సద్గురు: ప్రతి మానవుడు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏమిటంటే, ‘ఒక రోజున మనం మరణిస్తాము’ - అనే జీవితంలోని అత్యంత ప్రాధమికమైన వాస్తవం చుట్టూ, తమ మానసిక ఇంకా భావోద్వేగ స్థితిని నిర్మించుకోవాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే, ఆధ్యాత్మిక ప్రక్రియకు, భౌతికాతీత కోణానికి మీరు సహజంగా అర్హులు కాగలరు. మీ తార్కిక మనస్సు స్వభావం ఎటువంటిదంటే, అది మరణాన్ని దాని ఆలోచనా పరిధిలో నుండి పూర్తిగా తొలగించాలని కోరుకుంటుంది. ఇందువల్లనే చాలా మంది ప్రజలు తమ మానసిక ప్రక్రియను, వారేదో ఎప్పటికీ ఉండిపోయే వారిలాగా, అమరత్వం అనే అర్థంలేని ఆలోచన చుట్టూ నిర్మించుకుంటున్నారు. ‘ఇది ఒక పరిమితమైన సమయం అనీ, ఇంకా మీరు మునుపటి తరం నుండి తరువాతి తరానికి దివిటీ చేరవేర్చే వారు మాత్రమే అని’ ప్రతిరోజూ వారి ఆలోచనలో గుర్తుచేయబడడం లేదు. ప్రస్తుతం, ప్రజలు తాము మర్త్యులం అని అర్థం చేసుకోవడానికి జీవితకాలం పడుతుంది; వారికి అది గుర్తుకురావాలంటే, వారికి ఒక గుండెపోటో, లేదా శరీరంలో ఒక ప్రాణాంతక గడ్డో రావాల్సి వస్తుంది.

మీ జీవితంలోని ప్రతి క్షణాన్నీ వేడుక చేసుకుని, దానిని ఆనందించాలి ఎందుకంటే, ఇది మన కోసం ఒక్క క్షణం కూడా ఆగదు.

మీ జీవితంలోని ప్రతి క్షణాన్నీ వేడుక చేసుకుని, దానిని ఆనందించాలి ఎందుకంటే, ఇది మన కోసం ఒక్క క్షణం కూడా ఆగదు. కాబట్టి మీరు దీన్ని ఒక సంతోషకరమైన ఇంకా అద్భుతమైన ప్రక్రియగా చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు గనుక అమరత్వాన్ని కలిగి ఉంటే, మీరు నిరాశ, ఆందోళన, పిచ్చి ఇంకా కష్టాలను ఒకోక్కదాన్నీ వందేళ్ళు పాటూ ఆనందించి, ఆ తరువాత 500 వ వార్షికోత్సవం సందర్భంగా, మీరు ఆనందంగా మారవచ్చు. కానీ అలా కాదు. మీరు మర్త్యులు, ఇంకా అది గడిచి పోతూ ఉంది.
మీరు ఇక్కడ ఎప్పటికీ ఉంటామని అనుకుంటే, వాస్తవికతతో సంబంధం లేని మీ సొంత మానసిక చెత్తలో చిక్కుకుపోయి, మీరు జీవితాన్ని పూర్తిగా విస్మరిస్తారు. కానీ ఒకవేళ మరో గంటలో మీరు చనిపోబోతున్నారని మీకు తెలిస్తే, మీరు జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని గమనిస్తారు. మీరు దేనినీ చేజార్చుకోరు.

ఇది ఒక విషమ సందేశం కాదు, ఇది జీవానికి సంబంధించిన సందేశం. మీరు జీవితం అనేది, ఓ కొద్ది పరిమితమైన కాలం మాత్రమే అని తెలుసుకున్నప్పుడే, మీరు నిజంగా జీవం మీద దృష్టిపెట్టే వారు కాగలరు. విచారంగా ఇంకా నిరుత్సాహంగా ఉండడం అనేది మరణానికి సంబంధించినది, అవునా? మీరు అమరులమని భావిస్తున్నారు కాబట్టే, మీకు వీటన్నిటికీ సమయం దొరుకుతున్నది.

చికాకు, నిరాశ, ఆందోళనకు లేదా కోపానికి సమయం లేనే లేదు. ఆహ్లాదం కాని ఎటువంటి వాటికీ ఈ జీవితంలో చోటు లేనే లేదు. మీరు ఇక్కడ ఎప్పటికీ ఉంటామని అనుకుంటే, వాస్తవికతతో సంబంధం లేని మీ సొంత మానసిక చెత్తలో చిక్కుకుపోయి, మీరు జీవితాన్ని పూర్తిగా విస్మరిస్తారు. కానీ ఒకవేళ గనుక రాబోయే గంటలో మీరు చనిపోబోతున్నారని మీకు తెలిస్తే, మీరు జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని గమనిస్తారు. మీరు దేనినీ చేజార్చుకోరు.

మీరు మర్త్యులమని మీకు తెలిస్తేనే, మీరు ఈ జీవితాన్ని నిజంగా ఆస్వాదించి, ఆనందంగా గడపగలుగుతారు. ఇది మీకు నిరంతరం గుర్తుచేయబడుతూ ఉంటే, ఈ మొత్తం జీవిత ప్రక్రియ, ‘మానసిక చెత్త నుండీ ఇంకా భౌతికత్వం నుండి బయటపడి, ప్రతిదాన్నీ అనుభూతి చెందాలి’ అనుకుంటుంది. ఇది ఎంతో సావధానంగా అవుతుంది. మీ జీవితం సహజంగానే దీనికి అతీతమైన దాని కోసం చూస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది మీకు ఒక సహజమైన అభివృద్ధి ప్రక్రియగా మారుతుంది - మిమ్మల్ని అందులోకి నెట్టవలసిన విషయంగా కాదు.

Editor’s Note: Download the video “Unraveling Death”, in which Sadhguru explores the intricacies behind death and dying, from the time of entering the womb to exiting the body.