"మనుగడ కోసం అవసరమైన విషయాలకు, ఏ ట్రైనింగూ అక్కర్లేదు, మీరు ప్రత్యేకంగా కృషీ చేయక్కర్లేదు; అవి సహజంగానే వస్తాయి! అలా అని- చదవడం, రాయడం, ఇంకా ఇప్పుడు మీరు అలవోకగా చేస్తున్న మిగతావన్నీ కూడా తెలుస్తాయా? తెలీవు! ఎందుకంటే, మనుగడకు అతీతమైనది ఏదీ కూడా మీరు కృషి చేస్తే తప్ప మీ జీవితంలోకి రాదు. కానీ ఏదైతే మనుగడకి అవసరమో, అది ఏ కృషీ లేకుండానే తెరుచుకుంటుంది" - సద్గురు