కొత్త బాసుతో ఎలా వ్యవహరించాలి?
ఆఫీసులో కొత్త బాసుతో వ్యహరించడం అనేది అంత బాధాకరంగా ఉండి తీరాలా ? అటువంటి పరిస్థితితో వ్యహరించేందుకు ఉత్తమమైన విధానం గురించి ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని సధ్గురు మనతో పంచుకుంటున్నారు.

ప్రశ్న: ఒక్కోసారి కంపెనీలో ఒక కొత్త బాస్ వచ్చినప్పుడు, అతను ఆ సంస్థలో అప్పటికే ఉన్న సంస్కృతికి, పద్ధతులకి విరుద్ధంగా చాలా మార్పులు చేయడం మనం గమనిసస్తుంటాము. అది ఆ సంస్థలో ఒక అనిశ్చితికి దారి తీస్తుంది. దీనీతో ఎలా వ్యహరించాలి?
సద్గురు: ప్రతి సంస్థలోనూ నాయకుడిని ఎన్నుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒకసారి అలా ఎంచుకున్న తరువాత, ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇవ్వక పోతే, అతను లేదా ఆమె ఆ సంస్థను పురోగతి వైపుకు తీసుకువెళ్ళలేరు. మీ పాత పద్ధతులు మీకు బావున్నాయనుకుంటూ, మీరు వాటినే అనుసరిస్తు పోతే, కొత్త నాయకుడు వచ్చి మాత్రం ఏం చేయగలడు. ఒక ఉద్యోగిగా మీరు యధాతధ స్థితిని కోరుకోవచ్చు. కానీ ఆ కొత్త నాయకుడు ఆ సంస్థని, బహుశా మీరు ఊహించలేని ఒక గొప్ప స్థితికి తీసుకెళ్ళాలనుకుంటూ ఉండి ఉండవచ్చు. మీరు కూడా అదంతా ఆలోచించగలిగి వుంటే వారు మిమ్మల్నే నాయకుడిని చేసేవారు కద.
మీకు ఒక కంపెనీ, సంస్థ, దేశం, లేదా ఏదైనా వ్యవస్థ పై ఆసక్తి ఉన్నట్లైతే, ఒకసారి మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నాక, మనం వారికి సంపూర్ణ సహకారం అందించాలి. ఆ నాయకుడు ఆ కంపనీ లోని సిబ్బంది అందరి దగ్గరకి వచ్చి తను చేయబోతున్న దాని గురించి వివరించలేడు. అదలా పనిచేయదు. ముందుండి నడిపించే వారెవరైనా ఈ విషయంలో ఎప్పుడూ ఒంటరి వారే, ఎందుకంటే దాన్ని అతి సమీపమైన వారితో పంచుకోవడం అనేది కూడా కుదరని పనే. వారితో మరీ ఎక్కువ విషయాలు సంభాషిస్తే, వారు స్థిమితం కోల్పోతారు.
ఏదైనా గొప్ప పని జరగాలన్నప్పుడు, ఏకకాలంలో చెయవలసీన పనులు ఎన్నో ఉంటాయి, ఇంకా ఎన్నో విషయాలు గురించి వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. వ్యూహాత్మకత లేకపోతే ఆ నాయకత్వం రాణించదు. మీరు ఒక నాయకుడైతే, మీరు వంద అడుగులు ముందే ఆలోచించాలి. అలా అని ఆ వంద అడుగుల గురించి మీరు చర్చిస్తే మీతో ఎవరూ ఉండరు. ఒక వ్యక్తికి, మీరు కొన్ని విషయాలను వివరించగలుగుతారు; మరొకరికి, మీరు కొంచెం ఎక్కువ వివరించగలుగుతారు; అలాగే చాలా మందికి, మీరు అసల ఏదీ వివరించలేకపోవచ్చు. ప్రతి ఒక్కరికీ ప్రతి విషయం వివరిస్తూ పోతే అది పనిచేయదు, ఎందుకంటే ఆ విషయాల గురించి వారు ఒక రకమైన గందరగోళాన్ని సృష్టించుకునే అవకాసం ఉంది.
మీ సంస్థలో నాయకుడు ఎవరైనప్పటికీ, వారి ఆలోచనలు ఏమిటో మీకు తెలియదు. సమస్య ఏమిటంటే, ఒక నాయకుడు మార్పులు చేయడం మొదలు పెట్టగానే, పై నుంచి కిందవరకు సిబ్బందంతా అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావడంలేదు అనుకుంటారు. మీరా విషయాన్ని అతనికి వదిలెయ్యాలి, ఎందుకంటే ఒకసారి అతను నాయకుడు అయ్యాక, అతనికి ఉండేది కేవలం అధికారం మాత్రానే కాదు, దానిని విజయవంతం చేయవలసిన బాధ్యత కూడా అతనిపై ఉంటుంది. అతను విఫలమైతే అతనికి జరగవలసింది అతనికి జరుగుతుంది. కానీ అతను విఫలమయ్యెంతలా మీరు అతనికి అడ్డు పడుతూ ఉండకూడదు. మీ భాద్యత ఏమిటంటే, ఆదేశాలను స్వీకరించి అమలు పరచడమే, అవి ఏవైనా సరే.
కాబట్టి ఆ విషయాలను మీ కొత్త బాస్ కే వదిలెయ్యండి. అతను ఏం చేయదలచుకున్నాడో చెయ్యనివ్వండి. మీరు సహకరించండి. అతనేం చేస్తున్నాడో అతనికి తెలిసి ఉంటే అది సఫలీకృతమౌతుంది. లేదంటే విఫలమవుతారు. ఎవరైతే వారిని ఎంపిక చేసారో, వారది ఒక పద్ధతి ప్రకారం చేసారు, అలాగే వారికి అతను సఫలీకృతం అవుతాడని నమ్మకం ఉంది.
మీరు నాయకత్వంలో రాణించాలనుకుంటే, మీరు తగిన సమర్థతను చూపించాలి, అలాగే అన్నిటికీ మించి, ఏం జరిగినా – మంచైనా, లేక చెడైనా, దానికి బాధ్యత వహించడానికి సుముఖంగా ఉండాలి. మీరు కూర్చొని ఈ రోజు నేను ఇంత పని చేసాను అంటూ లెక్కలు వేయకండి. ఎప్పుడైతే మీరు రోజు చివరనా "చేసేందుకు చాలా పనులున్నాయి కానీ సమయం, లేదా శక్తి, సరిపోక పోవడం వల్ల నేను ఈరోజు అవన్నీ చేయలేకపోయాను" అనుకుంటారో, అప్పుడు మీరు సహజంగానే నాయకుడి హోదాకు ఎదుగుతారు.
ప్రేమాశీస్సులతో,