గురు పౌర్ణమి నాడు గ్రహస్థితి - దాని ప్రాముఖ్యత

సద్గురు: అన్ని పౌర్ణమిల్లోకెల్లా ప్రత్యేకించి ఈ పౌర్ణమి గురువుకి ఎందుకు అంకితం చేయబడింది? ప్రాథమికంగా, మన గ్రహణ శక్తి ప్రాతిపదికగా తీసుకుని చూస్తే, సూర్యుడి చుట్టూ ఉన్న భూమి కక్షలోని కొన్ని స్థానాలకు విశేషమైన స్వభావాలు ఉంటాయి. సంవత్సరంలోని ఈ ప్రత్యేక దినాల్లో ఎందరో సాధువులు, సన్యాసులు ముక్తిని పొందారు. కేవలం ఇటువంటి రోజుల వల్ల వారికి ముక్తి కలుగలేదు, వారు అప్పటికే ఆ ప్రక్రియలో ఉండి దానికి ఎంతో చేరువగా ఉన్న వాళ్లు - ఇటువంటి రోజుల్లో ప్రకృతి అందించే సహజమైన సహకారం వల్ల ఈ వికాసం తేలికగా జరుగుతుంది.

గురు పౌర్ణమి రోజున, చంద్రుడికి ఇంకా మిగతా గ్రహాలకు మధ్య ఒక సాన్నిహిత్యం ఉంటుంది; ఇది మనం గురువుగా సంభోదించే ఆ పార్శ్వం పట్ల ప్రజలకు గ్రాహ్యతను కలిగిస్తుంది.

యోగ సంప్రదాయంలో శివుడిని మనం దేవుడిగా ఆరాధించము. ఆయనను ఆదియోగిగా అంటే మొదటి యోగిగా ఇంకా   ఆది గురువుగా - యోగ శాస్త్రాలను ఆవిర్భవించిన మొదటి గురువుగా పరిగణిస్తాము.

సాంప్రదాయపరంగా ప్రజలు ఈ గ్రాహ్య కాలాన్ని వారు ఉపయోగించుకోగల ఉన్నత విధానంలో ఉపయోగించుకునేవారు. సాధారణంగా భారతదేశంలో ప్రజలు గురు సామీప్యంలో, చంద్రకాంతిలో గడిపేవారు. రాత్రంతా సంగీతం, నృత్యం, ధ్యానాలు, పారవశ్యంలో గడిపేవారు.

గురుపౌర్ణిమ - అనుగ్రహానికి ఆలవాలమైన కాలం

సంవత్సరంలోని ఈ సమయంలోనే ఆదియోగి దృష్టి ఆయన మొదటి శిష్యులైన సప్తఋషుల మీద పడింది. యోగ సంప్రదాయంలో శివుడిని మనం దేవుడిగా ఆరాధించము. ఆయనను ఆదియోగిగా అంటే మొదటి యోగిగా ఇంకా   ఆది గురువుగా - యోగ శాస్త్రాలను ఆవిర్భవించిన మొదటి గురువుగా పరిగణిస్తాము.

ఆయన ఒక యోగి ఇంకా తాపసి; తన చుట్టురా ఏం జరుగుతోందో, అది ఎంత మాత్రమూ పట్టించుకోని వ్యక్తి, మెల్లిగా పట్టించుకోవడం మొదలు పెట్టినటువంటి ఈ మాసంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఆయనకు ఉన్న అనుభూతిని పంచుకోవాలన్న ఉద్దేశం మెల్లిగా ఆయనలో వికసించడం మొదలు పెట్టింది ఈ మాసంలోనే.

ఆయన నుండి ఒక్క క్షణం పాటైనా వారి పట్ల శ్రద్ధని నోచుకోకుండానే, సప్త ఋషులు 84 సంవత్సరాల పాటు సరళమైన ప్రాథమిక సాధన చేస్తూ ఉన్నారు. ఆ తరువాత సూర్యుడు ఉత్తర ముఖం నుండి దక్షిణానికి మారుతున్నప్పుడు -భారత సంప్రదాయంలో వీటినే మనం ఉత్తరాయణం ఇంకా దక్షిణాయణం అంటాం - ఆదియోగి ఈ ఏడుగురిని చూసి వీరు తేజో పాత్రులుగా ఉండడాన్ని గమనించారు. ఆ తరువాత 28 రోజుల పాటు ఆయన వారి మీద నుంచి ఆయన దృష్టిని మరల్చలేకపోయారు. ఆయన వారి పట్ల చూపిన శ్రద్ధ సంపూర్ణమైనది.

