భగవంతుడు అసలు ఉన్నాడా..? ఎక్కడ ఉన్నాడు..? అంతటా ఉన్నాడా..? - ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనకు సమాధానాలే దొరకలేదు. సద్గురు మన ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు. కాకపోతే వీటిని భౌతికతకు మించి, మన జీవితంలో శోధించడానికి మనకి విధానాలు అందిస్తున్నారు.

Sadhguruమీరు ఒక అధ్యాత్మిక పథంలో ఉన్నారంటే, మీరు సత్యాన్వేషణ చేస్తున్నారని అర్థం. కానీ, మీరు ఎలాంటి సత్యం కోసం చూస్తున్నారు..? చాలా మంది వారు ఒక గుడికో, ఒక చర్చ్ కో, ఒక మసీదుకో లేదా ఆశ్రమానికో వస్తే వారికి దీనివల్ల ఎటువంటి లాభం దొరుకుతుంది..? - అని చూస్తున్నారు. కానీ, ఎవరైతే నిజంగా శోధిస్తున్నారో వారికి  సత్యం అంటే అది ఏదో వారికి ఉపయోగపడే విషయం కాదు. ఇది అంతటినీ తనలో ఇముడ్చుకున్నది. ఇది - ప్రపంచంలో నేను ఫలానా, అని చెప్పుకోవాలని అనుకుంటున్న, తెలివైనవారి కోసం కాదు. అటువంటి వారు దేనినో ఒక దానిని జయించాలనుకుంటున్నారు.

కేవలం మూర్ఖులు మాత్రమే తాము ఫలానాగా గుర్తింపు లేకుండా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. కేవలం ఒక మూర్ఖుడు మాత్రమే తాను లొంగిపోయి, వేరే వారి చేత జయించబడాలని అనుకుంటున్నాడు. ఇక్కడ మనకి ఎంతో సుదీర్ఘకాలం నుంచి సాంప్రదాయికంగా మూర్ఖులు - ఎవరైతే తమని తాము అర్పణ చేసుకోవాలనుకున్నారో, 'ఎదైతే లేదో' దానిగా మారాలనుకున్నారో, ఇక్కడ గర్వంతో కాకుండా కేవలం ఇక్కడ మట్టిలాగ ఈ భూమిలాగా ఉండాలనుకున్నారో  అలాంటివారు ఉన్నారు. శివుడు, ఈ మూర్ఖులు ఈ ప్రపంచంలో మనలేరు అని తెలుసుకొని, వారందరినీ కూడా ఆయన ఆలింగనం చేసుకున్నారు. ఆయన వారందరినీ కూడా తానుగా కలిపేసుకున్నారు. వారి చాతుర్యంవల్ల కాకపోయినా, కేవలం వారి మూర్ఖత్వం వల్ల వారు అనుగ్రహ పాత్రులు ఆయారు.

మీరు దేనికైనా సరే, ఎంతో సరళంగా వున్నదానికి వంగి నమస్కరించడం అన్నది ఒక శక్తివంతమైన సాధనం.

మీరు విపరీతమైన తెలివిగల వారిగా, శక్తివంతమైన వారిగా ఉండడం వల్ల, మీకు ఎన్నో ద్వారాలు తెరుచుకోవచ్చు. లేదా ప్రజలు వారి కారుణ్యం వల్ల మీకు ద్వారాలు తెరవవచ్చు. కానీ మనకి ఒక గొప్ప సాంప్రదాయామే ఉంది. ఇందులో ఎంతో మంది వారు ఎలాగో ఒకలా పాకినా పర్వాలేదు... వారు దీనిని దాటాలనుకున్నారు. వీరికి ఎటువంటి లజ్జా లేదు, సిగ్గు అన్న భావన లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. ఈర్ష్య అసలే లేదు, గర్వం లేదు, అహంకారం లేదు – అసలు ఏమీ లేదు. వారికి ఎలాంటి ఆలోచన కూడా లేదు. ఇటువంటి వారు ముక్తి పొందారు.

