ఇతరుల ప్రతికూల అభిప్రాయాలను ఎలా ఎదుర్కోవాలి?

క్రికెట్ బంతి గాలిలో ఎగురుతున్నప్పుడు, బ్యాట్ ని జులిపించాలి. కాని ఇతరుల అభిప్రాయాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు ఏమి చెయ్యాలి? ఇతరుల ప్రతికూల అభిప్రాయాలు పట్టించుకోకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని మహిళా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలిరాజ్ సద్గురుని అడిగారు.
Illustration of a batswoman ready to bat, ball coming at her, and emojis with negative expressions coming at her | How To Deal With People’s Negative Opinions?
 

మిథాలి రాజ్: నమస్కారం సద్గురు గారు, మనమీద ప్రతిరోజు ప్రభావం చూపే ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉండటానికి కావలసిన శక్తిని మనము ఎక్కడ, ఎలా సంపాదించుకోవాలి?

సద్గురు: నమస్కారం మిథాలి. జనాలకు ప్రతి విషయం మీద ఏదో ఒక అభిప్రాయము ఉంటుంది, కానీ వాటి మీద మీరైనా, ఇంకొకరైన ఎందుకు దృష్టి పెట్టాలి? వారి అభిప్రాయాలు మనకు ఎప్పుడు ముఖ్యమవుతాయంటే, ఎప్పుడైతే మనము ఏమి చేస్తున్నామో మనకు ఒక స్పష్టత లేనప్పుడు. ఇతరుల అభిప్రాయాలతో మనం సంఘర్షణ పడటం కంటే, మనం ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో మనం స్పష్టత తెచ్చుకొనేందుకు ప్రయత్నించటం ఉత్తమం. మనకు ఈ స్పష్టత ఉన్నప్పుడు, ఇతరుల అభిప్రాయాలు మనకు ముఖ్యం కావు.

 

ఒకప్పుడు, మీరు ముగ్గురు లేదా నలుగురి అభిప్రాయాలను ఎదుర్కోవలసి వచ్చేది. కాని ఇప్పుడు యాభై లక్షల మంది అభిప్రాయాలను ఎదుర్కోవాల్సివస్తుంది, ఎందుకంటే వారు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇతరులకు ఎప్పుడూ మన మీద ఏవో ఒక అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి ఇంకా అది వారి హక్కులాగ భావిస్తారు. కన్నడ స్త్రీ సాధువు అక్క మహాదేవి ఒకసారి ఏమన్నారంటే “నువ్వు నీ ఇంటిని పర్వతాలు మరియు అడవులలో కట్టి, ఇప్పుడు జంతువులు ఉన్నాయని భయపడుతున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండవలసింది. నీ ఇంటిని బజారులో కట్టి, గోలకు భయపడుతున్నావు – నువ్వు ఉండటానికి సరిఅయిన చోటు కాదది”. 

మీరు ఇప్పుడు సమాజంలో ఉంటూ ఇతరుల మాటలకు భయపడుతున్నావు. ఇది సామాజిక జీవితములో భాగమే. ఎవరో ఒకరు ఎప్పుడూ ఎదో ఒకటి అంటూనే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వలన అది ఎక్కువ అయ్యింది కాని, ప్రజలకు వారి అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటూనే వచ్చాయి.

మనం ఏమి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అనే విషయం మీద మన జీవితంలో సంపూర్ణ స్పష్టత తెచ్చుకోవాలి. దీనిలో మీకు స్పష్టత ఏర్పడితే, జనాభిప్రాయలకు ప్రాముఖ్యత ఇవ్వవలసిన పనిలేదు.

ఒకప్పుడు, మీరు ముగ్గురు లేదా నలుగురి అభిప్రాయాలను ఎదుర్కోవలసి వచ్చేది. కాని ఇప్పుడు యాభై లక్షల మంది అభిప్రాయాలను ఎదుర్కోవాల్సివస్తుంది, ఎందుకంటే వారు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అది పర్వాలేదు. వారు ఏదైనా మాట్లాడొచ్చు కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏమి చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అనే విషయం మీద మన జీవితంలో సంపూర్ణ స్పష్టత తెచ్చుకోవటమే. దీనిలో మీకు స్పష్టత ఏర్పడితే, జనాభిప్రాయలు వాటంతట అవే మాయమైపోతాయి ఇంకా మారిపోతాయి. 

మీరు క్రికెట్ బంతిని బలంగా మోదుతారని విన్నాను. బంతిని సరిగా బాదండి. అందరి అభిప్రాయాలు మారటం మీరే చూస్తారు.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి.. UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1