ఆయనాతం  తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున అయన వారికి బోధించాలని నిశ్చయించుకున్నారు. అయన గురువుగా మారేందుకు నిశ్చయించుకున్నారు. ఈ పౌర్ణమినే మనం గురుపౌర్ణమిగా సంబోధిస్తాను. ఒక కఠినమైన మనసు కల తాపసి కూడా ఈ నెలలో వారిని విస్మరించలేకపోయారు, కారుణ్యంతో నిండిపోయారు. ఈ మాసానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. ఎవరైతే కఠోరంగా ఈ ప్రపంచం తనను స్పృశించడానికి వీలుకాకుండా ఉన్నారో, అటువంటి వ్యక్తి కూడా మెత్తబడ్డారు. కారుణ్యంతో ఒక గురువుగా మారారు. ఆయనకి అసలు ఇటువంటి ఉద్దేశమే లేదు.

అందుకని ఈ నెల గురు అనుగ్రహాన్ని పొందేందుకు ఇంకా  మీరు గ్రాహ్యత కలిగి ఉండేందుకు, ఉత్తమమైనదిగా చూడబడుతుంది. గురు అనుగ్రహాన్ని పొందేందుకు ఇది ఉత్తమమైన సమయం.

గురుపౌర్ణమి - మీ గ్రహణశక్తిని పెంచుకోవడం

“నేను ఏమి చేయాలి?” అన్నది ఎల్లప్పుడూ కలిగే ప్రశ్న. మీ సొంతగా మీరు ఏదీ చేయకపోతే మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉంటే, గ్రహణ శక్తితో ఉండేందుకు ఉత్తమమైన మార్గం. సాధన ఎప్పుడూ ఇలానే రూపొందించబడి ఉంటుంది. ఇది మీరు మీ పనిలో ఎలా నిమగ్నం అయ్యేలా చేస్తుందంటే మీ నిత్య జీవన ప్రక్రియలలో, మీరు ఎవరు మీ జీవితం, దేని గురించి అన్నది మీరు మరిచిపోయేలాగా ఉంటుంది. మీరు జరుగుతున్న దానిలో పూర్తిగా నిమగ్నమై ఉండటం అనేది అనుగ్రహాన్ని పొందేందుకు ఉత్తమమైన మార్గం.

మీకు తెలుసా, “మీరు ఎవరు” అన్న స్పృహ మీకు లేనప్పుడు, మీరు శ్వాసను మరింత మెరుగ్గా తీసుకుంటారు. మీరు గమనించారా, ప్రజలు నిద్రపోతున్నప్పుడు ఎంత సున్నితంగా శ్వాస తీసుకుంటారో? మీరు వాళ్లని పగటి పూట చూస్తే వారి శ్వాస అల్లకల్లోలంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎంత పరిమితంగా చేసుకుంటే, మీ శ్వాస ప్రక్రియ అంత పరిమితమైపోతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుందో మీ శ్వాస ఎల్లప్పుడూ అలానే ఉండాలి.

జెన్  సాంప్రదాయంలో, మానవ చైతన్యాన్ని ఎలా పెంపొందించాలో చెప్పేందుకు, ఒక అందమైన కథ ఉంది. ఒక శిష్యుడు ఓ జెన్ గురువు దగ్గరికి వెళ్లి, “నా ఆధ్యాత్మిక ఉన్నతికి నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. “నేలని శుభ్రం చెయ్యి, కట్టెలు కొట్టు, వంట చెయ్యి. అంతే” అన్నారాయన.

“దానికోసం నేను ఇక్కడికి రావడం ఎందుకు..? అది ఇంటి దగ్గర కూడా చేయవచ్చు కదా” అంటే, అక్కడ మీరు మీ నేలని మాత్రమే శుభ్రపరుస్తారు, పక్కిల్లు శుభ్రంగా లేకపోతే శుభ్రం చేయరు. మీరు కొట్టిన కట్టెలు మీరు మాత్రమే వాడుకుంటారు. మీకు, మీ వాళ్లకు మాత్రమే భోజనాన్ని వండుతారు. మీరు చేసే ప్రతి పని మీలో నేను, నాదీ అన్న భావన మరింత బల పడేలా చేస్తోంది కానీ మిమ్మల్ని లయం చేసేలా లేదు. మన కర్మను ఒక బంధంగానో లేదా ముక్తికి సోపానంగానో చేసేది ఈ తేడానే. అయితే మీరు కర్మను పోగు చేసుకుంటున్నారు లేదా మీ కర్మ యోగం అవుతోంది.

