మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు సహజంగా1నే మీ భౌతికత ప్రధాన పాత్ర పోషించేది, మీకు తెలుసా. నా చిన్నతనంలో, మా అమ్మా, నాన్నా ఇద్దరూ శాస్త్రీయ సంగీతం వింటున్నా నేను దాన్ని పూర్తిగా ద్వేషించేవాడిని, అస్సలు భరించలేక పోయేవాడిని. నేను పశ్చిమ సంగీతం (western music) వినేవాడిని, సరేనా? ఒక్కసారి కూడా నేను శాస్త్రీయ సంగీతం విందామనుకోలేదు. వారు సంగీతం పెట్టగానే నేను ఆ గదిలోనుంచి వెళ్ళిపోయేవాడిని. కానీ నేను ధ్యానం చేయటం మొదలుపెట్టిన క్షణం నుంచి అకస్మాత్తుగా ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నాకు సంగీతంగా మారింది.

ఏ సంగీతాన్నైతే నేను భరించలేకపోయేవాడినో, నేను నిశబ్దంగా మారినప్పటినుంచి దాన్నే వినాలి అనుకున్నాను. నేను అంతర్గతంగా నిశబ్దంగా అవ్వగానే శబ్దాల గురించి నా ఆలోచనా విధానం మారిపోయింది. ఒక్కసారిగా భారతీయ శాస్త్రీయ సంగీతం నాకు ఎంత ముఖ్యమైపోయింది అంటే అది ఎక్కడ వినిపిస్తే అక్కడికి ఒక యాచకుడిలా వినటానికి వెళ్ళేవాడిని. వేరే రకాల సంగీతం నా మనసు నుంచి విడిపడిపోయాయి. శాస్త్రీయcutout-painting-horn సంగీతంలో సరైన శబ్ద ఉచ్ఛరణ మరియు ధ్యానముకు గల సంబంధం ఎంతో ఖచ్చితంగా ఉంది.

అందువల్ల మీరు వింటునప్పుడు మీరు అది కేవలం ఒక పాటగా వినరు మీరు దానితో ఒకటి అవుతారు. మీరు ఒకటైతే ఒక డోలు/డ్రమ్ము కేవలం ఒక డ్రమ్ము మాత్రమే కాదు, ఒక తీగె కేవలం ఒక తీగె మాత్రమే కాదు, ఒక గాత్రం కేవలం ఒక గాత్రం మాత్రమే కాదు, ఎందుకంటే మీరు శబ్దం లేక ఒక శబ్దాల అమరిక అని అనేది ఈ అస్థిత్వానికే ఒక మూలసూత్రం లాంటిది.

మన శరీరం యొక్క లయ కేవలం మన గుండె చప్పుడులోనే లేదు. శరీరంలోని ప్రతీ అణువుకు ఒక లయ జత పరిచి ఉంది. అందువల్ల కేవలం ఒక పాటగా వినకండి, విని ఆ సంగీతాన్ని మెచ్చుకోండి. ఈ సృష్టి, లయకార ప్రక్రియలో శబ్దం మరియు రూపం ఇరుగుపొరుగు వారే. మీ పొరిగింటి వారిని ప్రేమించండి అని మీకు చెప్పారు. ప్రేమ అంటే ఎలాగోలా ఇంకొక దానితో కలిసిపోవటం. మీరు కేవలం వినటం కాదు,ఈ శబ్దంతో ఏకమవ్వాలి ఎందుకంటే శబ్దం మరియు దాని రూపం అనేవి రెండూ వేర్వేరు కాదు.

kailash-2011-0101

మీరు దీన్ని ప్రయత్నించి చూడండి, మీరు ఒక సంగీతకారుడు కానవసరం లేదు, మీకు వీలైనంత గట్టిగా కచ్చితమైన తీవ్రతతో అరవండి. మీరు ఆపిన వెంటనే కొంత నిశ్శబ్దం మీలో నెలకొంటుంది, ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది మళ్ళా అది పోతుంది. మీరు కేవలం గట్టిగా అరవటం వల్ల మీలో అంతా ఒక అమరికలోకి వస్తుంది. అందువల్ల ఈ నిశ్శబ్దాన్ని మనుషులలో తీసుకురావటమే ఈ శాస్త్రీయ కళల ఉద్దేశ్యము. కచ్చితమైన నిశ్శబ్దం! అది లేనిదే దాంట్లో కళ అనేది లేదు. ఆ నిశ్శబ్దం లేనిదే నిజమైన కళ లేనేలేదు.

