#1 శరీరము మనస్సు రెండూ ఖాళీ కడుపుతో ఉంటేనే బాగా పనిచేస్తాయి 

సద్గురు: రోజంతా తరచూ తింటూ ఉండడం మిమ్మల్ని చురుకుగా ఉంచుతుందని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు భోజనం చేశాక మీ శరీరం ఎలా ఉంటుందో గమనిస్తే, అలాగే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మీ శరీరం ఎలా ఉంటుందో గమనిస్తే, మీ శరీరం, మెదడు రెండూ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే బాగా పనిచేస్తాయని మీరు గమనించవచ్చు. ఆహారనాళంలో ఎప్పుడూ జీర్ణ ప్రక్రియ జరుగుతుంటే సహజంగానే కొంత శక్తి ఆ జీర్ణప్రక్రియకు వినియోగింప బడుతుంది. అందువల్ల మీ శరీరం మనసు ఆ సమయంలో బాగా పని చేయలేవు.

మీరు సామర్థ్యం మేర పని చేయాలనుకుంటే మీరు తినే ఆహారం మీ పొట్ట నుంచి 1.5 నుంచి 2.5 గంటల్లో ప్రేగుల్లోకి వెళ్లే విధంగా చూసుకోండి.

మీరు సామర్థ్యం మేర పని చేయాలనుకుంటే మీరు తినే ఆహారం మీ పొట్ట నుంచి 1.5 నుంచి 2.5 గంటల్లో ప్రేగుల్లోకి వెళ్లే విధంగా చూసుకోండి. అలా చేస్తే జీర్ణ ప్రక్రియకు అప్పటినుంచి మీ శరీరం అంత ఎక్కువ శక్తిని వినియోగించుకోదు. అదేవిధంగా ఆహారం తిన్నాక 12 నుంచి 18 గంటల లోపల శరీరం నుంచి బయటకు వెళ్లిపోయేలాగా కూడా చూసుకోండి. యోగా దీని గురించే ప్రస్తావిస్తుంది. 

పొట్ట ఖాళీగా ఉండటమంటే ఆకలితో ఉండమని కాదు. శక్తి స్థాయిలు తగ్గినపుడే మీకు ఆకలి అవుతుంది తప్పితే మీ పొట్ట మాత్రం ఖాళీగా ఉండాలి.

మీరు ఆ ఎరుకతో ఉంటే, మీరు ఎంతో శక్తివంతంగా, చురుకుగా ఉన్నట్లు శారీరకంగా, మానసికంగా కూడా అనుభవిస్తారు. జీవితంలో మీరేం చేద్దామనుకున్నా కూడా విజయవంతం కావడానికి ఇవే మార్గాలు.

#2 మీ భౌతిక మానసిక ఆరోగ్యం కోసం, జీర్ణ కోశాన్ని ఎప్పుడూ శుభ్రపరుచుకుంటూ ఉండాలి

మీ కడుపులో జీర్ణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, మీ శరీరంలోని కణాల్లో శుభ్రం చేసుకునే ప్రక్రియ దాదాపు ఆగిపోతుంది. అందుకే మీరు రోజంతా ఏదో తింటుంటే, మీ శరీరంలోని జీవ కణాలు మలినాలను ఎక్కువ సేపు ఉంచుకుంటాయి, దానివల్ల కొంతకాలానికి అనేక సమస్యలు తయారవుతాయి. చివరకు మీ కడుపులోని ప్రేగుల నుంచి విసర్జన ప్రక్రియ కూడా అంతా ప్రభావవంతంగా జరగదు, ఎందుకంటే పేగుల్లోకి వ్యర్ధాలు ఒక్కసారిగా కాకుండా, ఎప్పుడు చేరుతూనే ఉంటాయి.

మీ పురీష నాళం (పెద్ద పేగు) అశుభ్రంగా ఉంటే మీరు సమస్యలను కొనితెచ్చుకున్నట్లే. మీ పురీషనాళ అశుభ్రంగా ఉండటానికి మీ మానసిక ఒడుదుడుకులకు దగ్గర సంబంధం ఉన్నదని యోగాలో మేము చెబుతాము.

మీ పురీష నాళం (పెద్ద పేగు) అశుభ్రంగా ఉంటే మీరు సమస్యలను కొనితెచ్చుకున్నట్లే. మీ పురీషనాళ అశుభ్రంగా ఉండటానికి మీ మానసిక ఒడుదుడుకులకు దగ్గర సంబంధం ఉన్నదని యోగాలో మేము చెబుతాము. మీ పురీష నాళం శుభ్రంగా లేకపోతే,  మీ మనసును మీరు నిలకడగా ఉంచలేరు.

