సద్గురు యజ్ఞాల ప్రాముఖ్యతను వివరిస్తూ, హిమాలయ పర్యటనలో ఆయన కలిసిన ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు.

సద్గురు: ఈ యజ్ఞాలు ఇంకా పూజల వెనుక ఒక శాస్త్రీయ అవగాహన ఉంది. ఈ తంతులు ప్రజలలో ఒక విధమైన అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రజలకు తమలో ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టించుకునే పరిజ్ఞానం లేనప్పుడు, వేద కాలంలో ఎవరికైతే ఒక అనుకూల వాతావరణాన్ని సృస్టించడం తెలుసో, వారు కొన్ని యజ్ఞాలను సృష్టించారు.

పూజలు చేయడం అనేది, ఇప్పటికీ మన దేశాన్ని అధిక జనాభా ఇంకా పేదరికం అనే రెండు సమస్యలను నుండి బయటపడేయలేదు. ఇప్పుడిక జీవితాలను మార్చమని దేవుళ్ళను అడగడం ఆపి, మన జీవితాల్ని మన చేతుల్లోకి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీలో యుక్తాయుక్త విచక్షణ వచ్చేవరకూ, ఏ దేవుడూ, యోగులూ, మహర్షులూ, లేదా జ్ఞానులూ మీకోసం ఏమీ చేయలేరు. మీరు వారిని ఆరాధించవచ్చు, పూజించవచ్చు, లేదా వారికి సంకీర్తనలు పాడవచ్చు, కానీ మీరు అదే పాత దుఃఖంలోనే కొనసాగుతారు. ఏ ఉపసమనం ఉండదూ.

మీలో యుక్తా యుక్త విచక్షణ వచ్చేవరకూ, ఏ దేవుడూ, యోగులూ, మహర్షులూ, లేదా జ్ఞానులూ మీకోసం ఏమీ చేయలేరు.

చాలా సంవత్సరాల క్రితం, నేను ఋషికేశ్ వెళ్ళాను. ఆ రోజుల్లో నేను ఏడాదికి కనీసం ఒకటి రెండు నెలలు హిమాలయాల్లో సంచరిస్తూ ఉండేవాడిని. అప్పుడు నేను ఋషికేశ్‌లో  ఒక ఆశ్రమంలో బస చేసాను, ఎందుకంటే డబ్బు ఆదా చేసి నా యాత్రని పొడిగించడం కోసం. అందుకని ఓ ఆశ్రమానికి వెళ్లాను, అక్కడ ఒక పెద్ద గదిలో చాలా మంది పడుకొని ఉన్నారు. నేను చాలా తక్కువ సమయం నిద్రపోతాను. కాబట్టి కుర్చుని ధ్యానిస్తున్నాను. ఒక వ్యక్తి పడక సిద్దం చేసుకుంటూ, నిద్ర పోవడానికి అవసరమైన ఇతర ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

దురదృష్టవశాత్తు ఆయన పడక నా పక్కనే, ఆయన దగ్గర ౩౦ కు పైగా దేవుళ్ళు ఇంకా మహాత్ముల చిత్ర పటాలు ఉన్నాయి. పడుకునే ముందు ఆ చిత్రపటాలన్నింటినీ తన బెడ్డు చుట్టూ అమరుస్తున్నాడు. తెలిసిన అందరి దేవుళ్ళ పటాలనూ తెచ్చాడు. ఏ దుష్ట శక్తులూ తన వద్దకు వచ్చి తన నిద్రకు భంగం కలిగించకూడదని, పడుకునేందుకు మంచి వాతావరణం తాయారు చేసుకుంటున్నాడు. నిద్ర ఒక గొప్ప యజ్ఞం. నిద్ర లేకుండా మనం జీవించలేం. మీరు పెద్ద హవిస్సులతో కూడిన యజ్ఞాలు నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. కాని నిద్రపోవటం ఇంకా తినటం వంటి సరళమైన యజ్ఞాల గురించి తెలుసుకోండి. ఇవి మీ శరీరంలోని ప్రాధమిక యజ్ఞాలు. ఇవి మీరు పూజ్యభావంతో సరిగ్గా నిర్వహించవలసిన ప్రాధమిక యజ్ఞాలు.