భారతం - ఇక్కడ భగవంతుడు అంతటా ఉన్నాడు. మన భారత సంస్కృతిలో మీరు లాంఛనంగా గుడికి వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. దేనినైనా ఉన్నఫళంగా భగవంతుడిగా మార్చేయవచ్చు. ఎక్కడున్నా సరే..! ఇది ఒక అద్భుతమైన సాంకేతికత. కేవలం, ఒక రాయిని భగవంతుడిగా మార్చవచ్చు. ఆ మరుసటి రోజు, మీరు అక్కడ ఆ రాయిని పూజిస్తూ ఒక వెయ్యిమంది ప్రజలని చూడవచ్చు.....! ఈ రకమైన భావం, దేనికైనా వంగి దణ్ణం పెట్టగల భావం అన్నది – అద్భుతమైన సాంకేతికత. మీరు దేనికైనా సరే, ఎంతో సరళంగా వున్నదానికి వంగి నమస్కరించడం అన్నది ఒక శక్తివంతమైన సాధనం. ఒక చెట్టు, ఒక పుష్పం, ఒక రాయి లేదా ఒక కర్ర – ఏదైనా సరే..! మీరు వంగి నమస్కరించడానికి సుముఖంగా వుంటే - దానిపట్ల పూర్తి భక్తి భావం కలిగితే అది ఒక అద్భుతమైన సాధనం. ఈ సరళమైన సుముఖత మనకు - భారతదేశాన్నీ అక్కడ ప్రజలనూ వారి భౌతికతను దాటించి ఒక గొప్ప స్థాయికి చేర్చే మార్గాన్ని తయారు చేసింది. అందుకే, ఈ గడ్డ మీద, ఈ సంస్కృతిలో ఎంతో మంది ముక్తిని పొందారు.

భక్తి అనేది ఒక విషయం పట్ల మీ దృష్టిని పెట్టగలగడం. మీరు ఎల్లప్పుడూ కూడా ఒకదాని పట్ల పూర్తి నిమగ్నత కలిగి ఉండడం.

ప్రపంచంలో మరెక్కడైనా సరే ప్రజలు వంగి నమస్కరించాలి అంటే - అది ఒక ప్రత్యేకమైన రూపం కలిగి ఉండాలి.  లేకపోతే, వారు ఆ పని చేయలేరు. కానీ మీరు ఒక రాయికో, ఒక కర్రకో, ఒక పురుగుకో, ఒక పక్షికో – దేనికైనా సరే మీరు వంగి నమస్కరించడానికి సిద్ధంగా ఉంటే, ఏదో ఒకటి మీకు ద్వారమై తెరుచుకోగలదు. ఇలా చేసినపుడు, మీకు కలిగే ఆవశ్యకతలకు అవధులు అనేవి ఉండవు. ఈ రకమైన ధోరణి వల్ల ప్రజలు కోట్ల కొలది ఆవశ్యకతలను అన్నీ చోట్ల తెరుచుకునేలా చేశారు. ఎక్కడైతే భక్తుడు ఉంటాడో అక్కడ భగవంతుడూ ఉంటాడు. భక్తి అనేది ఒక విషయం పట్ల మీ దృష్టిని పెట్టగలగడం. మీరు ఎల్లప్పుడూ కూడా ఒకదాని పట్ల పూర్తి నిమగ్నత కలిగి ఉండడం. ఒకసారి మీరు ఈ విధంగా ఉన్న తరువాత మీ ఆలోచన, మీ భావాలూ – అన్నీ కూడా ఒక దిశగానే కేంద్రీకృతం అవుతాయి.  ఇలాంటప్పుడు, మీరు దానిని గ్రహించేందుకు సిద్ధంగా ఉంటారు కాబట్టి, అనుగ్రహం అన్నది మీకు సహజంగానే కలుగుతుంది.

మీరు ఎవరికి భక్తిగా వున్నారు, దేనికి భక్తిగా ఉన్నారు - అన్నది విషయం కాదు. మీరు, “నేను భక్తుడిగా ఉండదలచుకోవడం లేదు, నాకు భగవంతుడు ఉన్నాడో లేదో అన్న సంశయం ఉంది” అంటే -  ఇలాంటివన్నీ కూడా ఆలోచించే మనసు చేసే పనులు. మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, భగవంతుడు అసలు లేడు. కానీ, ఎక్కడైతే ఒక భక్తుడు ఉంటాడో అక్కడ భగవంతుడు ఉంటాడు. భక్తికి ఉన్న శక్తి అటువంటిది. అది సృష్టి-కర్తని సృష్టించగలదు. మనం, దేనినైతే భక్తి అంటున్నామో - భగవంతుడు అసలు లేనప్పటికీ , భగవంతుడిని సృష్టిలోకీ, మనుగడలోకీ తీసుకు రాగలిగిందే భక్తి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు