రణ్వీర్ సింగ్: సార్! ఇప్పుడు సాంకేతికత వృద్ధిచెందుతున్నది, మన జీవన విధానాన్ని మొబైల్ ఫోన్ బాగా మార్చివేస్తున్నట్లు నేను భావిస్తున్నాను. జీవితంలోని ప్రతి అంశంమీదా వాటి ప్రభావం ఉన్నది. ఒక్కోసారి ‘మానవులు ఎప్పుడూ ఇలా కబుర్లాడుకోటానికే ఉన్నారా?’ అనిపిస్తుంది నాకు. నేను ఆఫ్రికాలో అడవుల్లో ఉండి కూడా ఎక్కడో ఉత్తర ధృవంలో ఉన్న వ్యక్తితో మాట్లాడవచ్చు, నిజానికి నేను వారిని చూడవచ్చు కూడా.

దానికి తోడు ఇక ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి. అది నిజంగా అన్నీ మార్చి వేస్తోంది. ముఖ్యంగా పద్దెనిమిది, పంధొమ్మిది వయసు పిల్లలు దానిలో మరీ చిక్కుకుపోతున్నారు. వాళ్లకు వాటిని వాడడం ఎలానో బాగా తెలుసు. నేను ఇంకా పాతకాలపు ల్యాండ్ లైన్ ఫోన్లను వాడే కాలంలో పుట్టాను. అందుకే ఈ ఫేస్ టైమ్ లాంటివి నాకు ఇంకా కొత్తే. మరి, ఈ మొబైల్ ఫోన్ల విషయంలోనూ, సోషల్ మీడియాపైనా మీ ఉద్దేశ్యం ఏమిటి? అది సరికొత్త పరిణామమా? మానవులంటే ఇలా ఉండేవారు, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ఇలా తయారయ్యారు, అని ఏమన్నా ఒక పరిణామమా?

సద్గురు: మనం తయారు చేసిన యంత్రాలన్నీ మన సామర్ధ్యాలను ఏదో రకంగా పెంచేవే. ఉదాహరణకు మనం చూడగలం కాబట్టి, మనం టెలిస్కోపు, మైక్రోస్కోపులను కనుకొన్నాము. మనం మాట్లాడగలం, అందుకే మైక్రోఫోన్, టెలిఫోన్లు వచ్చాయి. నేను పూర్వం లాండ్ లైన్ వాడాను, అది బాగేనే ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడుతున్నాను, ఇది మరింత సౌకర్యవంతమైంది, అంటే అది మంచిది కాదనా? కాదు, అది ఎంతో మంచిది.

మీరు పరిష్కరించుకోవలసింది మీ నిర్బంధతలను. సాకేంతికత మనకెన్నో సామర్ధ్యాలనిస్తోంది, వాటిని గురించి మన ఫిర్యాదులు చేయకూడదు.

ఓ ముప్ఫై ఐదేళ్ల క్రితం, నేనెప్పుడూ రోడ్డుమీదే ఉండేవాడిని, దేశమంతా తిరుగుతూ, ఈశా ఫౌండేషన్ నిర్మాణానికి ఊరూరా తిరుగుతూ పాటు పడుతుండేవాడిని. నాకు ఏవో కొద్ది రోజులలోనే టెలిఫోన్ సౌకర్యం ఉండేది. మీకు తెలుసోలేదో, ఆకాలంలో రోడ్లవెంట, STD, ISTD, LOCAL టెలిఫోన్ బూత్ లని నీలం రంగు డబ్బాలు ఉండేవి. నాకు రోడ్డు మీద అటువంటిది కనబడితే ఇక ఆరోజు నేను ఫోన్ లు చేసుకునే వాడిని.

నా దగ్గర ఎన్నడూ టెలిఫోన్ బుక్ ఉండేది కాదు. నాకు దాదాపు ఏడెనిమిది వందల టెలిఫోన్ నంబర్లు, పేర్లు గుర్తుండేవి. నాకు ఆ టెలిఫోన్ బూత్ కనపడగానే, నేనో  ఐదువేల రూపాయలు బూత్ ఆపరేటర్ చేతిలో పెట్టేవాడిని, అది ఎందుకో అతనికి అర్థమయ్యేది కాదు. నేనతనితో ఇది పేమంట్ అట్టిపెట్టోకో మనే వాడిని, సామాన్యంగా ఒక్కో కాల్ ఐదారు రూపాయలౌతుండేది మరి అంతడబ్బెందుకిస్తున్నానో అతనికి అర్థమయ్యేది కాదు. 

నేను ఆ నల్లటి, గబ్బుకొట్టే టెలిఫోన్ ఉన్న బూత్ లోకి వెళ్లేవాడిని. కొందరు దానిలో కాస్త సెంట్ చల్లేవారు, కాని చాలావాటిలో అందరి వాసనా ఇంకా కొడుతూనే ఉండేది. ఇక నేను ఐదారు గంటలపాటు మాట్లాడుతూనే ఉండేవాడిని. నేను ఒక నెలరోజులకు సరిపడా ఫోనులు చేసేవాడిని.

షోన్ చేసుకుందామని వచ్చే మిగతా వారంతా, నేను బయటకు రానందుకు నాకు సైగలు చేస్తూ ఉండేవారు. కాని నేను ఐదువేల రూపాయలు ఇవ్వడం వల్ల ఆ బూత్ ఆపరేటర్ వాళ్లను సమాధానపరచేవాడు. నా ఫోన్ కాల్స్ ముగించుకొని నా కారులో వెళ్ళిపోయేవాడిని. చివరకు ఆ ఫోన్ కాల్సు అయ్యేటప్పటికి నాచేతి వేళ్ళకూడా నొప్పులు పుట్టేవి. 

కానీ ఇప్పుడు నేను ఎవరిదైనా పేరు చెప్పగానే, నాఫోనే ఆటోమేటిక్ గా కాల్ చేస్తుంది.

రణ్వీర్ సింగ్: అవును!

సద్గురు: ఇదిప్పుడు మామూలే, ఈ సాంకేతికతను నేనెంతో మెచ్చుకుంటాను. కొందరు ఫిర్యాదులు చేస్తుంటారు, కాని వారు ఫిర్యాదులు చేసేది ఈ సాంకేతికత మీద కాదు, నిజానికి వారికి తెలియనిదేమిటంటే వారు ఫిర్యాదులు ఇచ్చేది తమ నిర్బంధతల మీదే అని.

నిర్బంధత కేవలం ఈ ఫోన్ల విషయంలోనే కాదు. ఉదాహరణకు వాళ్ళు తినడం మొదలిడితే వారికి ఎక్కడ ఆపాలో తెలియదు. వారు తాగుతుంటే ఎక్కడ ఆపాలో తెలియదు. ఈ నిర్బంధతలు జీవితం అన్ని అంశాలలో ఉన్నాయి. ఇదే కోవలోకి ఇప్పుడు చేరిందే డ్రగ్స్, కాని అది చాలామందిని త్రాగుబోతు తనాన్నించి దూరం పెడుతోంది కూడా.

రణ్వీర్ సింగ్: అంటే అందులో కాస్త మంచి కూడా ఉందన్నమాట.

సద్గురు: మీరు పరిష్కరించుకోవలసింది మీ నిర్బంధతలను. సాకేంతికత మనకెన్నో సామర్ధ్యాలనిస్తోంది, వాటిని గురించి మన ఫిర్యాదులు చేయకూడదు. లేకపోతే మిమ్మల్ని ఆ నల్ల ఫోన్ ఉన్న నీలం బాక్సులో పెట్టాలి. అప్పుడు మీకు అర్థం అవుతుంది.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image