మీ యజ్ఞానికి ఆ దేవుడే కిందకు వచ్చినా అది ముఖ్యం కాదు. మీ గురించి మీరు ఏదైనా చేస్తే తప్ప, మీరున్న పరిస్థితిలో ఏ మార్పు జరగదు.

కాబట్టి అతను తన యజ్ఞాన్ని చేస్తున్నాడు, నేను అయన వైపు అలా చుసానంతే, 

అతను నేను ఎక్కడ నుంచి వచ్చానో తెలుసుకోవాలనుకున్నాడు. నేను అతన్ని ఇరకాటంలో పడేసే సమాధానం ఇవ్వాలనుకున్నాను. కాబట్టి, “నేను దేవలోకం నుంచి వచ్చాను” అని చెప్పాను. అది విని అతను కళ్ళు తేలేసి, తికమక పడ్డాడు, ఖచ్చితంగా నేను అబద్ధం చెప్తున్నానని అతనికి తెలుసు, అయినా అతను నన్ను విస్మరించలేకపోయాడు, ఎందుకంటే నేను అతని ముందే కూర్చుని తదేకంగా అతని వైపే చూస్తున్నాను. 15 నిమిషాలు పాటు అన్ని దేవుళ్ళ పటాలను అటు ఇటు మార్చుతూ ఉన్నాడు, అయినా అతనికి సంతృప్తి కలగలేదు. 

అప్పుడు అతను మెల్లగా నా దగ్గరికి వచ్చి “స్వామీజి మీలో నాకు ఒక తేజస్సు కనిపిస్తోంది“ అని అన్నాడు. నేను, “అవును” అన్నాను. అతనికి కాసేపు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. తరువాత, “మీరు ఏ రాష్ట్రం నుంచి?” అని అడిగారు. నేను, “దేవలోకం నుంచి వచ్చానని ఇంతకు ముందే మీకు చెప్పాను కదా “ అన్నాను.

ఇక ఇప్పుడు నిజంగా సతమత పడ సాగాడు. బాగా అలజడి చెందుతూ శివుని పటం అక్కడ, పార్వతి దేవి పటం ఇక్కడ, ఆ మహర్షి పటం ఇక్కడ, ఇంకో మహాత్ముని పటం వేరే చోటా అమరుస్తూ ఉన్నాడు. తరవాత నా దగ్గరికి వచ్చి, “మృత్యుంజయ స్వామీజి యుక్తేశ్వర్ వచ్చారు అని మీకు తెలుసా?” అని అడిగాడు.

నేను, “నేను ఇప్పుడే దేవలోకం నుండి వచ్చాను, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు“ అన్నాను. 

ఇక ఆయనకు పూర్తిగా పిచ్చెక్కిపోయింది. అలా ఒక రెండు గంటల పాటు అతన్ని అలాగే సందిగ్ధతలో ఉండనిచ్చి, ఆ తరవాత, “నువ్వు నాతో బయటికి రా, నీతో మాట్లాడాలి” అన్నాను. ఆయన భయపడిపోయాడు కానీ నాతో పాటు వచ్చాడు.

నేను ఆయన్ని బయటకి తీసుకెళ్ళి ఆ రాత్రి అంతా మాట్లాడాను. చూడు, నువ్వు ఇదంతా భక్తితో చేస్తుంటే నేను వదిలేసేవాడినని అంటూ, ఇదంతా వదిలి పెట్టమని అతనితో చెప్పాను. కాని అతను ఎంతో భయంతో ఉన్నాడు. ఇద్దరం వెళ్లి గంగానదీ తీరాన కూర్చున్నాం. నేను అతనితో, “నేను నిన్ను బలవంత పెట్టను, కానీ ఒక అరగంట పాటు ఇక్కడ ఉండు, ఆ తరవాత కూడా నీకు అదంతా సబబే అనిపిస్తే, అట్టి పెట్టుకో. కానీ నీకు అదంతా అర్ధంలేని విషయంగా అనిపిస్తే, అన్నింటినీ గంగా నదిలోకి విసిరేయి, అప్పుడు మనం మిగతాది చూద్దాం” అన్నాను. ఎలాగూ నువ్వు వాటిని చెత్త బుట్టలో పారేయ్యవు కదా. అతి పవిత్రమైన ఈ గంగా నదిలోనే వేయి” అన్నాను.

