ప్రశ్న: సద్గురూ! మనం మౌనంగా ఉన్నప్పుడు కూడా మన మనసు మాట్లాడుతూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతుంది. గతం, భవిష్యత్తుల మధ్య తిరుగుతున్న ఆలోచనల వల్ల ఏ ఉపయోగమూ ఉండదు. వీటిని ఎలా ఆపాలి?

సద్గురు: ఆలోచన లేకుండా ఎలా ఉండాలా అనేదాని గురించి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. “ఆలోచనలు లేకపోవటం” “no-mind”, ఇలాంటి వాటి ప్రచారం బాగా జరిగింది, అవి పూర్తిగా అపార్ధం చేసుకోబడ్డాయి. ఎన్నో రకాల భ్రమలు ఏర్పడ్డాయి. దీనితో అందరూ ఈ మనసునెలా ఆపాలో తెలీక కష్టపడుతున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల పరిణామం జరిగింది, ఇంత సామర్ధ్యం గల మనసు కలగటానికి. లక్షల సంవత్సరాల ప్రకృతి కృషి చేసి ఇలాంటి విస్తృతమైన మనసుని సంపాదిస్తే, ఇప్పుడు మీరు దీన్ని ఆపేయాలనుకుంటున్నారు. అసలు ఎందుకు ఆపాలనుకుంటున్నారు?. మీ మనసు గనుక నిరంతరంగా మీకు హాయిని కలుగజేస్తూ ఉంటే, మీరు దాన్ని ఆపాలనుకుంటారా? చెప్పండి?.లేదు. అది దుఖాన్ని కలుగ చేస్తోంది. అందుకే మీరు దాన్ని ఆపాలనుకుంటున్నారు.

ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా అందరి బుర్రల్లోనూ ఒక విషయం నాటుకుపోయింది. అదేంటంటే, “ధ్యానం చెయ్యండి “అని చెప్పగానే “సద్గురూ..నేను నా మనసుని ఆపలేకపోతున్నాను” అంటారు. దానికి నేను “అది జరగాలంటే మీ కిడ్నీలూ, లివర్, గుండె, అన్నీ ఆగినప్పుడే.. అని. ఇవన్నీ ఆపెస్తే అప్పుడు మనసు కూడా ఆగిపోతుంది. మీరు ఇవ్వన్నీ అపాలనుకుంటున్నారా..? లేదు మరి మనసునేందుకు ఆపాలనుకుంటున్నారు?. మనసు మీద ఈ పక్షపాతం ఎందుకు?. మీ గుండె కొట్టుకుంటున్నా ధ్యానం చేస్తారు, మీ కాలేయం పనిచేస్తున్నాపరవాలేదు, మీ కిడ్నీలు పనిచేస్తున్నా ధ్యానం చేయగలరు. మరి మీ మనసు పనిచేస్తే మాత్రం ధ్యానం ఎందుకు కుదరదు? ఏం ఇబ్బంది?. మేధస్సు అంటే మీకు ఇష్టం లేనట్టు ఉంది... అంతేనా?...(నవ్వులు) ఇది మూర్ఖులు మానవ మేధస్సుపై పన్నిన ఒక కుతంత్రం-ధ్యానం చెయ్యటమంటే మీ మనసుని ఆపాలి అని. లేదు. మీరు మీ మనసుని జడ పదర్ధంలా చేయక్కర్లేదు. నిన్నే ఈ విషయం మనం చూశాం. మీకు శాoభవి ఉపదేశిస్తాం, ఇది సులువైన ప్రక్రియ. చాలా మార్గాలున్నాయి కానీ ఇదొక సులువైన మార్గం.. ప్రభావవంతమైన మార్గం.