భారతీయ ఆరోగ్య వ్యవస్థలైన ఆయుర్వేదం, సిద్ధ లాంటి వైద్య విధానాల్లో రోగి ఏ వ్యాధితో వచ్చినా సరే, వారు చేసే మొదటి చికిత్స రోగి జీర్ణవ్యవస్థను శుభ్రం చేయటం. ఎందుకంటే చాలా సమస్యలకు కారణం శుభ్రత లేని పురీష నాళం కావచ్చు.

ఈ రోజుల్లో ప్రజలు ఆహారం తీసుకునే పద్ధతి చూస్తే అలా కడుపును శుభ్రంగా పెట్టటం వారికి సమస్య అవుతుంది. మేము ఆశ్రమంలో చేసే విధంగా, మీరు రోజుకు రెండు భోజనాలు చేసి మధ్యలో మీరు ఏమి తీసుకోకుండా ఉంటే లేక కేవలం పండు లాంటివి మాత్రమే తీసుకుంటే అటువంటప్పుడు మీ ఆహారనాళం ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది.
 

యోగా విధానంలో మేము 2 భోజనాల మధ్య 6 నుంచి 8 గంటల వ్యవధి ఉండాలని చెబుతాము. అది సాధ్యం కాకపోతే కనీసం 5 గంటల అయినా ఉండాలి, అంతకన్నా తక్కువ ఉంటే, మీరు సమస్యని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.

#3 ఆహారాన్ని శరీరంలోకి చేర్చుకోవటం

Sadhguru eating a mango near Kailash | 5 Reasons Why You Shouldn’t Be Snacking Between Meals

 

మీరు మీ శరీరం, మనస్సు అని వేటిని అంటున్నారో అవి కేవలం కొంత జ్ఞాపకాల దొంతర. ఈ జ్ఞాపకం లేక సమాచారం మూలంగానే ఈ శరీరం ఒక ఆకారాన్ని తీసుకుంది. మీరు తినే ఆహారం ఈ సమాచారం మూలంగానే ఒక శరీరంగా తయారయింది. ఉదాహరణకి నేను ఒక మామిడి పండు తిన్నాననుకోండి, ఆ మామిడి పండు నా లోకి వెళ్లి ఒక పురుషుని తయారు చేస్తుంది. అదే ఒక స్త్రీ ఆ పండు తీసుకుంటే అదే పండు ఆమె లోకి వెళ్లి ఒక స్త్రీగా రూపుదిద్దుకుంటుంది. అదే పండు ఒక ఆవు తింటే అది ఒక ఆవుగా తయారవుతుంది. మరి అదే మామిడి పండు నాలో ఒక స్త్రీగా కాకుండా పురుషుని గానే ఎందుకు అవుతుంది? దానికి కారణం నా శరీరంలో ఉన్న ఒక రకమైన జ్ఞాపకశక్తి వలననే.

మీకు వయసు పెరిగే కొద్దీ ఈ విధంగా ఆహారాన్ని ఇలా మలచుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఎందుకంటే ఈ జెనిటిక్ జ్ఞాపక శక్తి, పరిణామం జ్ఞాపక శక్తులకు మీరు తినే దానిని అలా మార్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.

నేను తిన్న మామిడి పండులో ఒక భాగం చర్మంగా, నా వంటిలోనే ఉన్న రకమైన చర్మంగా ఎలా తయారవుతుంది? మీరు మామిడిపండు రంగు చర్మంతో ఎందుకు తయారు కారు? ఎందుకంటే అక్కడ అంత శక్తివంతమైన, బలమైన జ్ఞాపకశక్తి ఉన్నది. అందులో మీరు ఏమి పెట్టినా మీ జ్ఞాపక శక్తి ఆ వ్యక్తికి తగ్గట్టుగానే దానిని మలచు కుంటుంది, అంతేకాని వేరే వ్యక్తిగా దానిని మలచదు.  

మీకు వయసు పెరిగే కొద్దీ ఈ విధంగా ఆహారాన్ని ఇలా మలచుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఎందుకంటే ఈ జెనిటిక్ జ్ఞాపక శక్తి, పరిణామం జ్ఞాపక శక్తులకు మీరు తినే దానిని అలా మార్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. మీరు ఆరోగ్యంగానే ఉండవచ్చు, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండవచ్చు, అయినా మీ శరీరానికి ఆ మామిడి పండుని అంతే చురుకుగా ఉన్న వ్యక్తిగా మార్చలేక పోతుంది. అరుగుదల జరుగుతుంది కానీ ఒక ప్రాణాన్ని మరో ప్రాణిగా మలచుకునే సామర్థ్యం ఙాపకశక్తి బలహీనంగా ఉండటం వల్ల అంత బాగా జరగదు.

మీకు 35 ఏళ్లు దాటితే రోజుకు 2 భోజనాలు తీసుకోవటం చాలా చాలా ఆరోగ్యదాయకం.