shutterstock_62989513

బహుశా ఈ ప్రపంచంలోని అన్ని సాధనాల్ల్లో సంగీతమే ఎక్కువ మంది మనుషులకు ఆనందభాష్పాలు తెచ్చేది, తీవ్రతను కలిగించేది అనుకుంటాను. ఈ అస్థిత్వపు వివిధ శబ్దాలు మరియు మనిషి గొంతు సృష్టించగల వివిధ శబ్దాలకు గల మూలసూత్రాన్ని సరిగ్గా తెలుసుకుంటే మీరు ఈ సృష్టిని దాటుకుని ఈ సృష్టి కారణాన్ని తాకవచ్చు. అందువల్ల దివ్యత్వాన్నితాకటానికి చేసే మీ సాధనకు ఒక సాధనంలా సంగీతం చాలా శక్తివంతమైనది. తెలిసో తెలియకో దీన్ని వివిధ రూపాల్లో వాడుతూనే ఉన్నాము. కానీ అది చాలా సార్లు కేవలం ఒక వినోదంగా మాత్రమే మిగిలిపోతుంది, ఈ సృష్టికి ఒక తాళంచెవి లాగా కాదు. ఎప్పుడైనా మనిషి ఒక కార్యాచరణలో నిమగ్నమయ్యేది ఎందుకంటే ఈ కార్యాచరణ తనని జీవితంలోని అత్యంత అనుభవాన్ని రుచింప చేస్తుంది అనే ఆశతోనే. మీరు ఒక శబ్దం వింటే ప్రేమగా మారతారు, ఇంకొకటి వింటే ఆనందంగా మారతారు, మరొకటి వింటే రౌద్రంగా మారతారు. ఇది జరుగుతుంది కదా? శబ్దం కేవలం మీ భావోగ్వేదాలనే కాదు మీ శరీరంలోని రసాయన సమ్మేళనాన్ని కూడా మారుస్తుంది. అందువల్ల మీరు వింటున్న శబ్దాలు మరియు మీరు చేసే శబ్దాలు మీ మీద ప్రభావం చూపుతున్నాయి. భారతీయ శాస్త్రీయ సంగీతం, గణితశాస్త్ర ఖచిత్తత్వంతో ఏ శబ్దం ఏమి చేయగలదు అనేది తెలుసుకుంది. అనుభవపూర్వకంగా ఇది తెలిసిన సంగీతంలో ప్రావీణ్యం కలవారు ఉన్నారు.

సంవత్సరానికి ఒకసారి మేము యక్ష అనే సంగీతోత్సవము జరుపుకుంటాము. ఇప్పటికే దేశంలో ప్రఖ్యాతిగాంచిన వారిని పిలిచాము. పాతతరం వారిలో తప్ప ఈ నిమ్నత ఇప్పటివారిలో లేదు. చాలామంది వాణిజ్యపరమైన కళల వైపు వెళ్ళిపోయారు. ఎక్కువ మంది వారి జీవితాన్ని, సమయాన్ని ఒక కళను అభివృద్ది చేయటానికి వెచ్చించటంలేదు.

అదే విధంగా ప్రస్తుత శాస్త్రీయ కళాకారులు, నృత్యకారులు అర్ధంచేసుకోవల్సింది ఏమిటంటే సంగీతము మరియు ఇతర కళలు ప్రజలకు చేరువగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైంది. మీరు దేశంలో జరిగే ఏదైనా కచేరికి వెళ్తే, వారు కేవలం వచ్చి కూర్చుని “ భో నననా తరననన” అని పాడి వెళ్ళిపోతారు. అది సరైన మార్గం కాదు.

ప్రజలకు కళలలో అభిరుచి పెరిగేలా అలవాటు చేయాలి. ప్రేక్షకులు లేనిదే ఏ కళ అయినా జీవించలేదు, అవునా? మీ గాత్రం వినటానికి వచ్చిన ప్రజల మీద మీరు కొంచం ప్రేమ చూపించటం ఎంతో ముఖ్యం. మీరు వారితో మాట్లాడండి, మీరు ఏమి పాడబోతున్నారో దాని గురించి వివరించండి, వారిని ఆకట్టుకుని అప్పుడు పాడండి. ఇది మీ గురించి కాదు కదా? అందువల్ల కళాకారులు ఒక పర్వతం మీద ఎక్కి కూర్చోకుండా ప్రజల కోసం పాడటానికి ప్రయత్నించాలి. వారు ప్రజల కోసం దిగి వచ్చి వారికి అర్ధం అయ్యేలా, ఆ కళలోని ప్రాముఖ్యతతో రాజీ పడకుండా పాడగలగాలి. అది సాధ్యమే కదా?

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

దీనిలో భాగంగానే ప్రతీ సంవత్సరం ఈశాలో“యక్షా“ సంగీతోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం ఫెబ్రవరీ 21 - 23 ఈశా యోగా కేంద్రంలో జరుగుతోంది. దీనికి అందరూ ఆహ్వనితులే. మరిన్ని వివరాల కోసం చూడండి : యక్షా