మీరిక్కడ కూర్చుంటే, మీ శరీరం ఇక్కడ ఉంటుంది, మీ మనసు ఇంకో చోట, మీరెవరనేది ఇంకో చోట. ఒకసారి మీకు, మీ మనసుకీ మధ్య దూరం పెరిగితే అప్పుడు మీ మనసు ఎలా ఉన్నా మీకు సమస్య కాదు!!.   ఎలాగంటే, మీరిప్పుడు traffic jam లో చిక్కుకున్నారు, మీకు తెలుసు మీరు ఇరుక్కున్నారని, అదొక అనుభవం. అదే, మీరు చాముండి hill మీద నుంచున్నారో లేదా ఒక hot air balloon లో తేలుతూ కింద ట్రాఫిక్ ని చూస్తే?హాయిగా.....” ట్రాఫిక్.....!!ఉమ్.......(నవ్వులు). ఎందుకు? దూరం వల్ల అంతే కదా!!. మీరు అందులో ఉంటే..ట్రాఫిక్!!!!!! అదొక అనుభవం. ఎంతో ఎత్తున ఉంటే అక్కణ్ణించి శబ్దాలుకూడా వినిపించవు. అంతా అందంగా కనిపిస్తుంది. అంతేనా? ఇదంతా దూరం ఉంది కాబట్టే.  ఒకసారి మీకూ మీ మనసుకి దూరం పెరిగితే, మనసు సమస్యే కాదు. మనసు ఒక అద్భుతం- సమస్య కాదు.  ఒకవేళ మీకు ఆలోచనలు వస్తూ ఉంటే, మీకు మానసిక అతిసారం పట్టిందని అర్ధం. అంటే మీరు చెడు ఆహారం తీసుకున్నారు .. కదా!!. శారీరిరానికి విరోచానాలంటే   మీరేదో చెడు తిండి తిన్నారని అర్ధం. అదే మానసికమైతే మీరేదో చెడు విషయం గ్రహించారని. అది ఏమయ్యుoటుంది ??

మీరు కానిదానితో మీరు గుర్తింపు ఏర్పరచుకుంటే, ఇక అంతే- మనసు గాడి తప్పుతుంది. . ఇంకో మార్గం లేదు. మీరేమైనా చేయండి. అది ఆగదు. మీరుకానిదానితో మీరు గుర్తింపు ఏర్పరచుకోకపోతే, మీరు అన్నిటిమధ్యా ఉంటూ, అన్నిటినీ ఉపయోగిస్తూ కూడా, వాటితో గుర్తింపు ఏర్పరచుకోకపోతే, అప్పుడు మీరు చూస్తారు మీరిక్కడ కూర్చుంటే, మీ మనసు హాయిగా ఇలా ఉంటుంది - కావాలంటే వాడుకోవచ్చు లేదా, అది ఇలా ఉంటుంది అంతే. ఇప్పుడు మీ చేతులిలా ఉన్నాయ్...!! మీరువాటిని కట్టుకున్నారా అవి ఎగిరిపోతాయని? లేదు... !! మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టుకోవచ్చు . వాడాలనుకుంటే వాడచ్చు. ఇది  పనికొచ్చే సాధనం. ఒకవేళ మీ చేతులు ఇలా అయిపోయాయనుకోండి... కొందరు ఇలానే ఉంటారు తెలుసా.?? ఇలా అయితే పిచ్చి అంటారు...!! మీ మనసు ఇలా ఉంటే కూడా పిచ్చే... కాకపోతే ఎవ్వరూ దాన్ని చూడట్లేదనుకుంటున్నారు. కానీ ప్రజలు చూడగలరు. మిమ్మల్ని గమనించి చూస్తే  వారికి తెలుస్తుంది. ఔనా?. వాళ్ళు చూశారా లేదా అనేది ముఖ్యం కాదు.

ముఖ్యమైనదేంటంటే మీ జీవితంలోని ముఖ్యమైన సాధనం నియంత్రణలో లేకపోవటం. ఎదుటివారు చూస్తారా లేదా అనేది కాదు విషయం. విషయం ఏంటంటే మీ జీవితంలో అతిముక్యమైన సాధనం నియంత్రణ లేకుండా ఉంది-దానిష్టమొచ్చిన చెత్త పేరుస్తూ-మీరు చెయ్యమన్నదేదీ చెయ్యకుండా!! ఈ రోగం నుంచీ బయటపడాలంటే , చెడు ఆహారం తినటం మానెయ్యాలి. చెడు ఆహారం అంటే మీరు కాని దేనితోనో గుర్తింపు. ఇప్పుడు మీరిలా కూర్చుంటే, మీరు దీనితో గానీ దీనితో గానీ గుర్తింపు ఏర్పరచుకోకపోతే, అంతా బానే ఉంటుంది. అప్పుడు మీ మనసు మీరు ఏమి చెయ్యమంటే అది చేస్తుంది-లేకపోతే అదలా ఉరికే ఉంటుంది. అదలాగే ఉండాలి కూడా!! మనసు మీకు తన కథలను  చెప్పకూడదు. అది మీరు చెప్పాలనుకున్న కధనే చెప్పాలి. ఔనా?.లేకపోతే అదొక పెద్ద నస.

ప్రేమాశీస్సులతో,
సద్గురు