మీ శరీరం కూడా తనని తాను ఈ మందకొడితనానికి సర్దుకుంటుంది. మీరు ఏమి తింటున్నారు, ఎలా తింటున్నారు, అనే విషయంలో మరింత ఎరుకతో ఉంటే మీరు మరింత సులువుగా దీనికి సర్దుబాటు చేసుకోవచ్చు. మీరు శారీరకంగా ఎంతో శ్రమిస్తూ ఉండటము లేక మీకేమైనా ఆరోగ్య సమస్య లేకపోతే, మీకు 35 ఏళ్లు దాటితే రోజుకు రెండు భోజనాలు తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. మీరు ఇంకా ఎక్కువ తింటుంటే మీరు అనవసరంగా మీ వ్యవస్థకు ఎక్కువ శ్రమను తెచ్చిపెడుతున్నట్లు. మీ శరీరం ఎదుగుదల ఆగిపోయింది కాబట్టి మీకు ఎంత ఎక్కువ ఆహారం అక్కరలేదు. మీకు ఏదైనా ఆకలిగా గాని నీరసంగా గాని అనిపిస్తే మధ్యలో ఏదో ఒక పండును తీసుకుంటే సరిపోతుంది మీరు ఈ విధంగా ఉంటే మీరు ఎంతో హాయిగా జీవిస్తారు. ఇది ఆర్థికంగానూ పర్యావరణ పరంగా ను ఆరోగ్యపరంగాను ఎంతో మంచిది.  

#4 పరిపూర్ణతను రక్షించుకోవాలి 

అసలు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఒకరకంగా మీ శారీరక, మానసిక పుష్టిని సంరక్షించుకోవటం. పరిపుష్టి అంటే నా ఉద్దేశం ఏమిటంటే, ఈ వ్యవస్థ ఒకరకంగా పరిపూర్ణంగా లేకపోతే అంటే అది వదులుగా అంటే దానికి ఏ విధమైన అనుభూతి చెందలేదు. ఎంతో గొప్ప సంఘటనలు జరుగుతున్నా మీరు వాటిని అనుభూతి చెందలేదు. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ఏవిధంగా రూపకల్పన చేయబడ్డాయి అంటే అక్కడ ఒక రకమైన శారీరకమైన మానసికమైన పరిపూర్ణతను ఏర్పరచటానికి రూపకల్పన చేయబడ్డాయి. దానివల్ల మీకు అనుభూతి చెందే సామర్థ్యం పెరుగుతుంది.

యోగులు ఇంకా సాధనలో ఉన్న వారు రోజుకి ఒకటి రెండుసార్లు మాత్రమే ఎందుకు తింటారు? మధ్యలో ఏమీ తినకుండా ఎందుకు ఉంటారు? ఎందుకంటే వారు తమ శరీరాన్ని దేనికీ తెరిచి ఉంచరు.

మీరు అనుభూతి చెందడానికి మీకు ఉన్న ఒకే ఒక్క పరికరం మీ శరీరం. మీరు నా మనసు కూడా అనవచ్చు కానీ అది కూడా ఒక రకమైన శరీరమే. మీరు మీ శరీరాన్ని బయట ఉన్న వాటికి తెరచి ఉంచితే, మీరు భౌతికమైన పరిపూర్ణతను తక్కువ చేసుకుంటున్నట్లు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు మీరు మీ శరీరాన్ని బయట వాటికి ఎన్నిసార్లు ఇలా అందుబాటులో ఉంచుతున్నారు అనేది, మీరు ఎలా ఉన్నారు అనేదాన్ని నిర్దేశిస్తుంది. మీరు మీ శరీరాన్ని బయటికి ఎప్పుడు అందుబాటులో ఉంచితే మీరు మీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నట్లు. అటువంటి శరీరానికి  పరిపూర్ణత లేదు కాబట్టి, అది ఏమీ చేయలేదు. అక్కడ ఇంటెగ్రిటీ లేనప్పుడు దానికి దేనితోనూ అనుసంధానంతో ఉండదు. మీరు ఏదో అలా బ్రతికేస్తారు, అంతకు మించి మీకేమి జరగదు.

యోగులు ఇంకా సాధనలో ఉన్న వారు రోజుకి ఒకటి రెండుసార్లు మాత్రమే ఎందుకు తింటారు? మధ్యలో ఏమీ తినకుండా ఎందుకు ఉంటారు? ఎందుకంటే వారు తమ శరీరాన్ని దేనికీ తెరిచి ఉంచరు. బయటి గాలి, నీరు తప్ప బయటవి ఏవీ తమ శరీరంలోకి చొచ్చుకొని పోకూడదు. వాటివల్ల వారి ఇంటెగ్రిటీ అంటే సూక్ష్మగ్రాహ్యత తగ్గిపోతుంది. సూక్ష్మగ్రాహ్యత అనేది మీ శరీరంగా భావిస్తున్న దానికి అతి వెలుపలి పొర. మీరు మిమ్మల్ని సూక్ష్మగ్రాహి గా ఉంచుకోవాలంటే దానిని అన్నింటికీ ఎప్పుడూ తెరచి ఉంచకూడదు. మీరు బాగా తినాలి, కాని అది విషయం కాదు, మీరు ఎక్కువసార్లు తినకూడదు.

