సద్గురు:నేను మీకు ఒక టార్చిలైట్ ఇచ్చినప్పటికీ, మీరు దానితో ఇంటికి ఖచ్చితంగా చేరగల్గుతారని లేదు. మీరు మురుగ్గుంట లోనో, గుంటలోను పడకుండా మీకు టార్చిలైట్ వెలుగు చూపిస్తుంది, అంతే. కానీ, దాన్ని ఎలా వాడతారు అనేది, మీరు సరైన మార్గంలో నడుస్తున్నారా అన్నది మొత్తం మీ చేతుల్లోనే ఉంది. ఎంతోమంది టార్చితో కూడా వారి మరణం దిశగానే నడిచారు. పెద్ద దీపాలు పెట్టుకుని కూడా ఆలానే చేసారు! మీరు ఏం చేస్తారన్నది మీకే వదిలి వేయబడింది. మరి, ఉత్తమమైన దీపం ఏది? దాన్ని గురించిన నిర్ణయం మీరు చేయకూడదు. ఏదయినా మీకు బాగా పని చేస్తే, అది మీ జీవితాన్ని మెరుగు పరిస్తే, దానిపై మరింత శక్తి, సమయం వెచ్చించి, ఇంకొద్దిగా ప్రయత్నించండి.

గురువుకు ఎప్పుడూ అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉండటానికి కారణం, గురువు లేకుండా మిమ్మల్ని మీరు పరిణామం చేసుకోలేరు. మీకు తెలిసిన విషయం దిశగా కృషి చేయడం సాధ్యమే, కానీ మీకు తెలియని దానిలోకి మిమ్మల్ని మీరు ఎలా పరిణామం చేసుకోగలరు. అది చేయాలంటే, సృష్టిలోని అన్ని అంశాలలోనూ, శక్తి సంబంధమైన వాటి సహజ ధోరణలు చూడగలిగే ఎరుక మీకు ఉండాలి. అటువంటి ఎరుక కలవాడే, గురువు లేకుండా నడవగలడు.

గురువుకు ఎప్పుడూ అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉండటానికి కారణం, గురువు లేకుండా మిమ్మల్ని మీరు పరిణామం చేసుకోలేరు. మీకు తెలిసిన విషయం దిశగా కృషి చేయడం సాధ్యమే, కానీ మీకు తెలియని దానిలోకి మిమ్మల్ని మీరు ఎలా పరిణామం చేసుకోగలరు. అది చేయాలంటే, సృష్టిలోని అన్ని అంశాలలోనూ, శక్తి సంబంధమైన వాటి సహజ ధోరణలు చూడగలిగే ఎరుక మీకు ఉండాలి. అటువంటి ఎరుక కలవాడే, గురువు లేకుండా నడవగలడు.

Q: గురు సాన్నిధ్యం అనేది కొందరికి లభిస్తుంది, కొందరికి లభించదు, దేనివల్ల కొందరికే ఈ అవకాశం లభిస్తుంది?

సద్గురు: అంటే, అలా ఎన్నుకొనబడిన కొద్దిమందిలో ఉన్నాననుకోవడం మీకు ఇష్టమా? మీకు తెలుసా? అలా ఎన్నుకోబడిన వారు నిరంతరం కష్టాల్లో ఉంటారని? నేను మీకొక జోక్ చెప్పాలి. మొత్తం భూగోళంపై ఉన్న యూదులందరికి నేత అయిన జాషువా గోల్డ్బర్గ్, భగవంతునితో తన వార్షిక విందుకు వెళ్లారు. ఆ విందులో, భగవంతుడు వచ్చి ఆయన టేబుల్ వద్ద కూర్చున్నారు. కొన్ని బ్రెడ్ ముక్కలు విందులో వడ్డించారు. భగవంతుడు సంప్రదాయానుసారం ‘గ్రేస్’ చెప్పుకుని, తినడం మొదలు పెట్టాడు. జాషువా అక్కడ కూర్చునే ఉన్నాడు. భగవంతుడు ఆయన వైపు చూసి "జాషువా, కుమారా, నీవెందుకు తినడం లేదు?" అని అడిగాడు. జాషువా "తండ్రీ,! మిమ్మల్ని ఒక ప్రశ్న వేయచ్చా?" అని అడిగాడు. "తప్పకుండా" అన్నాడు భగవంతుడు. జాషువా "ప్రియమైన తండ్రీ,! నిజంగా మేము ఎన్నుకోబడినవారమా?” అని అడిగాడు. భగవంతుడు "కుమారా! సందేహమెందుకు? అవును, మీరు ఎన్నుకొనబడిన వారే" అని సమాధానమిచ్చాడు. జాషువా మళ్ళీ, "తండ్రీ, మేము నిజంగా, నిజంగా ఎన్నుకొనబడిన వారమా?" అని అడిగాడు. "అవును జాషువా. నీకు సందేహం ఎందుకు మొదలయింది? మీరు ఎన్నుకోబడిన వారే" అన్నాడు. జాషువా మళ్ళీ "ప్రియమైన తండ్రీ! మేము నిజంగా, నిజంగా, నిజంగా ఎన్నుకొనబడిన వారమా?” అని అడిగాడు. "అవును, అవును, అవును, అవును మీరు ఎన్నుకొనబడినవారే" అన్నాడు దేవుడు. అప్పుడు జాషువా లేచి, తన జాకెట్ సర్దుకొని "కొంతకాలం పాటు మరొకరిని ఎవర్నైనా ఎందుకు ఎంచుకోకూడదు?" అన్నాడు.

