#1 మానవ చైతన్యం ఉప్పొంగుతుంది

చాంద్రమానం ప్రకారం ప్రతినెలా వచ్చే 14వ రోజు అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజును శివరాత్రి అంటాము. ఈ రోజున సహజంగానే మానవ చైతన్యం ఉప్పొంగుతుంది. మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అంటాం. ఈ ప్రత్యేకమైన రోజున వ్యవస్థలో శక్తి ఉప్పొంగేందుకు ప్రకృతి సహకరిస్తుంది. ఆధ్యాత్మిక లేదా యోగ ప్రక్రియ అంటే మానవుడిని పరిమితత్త్వం నుండి అనంతంగా విస్తరింపజేయడమే. ఈ విస్తరణ జరగాలంటే మౌలికమైన ప్రక్రియ ఏమిటంటే శక్తి పైకి కదిలేలాగా ఉత్తెజితమవ్వాలి. ప్రస్తుతం వారు ఉన్నదానికంటే మరికొంచెం ఎదగాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి శివరాత్రి ముఖ్యమైనది, మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనది.

#2 విభిన్నమైన వారికి విభిన్న ప్రాముఖ్యత

మహాశివరాత్రి ఎన్నో విధాలుగా ప్రాముఖ్యకలది. ఎవరైతే గృహస్తాశ్రమంలో ఉన్నారో వారు మహాశివరాత్రిని శివుని కళ్యాణం జరిగిన రోజుగా చూస్తారు. తాపసులు, ఇవి శివుడు ఆచలేశ్వరుడుగా మారి కైలాస పర్వతంతో ఒక్కటైనా రోజుగా భావిస్తారు. ఎన్నో వేల సంవత్సరాల ధ్యానం తరవాత ఆయన ఒక పర్వతంలా, నిశ్చలంగా మారి ఆయన జ్ఞానాన్నంతా కైలాసంలో నిక్షిప్తం చేసారు. అందుకని తాపసులు మహాశివరాత్రిని నిశ్చలతత్త్వానికి ప్రతీకమైన రోజుగా చూసారు. ఎవరైతే ప్రపంచంలో ఎదో సాధించాలి అనుకుంటారో, వారు ఈరోజున శివుడు శత్రు సంహారం చేసిన రోజుగా పరిగణిస్తారు.

#3 రాత్రంతా వెన్నుముకను నిటారుగా ఉంచడంవల్ల ఎన్నో ఆవశ్యకతలు

5tipsపురాణాలు ఏమి చెప్పినప్పటికీ ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే మానవ దేహంలో చైతన్యం ఉప్పొంగుతుంది. ఈరోజు రాత్రంతా వెన్నుముకని నిటారుగా ఉంచి ఎరుకతో జాగారం చేస్తే, మనం చేసే సాధన ఏదైనా సరే, దానికి ప్రకృతి నుండి గొప్ప సహకారం దొరుకుతుంది. మౌలికంగా మానవుడిలో పరిణామ క్రమం, అంటే శక్తి పైకి కదలడం. ఆధ్యాత్మిక సాధకుడు చేసే ప్రతి సాధనా, ఈ శక్తిని పైకి కదిలించడానికే.

#4 రాత్రి, తెల్లవార్లూ ఆట పాటల ఉత్సవం

sadguru

ఈశా యోగా కేంద్రంలో రాత్రి, తెల్లవార్లూ ఈ పండుగ ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతుంది. అధ్బుతమైన ధ్యానాలు, ప్రఖ్యాత కళాకారులందించే సాంస్కృతిక కార్యక్రమాలు, మహాశివరాత్రిని అనుభూతి చెందేందుకు చక్కటి వాతావరణాన్ని ఏర్పరచడంతో లక్షలకొద్దీ ప్రజలను ఆకర్షిస్తాయి. సద్గురు సాన్నిధ్యంలో ఈ రాత్రి అంతులేని ఆధ్యాత్మిక అవకాశాలకు ద్వారం తెరుస్తుంది. విశ్వ ప్రఖ్యాతి గాంచిన సంగీత కళాకారులు అందించే సంగీతం ఇంకా సాంస్కృతిక ప్రదర్శనలు, సౌండ్స్ అఫ్ ఈశా ఇవన్నీ రాత్రి, తెల్లవార్లూ మిమ్మల్ని అలరిస్తాయి.

#5 సద్గురు సాన్నిధ్యంలో పంచభూత ఆరాధన

pancha10

మీ భౌతిక దేహంతో సహా ఈ సృష్టికి మూలం పంచభూతాలు. వీటిని శుద్ధి చేయడంద్వారా మానవ వ్యవస్థలో శారీరక, మానసిక శ్రేయస్సు ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ శరీరాన్ని ఒక అడ్డంకిగా కాకుండా, ఒకరి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సోపానంగా మలుస్తుంది. యోగ విధానంలో భూతశుద్ది అనే ప్రక్రియ ఒకటి ఉంది. ఎంతో సాధనతో మాత్రమే సాధ్యమయ్యే దానిని, ఈ పంచభూత ఆరాధన ద్వారా సద్గురు భక్తులకు అందిస్తారు.

మరిన్ని వివరాలకోసం చూడండి: Mahashivarathri