తెల్లవారుజామున వేరొక చోటికి వెళ్ళాల్సి ఉండి, అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఆ తరువాత ఒక రెండు రోజులకి నేను బస్సు ఎక్కుతుండగా ఎవరో నన్ను వెనకనుండి తట్టారు. నేను తిరిగి చూస్తే, నా పక్కన పడుకున్న ఆ వ్యక్తి. అతను చాలా సంతోషంగా కనపడ్డాడు. “మీరు నాకు ఇది చెప్పినప్పటి నుండి నేను గంగానదీ తీరంలో పడుకుంటున్నాను, చాలా హాయిగా నిద్రపోతున్నాను” అన్నాడు.

ఏ దేవుడూ రావలిసిన పని లేదు, ఎందుకంటే మీరు దేన్నయితే దైవం అని అంటున్నారో అది ఇక్కడే మీ లోపలే ఉంది. కాకపోతే నిర్జీవంగా ఉంది.

ఇంకా ధ్యానం మొదలుపెట్టలేదు, కాని హాయిగా నిద్రైతే నిద్రపోతున్నాడు. నాకు ఇది నచ్చింది. జీవానికి చేరువ అవుతున్నాడు. మీకు జీవానికి చేరువ అవ్వడం తెలియకపోతే, ఇక దేవుడికి ఎలాగా చేరువ అవుతారు?

కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు, శ్రీ రాముడు వచ్చినప్పుడు, గౌతముడు వచ్చినప్పుడు, జీససు వచ్చినప్పుడు, ఇంకా ఎంతో మంది గొప్ప వారు, మహాత్ములు, అద్భుతమైన వారు వచ్చినప్పుడు కూడా, వారి చుట్టూ ఉన్న చాలా మంది ప్రజలు అదే దుఃఖంతో అవే సాధారణ జీవితాలు గడిపారు.  ఏదో కొద్దిమంది మాత్రమే వారి పరిమితిని దాటి ఎత్తుకి ఎదగగలిగారు. తక్కినవారందరూ అదే దుఃఖాలలో అలానే జీవించారు. కాబట్టి మీ యజ్ఞానికి ఆ దేవుడే కిందకు వచ్చినా అది ముఖ్యం కాదు. మీ గురించి మీరు ఏదైనా చేస్తే తప్ప, మీరున్న పరిస్థితిలో ఏ మార్పూ జరగదు. నేను, ఇంకొంచం సజీవంగా అయ్యేలా, వారి బుద్ధిని, శరీరాన్ని ఇంకా వారి జీవ శక్తులను రేకేత్తించాలనేదే నా కోరిక. వారిలో ఈ సజీవత్వం లేనిదే, వారి కోసం వారు నిలబడరు, దేవుడే దిగి వచ్చి తమకోసం ఆ పని చేయాలని, పడుకుని వేచి చూస్తూ ఉంటారు.

ఏ దేవుడూ రావలిసిన పని లేదు, ఎందుకంటే మీరు దేన్నయితే దైవం అని అంటున్నారో అది ఇక్కడే మీ లోపలే ఉంది. కాకపోతే నిర్జీవంగా ఉంది. మీరు మరింత సజీవంగా మారితే, అప్పుడు మీలోని ఆ దైవత్వం కూడా సజీవంతో ఉట్టిపడుతుంది. మిమ్మల్ని మరింత సజీవంగా చేయటమే నాపని. అదే నా యజ్ఞం.

Image Courtesy of deen @flickr