#5 నిర్బంధత నుంచి ఎరుకలోకి పయనం

Sadhguru along with Isha Home School students saying the invocation before eating at Bhiksha Hall | 5 Reasons Why You Shouldn’t Be Snacking Between Meals

 

ఎప్పుడు కావాలంటే అప్పుడు తినకుండా ఉండటం అనేది సాధనలో ఒక భాగం ఎందుకంటే ఇది ఆహారం మీద, ఆ విషయానికి వస్తే దేనిమీదైనా నిర్బంధలను తీసివేస్తుంది. ఆహారం అనేది చాలా ప్రాథమికమైన విషయం. దీని మీద జీవితంలోని అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి.

మీరు ఆశ్రమానికి వచ్చినప్పుడు మీలో చాలామంది ఈ బాధ అనుభవించే ఉంటారు. భోజనం సమయంలో మీకు చాలా ఆకలి వేస్తుంది, మీరు భోజనశాలకు వచ్చారు, మీ ముందు ఆహారం వడ్డించబడింది, మీరు దానిని తినాలనుకుంటారు. కానీ మిగతా అందరూ తమ కళ్ళు మూసుకొని చేతులు ముడుచుకుని ప్రార్థన చేస్తున్నారు. దీని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే మీరు చాలా ఆకలితో ఉన్నారు, అయినా మీరు రెండు నిమిషాలు ఆగాలి. మీకు నిర్బంధం అనిపించేవాటితో ఇలానే ప్రవర్తించండి. మీకేది నిర్బంధంగా అనిపిస్తుందో, అక్కడ రెండు నిముషాలు ఆగండి. దాని మూలంగా అది మిమ్మల్ని బలపరుస్తుంది.  

ఆహారం అనేది చాలా ఆధారభూతమైనది, సరళమైనది అయినా మీరు దానిని ఎలా స్వీకరిస్తారనేది ఎంతో వ్యత్యాసం చూపిస్తుంది.

ఈ నిర్భందతను తొలగించడం ఎంతో ముఖ్యం. మనసు, శరీరాలు ఒక రకమైన సమ్మేళనం. వాటిపై పడ్డ అన్ని రకాల ముద్రలు, మీకు ఒక రకమైన నిర్బంధ ధోరణులను ఏర్పరుస్తాయి. మీరు వాటి ప్రకారం నడుస్తుంటే దాని అర్ధం ఏమిటంటే మీరు పరిణామం చెందకూడదని నిర్ణయించుకున్నట్లు. మీరు కొన్ని నిర్బంధరీతుల్లో బతకటానికి నిర్ణయించుకున్నట్లు. మీరు ఆ నిర్బంధతలకు అతీతంగా వేరే అవకాశాన్ని చూడకూడదని నిర్ణయించుకున్నట్లు. 

ఆహారం అనేది చాలా ఆధారభూతమైనది, సరళమైనది అయినా మీరు దానిని ఎలా స్వీకరిస్తారనేది ఎంతో వ్యత్యాసం చూపిస్తుంది. ఇది మీ లోపల నుంచి మిమ్మలను నిర్దేశిస్తున్న కొన్ని నిర్బంధాల నుంచి మెల్లగా వైదొలగడం, ఎరుకతో వైదొలగడం. బంధనం అనేది అనేక స్థాయిల్లో ఉంటుంది, కానీ మీ శరీరంతో మీకు ఉన్న బంధనమే అన్నిటికీ పునాది. అందుకే మీరు మీ శరీరంపై కృషి చేయాలి.

ఎప్పుడు కావాలంటే అప్పుడు తినకుండా ఉండటం అనేది సాధనలో ఒక భాగం ఎందుకంటే ఇది ఆహారం మీద, ఆ విషయానికి వస్తే దేనిమీదైనా నిర్బంధలను తీసివేస్తుంది.

గౌతమ బుద్ధుడు ఈ విషయంలో ఏమన్నారంటే మీరు ఆకలిగా ఉన్నప్పుడు మీకు ఆహారం అత్యవసరం ఉన్నప్పుడు మీ ఆహారాన్ని ఇంకొకరికి ఇచ్చి వేస్తే మీరు మరింత బలవంతులు అవుతారు అన్నాడు. నేను అంత వరకు వెళ్ళటంలేదు, రెండు నిముషాలు ఆగమంటున్నాను - అది మిమ్మల్ని ఖచ్చితంగా బలవంతుని చేస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు