ప్రశ్న: ఎవరినన్నా కలిసినప్పుడు వారితో సుముఖంగా ఉండడానికి నేను చాలా గాభరాపడతాను. అదేమన్నా మానసిక సమస్యా? లేక నేను సమాజంలో ఇమడలేనా? దానికి నేను ఏమి చేయాలి? 

సద్గురు: మీరు యోగ అనే మాటను ఖచ్చితంగా వినేవుంటారు, యోగా అన్నప్పుడు అందరూ వెంటనే అదేదో శరీరాన్ని వంచటం, తిప్పటం అనుకుంటారు. కానీ అది కాదు. యోగా అంటే అర్థం ఐక్యత. జీవితంపట్ల మీ అవగాహన ఏమిటంటే, అక్కడ మీరు ఉన్నారు, ప్రపంచం ఉన్నది, అంటే అది మీకు, విశ్వానికి మధ్య ఉన్న పోటీ అవుతుంది. మీకు ఈ విశ్వానికి పోటీ అంటే, అటువంటి పోటీలోకి వెళ్లడం మీకు కష్టమవుతుంది. మీకు అటువంటి పందెం గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరు విశ్వంతో పోటీ పడవద్దు.

అందుకే యోగా ద్వారా ఒక సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం మనం చేస్తున్నాము. యోగా లేక ఐక్యత అంటే అర్థం ఏంటంటే మీరు ఎరుకతో మీకు వ్యక్తిగతంగా ఉన్న సరిహద్దులను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని. అప్పుడు మీరు, ఈ విశ్వం అనేవి వేరుగా చూసే అవకాశం ఉండదు, అంతా ఒకటే అనిపిస్తుంది. మీరు కాస్త యోగా చేయాలి, లేకపోతే అన్ని రకాల ఆలోచనలు, మనోభావాలు, ఉద్దేశాలతో మీ బుర్ర వక్రమై పోతుంది.

దానికై యోగా అనే  పూర్తి సాంకేతికత  ఉన్నది.  అది మీరు మీ శారీరక, మానసిక, శక్తిపరమైన ఒడిదుడుకులకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంది. మీరు దీనిని ఓ స్థాయికి తీసుకు వెళితే ఎవరితోనైనా మీరు స్థిమితంగానే ఉంటారు.

మీరు కాస్త సుముఖంగా ఉంటే, మీరు మీ వ్యక్తిగతమైన హద్దులను చెరిపితే, అది చాలా సులువు అవుతుంది. ఎందుకంటే, మీరు అలా ఉంటే, మరో వ్యక్తిని కూడా మీలో భాగం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. అక్కడ ఉన్నవారు పురుషుడైనా, స్త్రీ అయినా, పిల్లవాడైనా, ఇక సమస్య ఉండదు. మీరు అందరితో, అన్నింటితో, ఏ విధమైన హద్దులు లేకుండా సంభాషించగలరు, ఎందుకంటే మీరు హద్దులను చెరిపేశారు. మీరు మీ హద్దులను దృఢం చేసుకుంటేనే మీకు సమస్య. అక్కడ ఉన్నది పురుషుడైతే ఒక రకమైన సమస్య, స్త్రీ అయితే మరో రకమైన సమస్య ఉంటాయి. 

మీరు మీ పైన కృషిచేసి, అటువంటి స్థిమితతను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. అది కేవలం మనుషితోనే కాదు, జీవంతోనే. మీరుగా ఉన్న ఈ జీవాన్ని కేవలం ఇతరులతోనే కాదు, మొత్తం జీవంతో స్థిమితతకు తేవాల్సిన అవసరం ఆసన్నమైంది. మీలో స్థిమితత్వం లోపిస్తే, మీ పూర్తి శక్తిని, సామర్ధ్యాన్ని, మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.

ప్రతి జీవిలో ఒకరకమైన ప్రతిభ ఉంటుంది. కానీ దానిని తెరవకుండానే, అనుభూతి చెందకుండానే 99% శాతం వ్యక్తులు జీవిస్తారు, మరణిస్తారు కూడా. అది పూర్తిగా తెరచుకోవాలి, మీలో సామర్ధ్యం, ప్రతిభ ఉంటే, అవి తెరచుకుంటే మీ జీవితం స్థిమితంగా ఉంటుంది. 

దానికై యోగా అనే పూర్తి సాంకేతికత  ఉన్నది. అది మీరు మీ శారీరక, మానసిక, శక్తిపరమైన ఒడిదుడుకులకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంది. మీరు దీనిని ఓ స్థాయికి తీసుకువెళితే ఎవరితోనైనా మీరు స్థిమితంగానే ఉంటారు. ఆందోళనలో అన్నీ వక్రంగా కనబడతాయి. అందుకే స్థిమితంగా ఉండటమన్నది చాలా ముఖ్యం, లేకపోతే మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేరు. 

ప్రేమాశిస్సులతో,
సద్గురు