ప్రశ్న: నమస్కారం సద్గురూ! లింగ భైరవి మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరక, ఇంకా అర అనాహత, అంటే మూడున్నర చక్రాలతో ఉందని మీరే చెప్పారు. అదే సమయంలో మీరు ఆమెను ‘త్రినేత్రిణి’ అన్నారు. అంటే మూడవ కన్ను ఉన్న దేవి అని. మరి మూడవ కన్ను ఆజ్ఞచక్రంతో జోడించబడి ఉంది కాబట్టి, మరి లింగ భైరవికి ఆజ్ఞచక్రం కూడా ఉన్నట్లేనా?

సద్గురు: మీరు అనుకున్నట్లుగా, మూడవ కంటికి ఒక భౌతిక స్థానం అంటూ ఏమీ లేదు. అక్కడ రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి మూడవ కన్ను కూడా వాటి మధ్యలో ఎక్కడో ఉందని మీరు  ఊహించుకుంటున్నారు. కానీ అది అలా కాదు. నిజానికి, ఏవైతే కాంతిని అపుతాయో, వాటినే ఈ రెండు కళ్ళు చూడగలవు. మీరు ఒక వస్తువును ఎలా చూడగలుగుతున్నారంటే, అది కాంతిని ఆపుతున్నది కాబట్టి. ఒక వస్తువు నుంచి కాంతి ప్రసరిస్తుంది అంటే, అది పూర్తిగా పారదర్శకంగా ఉంటే, మీరు దానిని చూడలేరు.

దేవి యొక్క మూడో కన్ను అని ప్రస్తావించడం అనేది ఒక సంకేతంగానే. కేవలం ఆజ్ఞ చక్రాన్ని, జ్ఞానానికి ప్రతీకగా జోడించబడింది కాబట్టే మూడవ కన్ను ఆ రెండు కళ్ళ మధ్య ఉన్నట్లు చూపిస్తారు.

మీరు మీ చుట్టూ ఉండే వాటిని చూడగలగటానికి ఉన్న ఒకే ఒక్క కారణం మీ చుట్టూ ఉన్న గాలి పారదర్శకంగా ఉన్నది కాబట్టి. అలాకాక, ఈ గాలి కాంతిని ఆపివేస్తే, ఇక మీరు ఏమీ చూడలేరు. అంటే ఈ రెండు కళ్ళతో మీరు భౌతికమైన వాటినే చూడగలరు. ఈ భౌతికమైన వాటిలో కూడా, మీరు పూర్తిగా అంతా చూడలేరు. ఈ రెండు కళ్ళతో మీరు స్థూలమైన వాటినే చూడగలరు. ఉదాహరణకు మీరు గాలిని చూడలేరు. ఎందుకంటే అది భౌతికమైనదైనా కూడా, కాంతిని ఆపటం లేదు కాబట్టి. ఇక భౌతికానికి అతీతంగా ఉన్న దానిని ఈ రెండు కళ్ళతో మీరు చూడలేరు.

భౌతికాయానికి అతీతంగా ఉన్న దేనినైనా మీరు అనుభూతి చెందటం లేక చూడటం మొదలు పెట్టిన క్షణంలో, మీకు మూడవ నేత్రం తెరుచుకుందని అంటారు. దేవి యొక్క మూడో కన్ను అని ప్రస్తావించడం అనేది ఒక సంకేతంగానే. కేవలం ఆజ్ఞ చక్రాన్ని, జ్ఞానానికి ప్రతీకగా జోడించబడింది కాబట్టే మూడవకన్ను ఆ రెండు కళ్ళ మధ్య ఉన్నట్లు చూపిస్తారు. కానీ, నిజానికి ఆ మూడవ కన్ను ఏ ఒక్క చోటా లేదు.

ఉదాహరణకి నేను ఏదైనా కొత్త చోటుకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక రకమైన శక్తి ఉన్నది, అక్కడ ఏదో జరుగుతుందని అనిపించినప్పుడు, అక్కడ ఏమి జరుగుతుందో గ్రహించడానికి, నేను మొదట చేసేది ఏమిటంటే, నేను నా కనులు మూసుకుంటాను, నా చేతి వేళ్లను చైతన్యం చేస్తాను, ఇంకా నా ఎడమ అరచేతిని క్రిందకు చూసే విధంగా ఉంచుతాను. ఏదైనా వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా అని మీకు తెలుసుకోవాలంటే, ఆ విషయం గ్రహించడానికి, మీరు మీ చేతిని దానిపైన ఉంచుతారు. అంటే మరి మీ మూడవ కన్ను మీ చేతిలో ఉందనా? అవును, ఒకరకంగా అక్కడ ఉందని అర్థం. అదేదో భౌతిక సంఘటన కాదు, అది కేవలం ఒక రకమైన గ్రహణ శక్తి.

మరి దేవికి మూడవ కన్ను ఉన్నదా? ఉన్నది, ఖచ్చితంగా. ఆమెకు మూడున్నర చక్రాలా? అవును.

ఇక మీరు భౌతికమైన దానిని గ్రహించడం గురించి మాట్లాడుతుంటే మీరు ఈ మూడవ కన్ను భౌతిక శరీరంలో ఎక్కడో ఉండడం గురించి మాట్లాడవద్దు. భౌతికం కాని దానికి, ఎక్కడో అక్కడ ఉండాలనే నిర్బంధం లేదు. అది ఇక్కడ, అక్కడ రెండు చోట్లా ఉండవచ్చు. మీరు భౌతికాతీతమైన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, అది ఎక్కడ ఉన్నదోననే విషయం గురించి ఆలోచించనవసరం లేదు. మీరు భౌతికాతీతమైన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ అక్కడ అనేది దానికి నిర్ధారణ కాదు. భౌతికం కాని దానికి ఒక స్థానం అంటూ లేదు, దానికి ఒక చోటు అంటూ లేదు. మరి దేవికి మూడవ కన్ను ఉన్నదా? ఉన్నది, ఖచ్చితంగా. ఆమెకు మూడున్నర చక్రాలా? అవును.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

 

Yantra 2018