ప్రశ్న: సద్గురు, భారతదేశంలో సన్యాసులు కాషాయ వస్త్రాలు ఎందుకు ధరిస్తారు?

సద్గురు: భారతదేశంలో సన్యాసులు కాషాయ రంగు వస్త్రాలు ధరించరు; చాలా వరకు,  ఆ రంగు వారి బట్టలకి పులిమే ఎర్ర మట్టి  నుండి వస్తుంది, ఇలా ఎందుకు చేస్తారంటే, వారు - ఈ శరీరం కేవలం ఈ భూమి యొక్క  పొడిగింపు మాత్రమే అనే అస్తిత్వపరమైన ఇంకా అనుభవపూర్వకమైన ఎరుకతో  జీవించాలనుకుంటారు. ఆ రంగు వారి బట్టలకి పులిమే ఎర్ర మట్టి  నుండి వస్తుంది, ఇలా ఎందుకు చేస్తారంటే, వారు - ఈ శరీరం కేవలం ఈ భూమి యొక్క  పొడిగింపు మాత్రమే అనే అస్తిత్వపరమైన ఇంకా అనుభవపూర్వకమైన ఎరుకతో  జీవించాలనుకుంటారు.

 శరీరం కేవలం ఈ భూమి యొక్క పొడిగింపు మాత్రమే అనే అస్తిత్వపరమైన ఇంకా అనుభవపూర్వకమైన ఎరుకతో  జీవించాలనుకుంటారు.

భారతదేశంలో, చీమల పుట్టల దగ్గరకు వెళ్ళి ధ్యానం చేసే సాంప్రదాయం ఉంది. సాధారణంగా, ఉష్ణమండల ప్రాంతంలో, చీమల  పుట్టలు నిలువుగా ఉంటాయి. చాలాకాలం వరకు, అందులో పాములు ఉంటాయని నమ్మేవారు. ఎందుకంటే, ప్రోటీన్ కోసం వెతుకుతూ పాములు అందులోకి వెళ్తాయి. వాటిలో ప్రోటీన్ బాగా ఉంటుంది. వాటి లాలాజలంలో ప్రోటీన్ బాగా ఉంటుంది. మట్టినీ, లాలాజలాన్ని కలిపి ఆ పుట్టలను నిర్మిస్తాయి. అది వానలతో సహా ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుంది. ఇది నిర్మాణపరంగా అద్భుతమైన నిర్మాణం. ఒక విధంగా, భారతదేశంలోని ఈషా యోగా కేంద్రంలోని మా భవనాలు కూడా అలానే రూపొందించబడ్డాయి. నేను వాటిని నుండే ఇంజినీరింగ్ నేర్చుకున్నాను; నేను కూడా వివిధ కారణాల వల్ల వాటిలోకి వెళ్లాను.

మట్టితో కలిసి ఉండడం

ఇక్కడ ఉద్దేశం ఏంటంటే - ఈ శరీరం మనం నడిచే భూమి యొక్క పొడిగింపు మాత్రమే అనే ఎరుకతో ఉండడం. శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం ముఖ్యమే; ఎదుటి వారిని మెప్పించడం కోసం కాదు; అది మన మార్గానికి అడ్డు రాకుండా ఉండడం కోసం!  ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల మీ శరీరం సమస్యగా మారితే, మీ దృష్టి అంతా దానిపైనే ఉంటుంది. మీ పూర్తి  సమయం ఇంకా జీవితం అంతా శరీరాన్ని చూసుకోడానికే సరిపోతుంది. మీరు ఇక్కడ కూర్చుంటే, మీ శరీరం ఉన్నట్లుగా కూడా మీకు అనిపించని విధంగా  మీ శరీరాన్ని ఉంచుకోవాలి. లేదంటే, శరీరంలోని రకరకాల నిర్బంధ ప్రవృత్తులు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఈ  శరీరం ప్రతిబంధకంగా కాకూడదు, అది మీరు నిలబడగలిగే వేదికలా ఉండాలి.

మీరు ఇక్కడ కూర్చుంటే, మీ శరీరం ఉన్నట్లుగా కూడా మీకు అనిపించని విధంగా మీ శరీరాన్ని ఉంచుకోవాలి.  /pullquote]

ఇది మీ మానసిక నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే, మానసిక నిర్మాణం ఇంకా శారీరక నిర్మాణం అనుసంధానమై ఉంటాయి. కాబట్టి మీరు మీ శారీరక నిర్మాణాన్ని, ఇంకా శారీరక చక్రాలను నిర్దిష్ట స్థాయిలో స్థిరంగా ఉంచగలిగితే, అప్పుడు సహజంగానే మానసిక స్థిరత్వం వస్తుంది. మైండ్ అనేది పూర్తిగా వేరు అనే వాదనలున్నాయి, కానీ మీ మెదడు కూడా శరీరంలో భాగమే. ఇవాళ మీకు ఏదైనా మానసిక సమస్య వస్తే, మీ తలకి ఇంజెక్షన్ చెయ్యరు, ఒక మాత్ర వేస్తారు, అది పొట్టలోకి వెళ్తుంది, ఆపై అది పని చేస్తుంది. కాబట్టి స్పష్టంగా - మీ మనస్సు ఎలా ఉంటుంది అనే విషయంలో శారీరక స్థిరత్వం ఇంకా శరీరం లోని రసాయన స్థిరత్వం చాలా ముఖ్యం.

సన్యాసులు మట్టిలో ఉతికిన దుస్తులను ఎందుకు ధరిస్తారంటే, శరీరాన్ని స్థిరంగా ఉంచగలిగే ఉత్తమమైన మార్గం దాన్ని భూమితో అనుసంధానంలో ఉంచడం! ప్రత్యేకించి, భౌతికతకు అతీతమైన అంశాలపై దృష్టి పెట్టేవారికి ఇది చాలా ముఖ్యం; వారు తమ శరీరం తమకి అడ్డంకి కాకూడదు అనుకుంటారు. కాబట్టి ఇది మిమ్మల్ని మీరు మట్టితో కప్పుకున్నట్లనమాట, ఎందుకంటే, ఆ దుస్తులకు భూమికి ఉన్న లక్షణం ఉంటుంది. అనేక విధాలుగా అది మిమ్మల్ని భూమితో అనుసంధానంలో ఉంచుతుంది, అంతేకాక మీరు ఎల్లపుడూ - మీ శరీరం భూమిలో ఒక భాగమేనన్న ఎరుకతో ఉండేలా చేస్తుంది. ఆఖరికి, మరణం ఆసన్నమైనప్పుడు కూడా మీకు పెద్ద కష్టంగా అనిపించదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ - మీ శరీరం ఈ భూమిలో ఒక భాగమేనన్న ఎరుకతోనే ఉంటూ వచ్చారు కాబట్టి!