ఆధ్యాత్మిక పథంలో గ్రంధాలు ఎటువంటి పాత్ర పోషిస్తాయి?

సద్గురు: జ్ఞానం అని పిలువబడేది ఒకటుంది, ఇది మీరు కూడబెట్టుకున్న స్మ్రుతి, అవగాహన అనేది మరోటుంది, ఇది జీవాన్ని పరిపూర్ణంగా గ్రహించడం. జ్ఞానం అంటే జీవితం పట్ల మీరు చేసిన నిర్ధారణ. మీరు సేకరించిన జ్ఞానం నుండి మీరు జీవితం గురించి ఒక నిర్ధారణకి వస్తే, అది పక్షపాత జ్ఞానం అవుతుంది. ఇది మిమ్మల్ని కొత్త విషయాలను అనుభూతి చెందడానికి అనుమతించదు. మీకు కొత్తవేమి జరగవు. జ్ఞానం మీ మనుగడకు ఉపయోగ పడుతుంది కానీ మిమ్మల్ని ఎప్పటికీ విముక్తులను చెయ్యదు.

మీ మనుగడ గురించి మీరు శ్రద్ధ వహించకూడదా? మీరు తప్పకుండా వహించాలి, కానీ మీ మెదడుతో పోల్చుకుంటే చాలా చిన్న మెదడు కలిగి ఉన్న ఒక పురుగు ఈ గ్రహం మీద చాలా చక్కగా జీవించగలదు. మరి మీకు అంత పెద్ద మెదడు ఉన్నప్పుడు మీరు కేవలం మనుగడ గురించే మీ జీవితాన్నంతా గడుపుతారా? యోగా సంప్రదాయంలో మెదడుకు పదహారు భాగాలున్నట్లు పరిగణిస్తారు. ఈ లోకిక ప్రపంచంలో జీవితాన్ని విజయవంతంగా జీవించడానికి ఈ పదహారులో ఒక్కటి ఉన్నా సరిపోతుందని వారు అంటారు. మిగిలిన పదిహేను భాగాలతో, మీ అంతర్ముఖ శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే, ఇది లోకిక ప్రపంచం కంటే చాలా విస్తారమైన స్థలం. ఈ నాడు శాస్త్రవేత్తలు, విశ్వంలో కేవలం నాలుగు శాతమే సృష్టి అని, మిగిలినది అంతా చీకటి పదార్ధం (dark matter) అని, కకాళ శక్తి అని చెబుతున్నారు. కాబట్టి, మీ మెదడు లో నాలుగు శాతం సరిపోతుంది కానీ మన ప్రాచీచిన యోగులు చాలా ఉదారభావం కలవారు. మీ లౌకిక జీవితాన్ని విజయవంతంగా నిర్వహించుకోడానికి ఆరు శతం కంటే ఎక్కువే ఇచ్చారు!

కాబట్టి, గ్రంధాల పట్ల గౌరవం భావంతోనే చెబుతున్నాను, అందులో ఉన్నది కుదవబెట్టిన జ్ఞానమే.. అది ఏ ఇంజినీరింగ్ కో , సాహిత్యానికో, చరిత్రకో సంబంధించిన పుస్తకమైతే , అది నేనే చదవమనుండే వాడిని. కానీ అది ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకమైతే, మీరు ఇక్కడ సజీవంగా ఉన్నపుడు, “మీరు” అనే ఈ పుస్తకాన్నే చదవడం మంచిది, వేరేదో పుస్తకం చదవడం కంటే. సృష్టికర్త స్వయంగా రాసిన పుస్తకమే మీరు. మీరు ఈ జీవితాన్ని తెలుసుకోవాలంటే దీన్ని చదవడమే ఉత్తమం. మీరు ఏ ఇతర పుస్తకాలను చూసినా, అవి భగవంతుని మాటలు అయినప్పటికీ, ఎదో ఒక భాషలో వ్రాయబడ్డాయి కాబట్టి, అవి మానవులచేత వ్రాయబడినవే. మానవ మనస్సులు అపారమైన వక్రీకరణనకు లోనవుతాయి. మీరు ఈ రోజు మీ కళ్ళతో చూసినది ఏదైనా మీ పొరుగు వారికి చెప్తే, వారు మరొకరికి చెబుతారు. అది అలా పాతిక మంది నోళ్ళలో పడి , ఒక ఇరవై నాలుగు గంటల తరువాత తిరిగి మీ దగ్గరకు వస్తే ఆ కథను అసలు మీరు గుర్తుపట్టగలరా..? ప్రజలకు దాన్ని ఎంతగా వక్రీకరించగల సామర్ధ్యం ఉందొ, మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక వేలాది సంవత్సరాల క్రితం విషయాలు దిగి వస్తునప్పుడు, మార్గ మధ్యంలో ఎంత జరిగి ఉంటుందో మీరు ఉహించగలరు కదా.

మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వేరొకరు రాసిన పుస్తకం చదవకండి. మీ గురించి మీరు ఒక పుస్తకంలో చదివితే, మీరు నిజం కాదు కేవలం కథ మాత్రమే. మీరు మీలోలకి చూసుకోవాలి. మీరు ఇప్పుడు ఉన్న దిశ నుండి వెను తిరిగి, మీ లోనికి చూడడానికి అవసరమైన సాధనాలు ఉండాలి. నేను, ఇప్పటి వరకు వ్రాసిన ప్రతి దాన్ని చెత్త అనడానికి ప్రయత్నించడం లేదు. కానీ మీరు మీ గురించి లోతైన కోణాలను తెలుసుకుంటే, ఇక అప్పుడు మీరు గ్రంధాలన్నీ పాచిగా ఉన్నట్లు ఉంటాయి.

కృష్ణుడు అర్జునిడికి గీతా భోధన చేస్తునప్పుడు, కృష్ణుడు ఎదో ఒకటి చెప్పిన ప్రతిసారీ, అర్జునుడు తాను యువరాజు అయినందున ఆ రోజుల్లో ఉత్తమ విద్య పొందిన కారణంగా, “కానీ కాదు, ఈ గ్రంధం ఇంకేదో చెబుతుంది” అనేవాడు. అతను చదివిన అన్నీ పుస్తకాల గురించి ప్రస్తావించాడు. కృష్ణుడు నవ్వుతూ “అంతర్ముఖ కాంతి ఉన్నత స్తాయికి చేరుకున్న మానవుడితో , ఈ గ్రంధాలని పోల్చి చెప్పాలంటే, వరద నీటి ముందు ఓ తొట్టెడు నీరు లాంటివి” అని అన్నాడు.

మీరు ఎడారిలో ఉన్నప్పుడు, తొట్టెడు నీరు మీకుసముద్రంతో సమానంగా అనిపించవచ్చు. కానీ, వరద వచ్చినప్పుడు, తొట్టెడు నీరు ఉంటే దానికి విలువ ఏముంది? సృష్టి కర్త మీలో నిత్యం ఉన్నప్పుడు, మీరు ప్రతీక్షణం అంతర్ముఖం లోకే చూడాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు