బుద్ధిమంతులకు ఎలా సరదాగా గడపాలో తెలుసా?
యూత్ అండ్ ట్రూత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంభాషణలో, మేధస్సు, ఆనందానికి మధ్య ఉన్న సహ సంబంధాన్ని గురించి ఒక విద్యార్థి సద్గురువుని ప్రశ్నించడం జరిగింది. సద్గురు ఏం చెప్తారంటే, బుద్ధి లేదా మేధస్సు వల్ల కలిగే సంతృప్తిని అనుభవించే వారికి, పార్టీల వల్లనో లేదా పబ్బులకి వెళ్లడం వల్లనో కలిగే సంతృప్తి అర్థరహితమైనదిగా ఉండవచ్చు. కానీ, దానర్థం, వారు జీవితంలో ఎలాంటి వినోదానికి నోచుకోలేదని కాదు!

ప్రశ్న: సద్గురు, నేను పాఠశాలలోనూ, కళాశాలలోనూ చదువుకునే రోజుల్లో, బాగా తెలివైనవారు వారితో వారే ఎక్కువగా గడపడం నేను చూశాను. మనుషులందరూ ఆనందం కోసం చేసే సాధారణమైన పనులను చేయడానికి వారు మొగ్గు చూపరు. వారు బయటికి వెళ్లరు, సరదాగా గడపాలని అనుకోరు, పార్టీలకి వెళ్లరు. వారు చేస్తున్న పని మీదే శ్రద్ధ వహించడానికి మొగ్గు చూపుతారు. అయితే, మేధస్సు, సంతోషం ఏ విధంగా ముడివడి ఉన్నాయి?
వేరే ఏ జీవికైనా, బయాలజీనే వారి జీవితంలో అత్యంత ప్రభావవంతమైనదిగా ఉంటుంది. కానీ ఒకసారి మానవ రూపంలో ఇక్కడికి వచ్చాక, మీ లింగం ఎటువంటిదన్నది మీ జీవితంలో అత్యంత ప్రబలంగా ఉండదు. 18 లేదా 20 ఏళ్ల వయసులో అలాగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత మీరే గమనిస్తారు అది అలా కాదని. ఒకసారి మానవ రూపం దాల్చాక అపారమైన బుద్ధి ఉంటుంది. మేధస్సుకి, భావానికి, సచేతనత్వానికి వేరే ఇతరమైన పరిమాణాలున్నాయి. కొంతమంది భౌతికతని మాత్రమే అనుభవించగలరు. కొంతమందికి మేధోపరమైన ఆనందం ఉంటుంది లేదా వేరే ఇతర పరిమాణాలు ఉన్న ఆనందం ఉంటుంది. మీరు ఏదైతే వినోదం అనుకుంటారో అది వారు చేయకపోతే వారికి వినోదం లేదని కాదు.
మీరు చెస్ ఆడుతున్నారు అనుకోండి వేరే వాళ్ళు దాన్ని అర్థరహితమైన ఆటగా భావించవచ్చు. జీవితం మొత్తం పావులు కదపడం అని. చాలా మంది ఇలా భావిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను. కానీ, అత్యద్భుతమైన రీతిలో ఒక పావు కదపడం ద్వారా ఒక తీవ్రమైన స్థాయిలో మీరు ఆనందాన్ని పొందుతూ ఉండవచ్చు. అందువల్ల, ఒకరు ఏ రకమైన ఆనందంలో పాలు పంచుకుంటున్నారని వేరే రీతిలో ఉండవచ్చు ఇంకా వేరే రీతిలోనే ఉండాలి. ఎందుకంటే, ప్రతిఒక్కరం ఒకే దాంట్లో మునిగిపోతే, అప్పుడది జడమైన సమాజం అవుతుంది.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.
