున్నాము. మీరు వరదలను నియంత్రించాలనుకుంటే, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమిపై గణనీయమైన వృక్షసంపద ఉండాలి, తద్వారా నేల నీటిని పట్టి ఉంచుతుంది. అప్పుడు మాత్రమే నీరు నిలుస్తుంది, లేదంటే ప్రవహిస్తుంది. అందుకే కావేరి నదిని పునరుజ్జీవింపజేసేందుకు నేను కావేరి కాలింగ్ ఉద్యమాన్ని చేపట్టాను. ఇందులో భాగంగా 242 కోట్ల చెట్లను నాటేందుకు రైతులను ఆదుకోవడంతో పాటు వృక్ష వ్యవసాయానికి మారాలని చూస్తున్నాం. పది నుండి పన్నెండేళ్లలో మీరు నిజంగా ఒక నదిని గణనీయంగా పునరుద్ధరించగలరని, అదే సమయంలో రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని మేము ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాము. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది పర్యావరణానికి ఇంకా ఆర్ధిక వ్యవస్థకి మధ్య పోటీ కాదు. జీవావరణన్ని పునరుద్ధరించడం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒకసారి కావేరి పరీవాహక ప్రాంతంలో దీనిని అమలు చేయగల పెద్ద-స్థాయి నమూనాగా చూపితే, ఇతర నదులకు కూడా దీనిని అమలు చేయవచ్చు.