మరి, ఒక్కో వ్యక్తికి, అటువంటి సంభావ్యతల అవకాశం ఎందుకు లభిస్తుంది? గురువు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంభావ్యత. కొద్ది మందికే ఆ సంభావ్యత లభిస్తుందని కాదు. అందరికీ ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవచ్చు, కానీ, ఎవరయితే నిజంగా ఆకాంక్షిస్తారో, వారికి ఎప్పుడూ ఈ శక్తి అందుబాటులోనే ఉంటుంది.

కలుసుకున్న వారి కంటే, ఎక్కువ కలవని వారికే నేను ఉపదేశించాను. అది వాస్తవం. ఎప్పుడయితే ఒకరు తీవ్రంగా ఆకాంక్షిస్తారో, వారి ఆకాంక్ష, నన్ను పొందేటంత తీవ్రమయినదయితే, వారెక్కడున్నా సరే, నేను వారికి ఉపదేశిస్తాను. తెలుసుకోవాలని ఒకరి హృదయం రోదిస్తే, నేను వారికి ఎప్పుడూ ఉన్నాను. సంభావ్యత విషయానికి వస్తే, నా ముఖం చూడని ఎందరికో ఈ సంభావ్యత అందింది. ఇక, మీరు ఒక వ్యక్తిగా నా గురించి మాట్లాడుతుంటే, దానికేమంత ప్రధాన్యత లేదు.

గురువుతో దగ్గరగా ఉండడం అనేది ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు, ఎందుకంటే ఆయన మీ సిద్ధాంతాలనీ, పరిమితులనూ విచ్చిన్నం చేస్తారు. ఒక వ్యక్తిని ఎరగడం లేదా వారితో దగ్గరగా ఉండడం అనేది అనేక స్థాయిల్లో ఉండవచ్చు. సంభావ్యత అనేది కేవలం ఒక వ్యక్తికి ఉన్న తీవ్ర ఆకాంక్ష వల్ల మాత్రమే. ఎందరో ఆ వ్యక్తికి ఎంతో సన్నిహితంగా ఉండవచ్చు, కాని ఇంకా ఆ అవకాశానికి మాత్రం దూరంగానే ఉండవచ్చు. ఈ విషయాన్ని అనేక మంది, అనేక రీతుల్లో ప్రకటించారు, అందరికన్నా, గౌతమ బుద్ధుడు ఈ విషయాన్ని చాలా అందంగా ప్రకటించాడు. తన జీవితమంతా ఎల్లప్పుడూ గౌతమ బుద్ధునితో ఉన్నా, ఆనంద తీర్థులకు చివరిదాకా జ్ఞానోదయం కాలేదు. "ఈయన మీతో ఎల్లప్పుడూ ఉంటారు. ఆయనకు ఏమీ ఎందుకు జరగలేదు?" అని ఇతరులు ఆయనను ప్రశ్నించినప్పుడు, సమధానంగా గౌతమ బుద్ధుడు, "చెంచాకి సూపు రుచి తెలుస్తుందా?" అనేవారు. ఈ మాటే, అంతా చెప్తుంది. మీకు సున్నితత్వం ఉండాలి. మీకు జీవపరమైన సున్నితత్వం ఉండాలి, అంతేకాని అహంకార పరమైన సున్నితత్వం కాదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు


Editor’s Note: For more of Sadhguru’s insights, download the ebook Mystic’s Musings. Not for the faint-hearted, this book deftly guides us with answers about reality that transcend our fears, angers, hopes, and struggles. Sadhguru keeps us teetering on the edge of logic and captivates us with his answers to questions relating to life, death, rebirth, suffering, karma, and the journey of the Self. Download the sample pdf or purchase the ebook.