అందుకే నేల శుభ్రం చేయడం, వంట చేయడం, ఒక మామిడి చెట్టు నాటడం - మీ శత్రువు, అతని పిల్లలు ఈ మామిడి పళ్ళు తిన్నా మీకు పర్వాలేదు, అది మీరు పట్టించుకోరు... ఎవరు తింటున్నారన్నది. మొక్క నాటారు.. అంతే…! ఇలా చేస్తే మీరు చేసే పని, మీరు లయమయ్యేందుకు సాధనం అవుతుంది. లేదా అది మిమ్మల్ని నిర్బంధిస్తుంది. దురదృష్టవశాత్తు, వారు చేసే పనులే ప్రజల్ని నిర్బంధిస్తున్నాయి. మానవ సామర్థ్యం నిర్బంధించుకోవడానికి ఉపయోగించబడుతోంది. మానవులు మేధస్సుని తమకి తామే విచారం కలిగించుకోవడానికి వాడుతున్నారు. 

ఆధ్యాత్మిక పధంలో ఉన్న వారికి సంవత్సరంలోకెల్లా అతి ముఖ్యమైన రోజు గురు పౌర్ణమి. ఈ రోజున ఆదిగురువు ఇంకా మార్గమధ్యంలో ఉన్న ప్రతి గురువు అనుగ్రహం వారు పొందాలనుకుంటారు.

ఒకసారి మీరు ఇలా చేయడం మొదలు పెడితే మీకు తెలియకుండానే మీరు సామర్థ్యానికి శత్రువు అవుతారు. ఇలా అవడం మంచిది కాదు. మీరు సామర్థ్యానికి, మేధస్సుకి వ్యతిరేకంగా ఉంటే మీరు కోరుతున్నది అధోగతి కానీ పురోగతి కాదు. మీరు పరిణితి చెందడాన్ని కోరుకోవడం లేదు, ప్రస్తుత స్థితి కంటే అధోగతి పాలు అవ్వాలనుకుంటున్నారు.

మీ పురోగమనం కోసం గురు పౌర్ణమి ప్రాముఖ్యత

ఈ రోజుల్లో ప్రజలు నేను ఒక చిన్న పిల్లవాడిలా ఉందామని అనుకుంటున్నాను అనడం పరిపాటి అయిపోయింది. ఆధ్యాత్మిక గురువులు అనబడే వారు కూడా నేను ఒక పిల్లవాడు లాంటి వాడిని అంటున్నారు. మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎంతో వేగంగా ఎదగాలి అనుకున్నారు ఎందుకంటే పెద్దవారికి ఉన్న సామరస్యతలతో పోల్చి చూస్తే మీరు ఎంత చిన్నగా నిరుపయోగంగా కనపడ్డారు మీకు. మీరు ఎదిగిన తర్వాత దాన్ని ఎలా నిర్వహించుకోవాలి చేతకాక మీరు పిల్లవాడిలా ఉండాలనుకుంటున్నారు.

పిల్లలు అలా ఉండడం మంచిదే ఎందుకంటే త్వరలోనే మార్పులు వస్తాయి అని మనకు తెలుసు అందుకే మనం వాళ్ళని విలువగా చూసుకుంటాను కానీ ఎల్లప్పటికీ మీరు అలానే ఉంటే అప్పుడు దానికి ఎటువంటి విలువ లేదు.

ఎదగడం అన్నది విలువైనది. మీ శరీరంతో మనసుతో ఎన్నో పనులు చేయగల సమర్ధత కలిగి ఉండడం అన్నది విలువైనది. మీ శరీరాన్ని మనసుని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వాటిని మీరు బంధనాలను విచారాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించి ఆ తర్వాత మీరు అసలు పెరిగి పెద్ద ఉండకపోతే బావుండు అని కోరుకుంటున్నారు. ఇలా జరిగి ఉండకపోతే ఎదగడం అన్నది ప్రతి వారు కోరుకునే విషయం. ఎవరు వెనక్కి పోవాలి అనుకోరు.

ఈ నెల అనుగ్రహంతో నిండి ఉన్న నెల. అనుగ్రహం మీ ఎదుగుదలకు ఏరు వంటిది. మానవులకు తనకు తానుగ అస్తిత్వంలోని మరో పార్శ్వానికి ఎగరగల సామర్థ్యం ఆవశ్యకత కలిగించేది. అనుగ్రహాన్ని ఉపయోగించుకోవాలంటే ఏమి చేయాలి? చేయడానికి ఏమీ లేదు మీరు మీరు ఎంత తక్కువ చేసుకుంటే మీరు బయట అంత ఎక్కువ పని చేయగలరు అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

గురుపౌర్ణిమ ముక్తిని కలిగించే రాత్రి

ఆధ్యాత్మిక పధంలో ఉన్న వారికి సంవత్సరంలోకెల్లా అతి ముఖ్యమైన రోజు గురు పౌర్ణమి. ఈ రోజున ఆదిగురువు ఇంకా మార్గమధ్యంలో ఉన్న ప్రతి గురువు అనుగ్రహం వారు పొందాలనుకుంటారు.

15 వేల సంవత్సరాల క్రితం గురు పౌర్ణమి నాటి రాత్రి ఆదియోగి సప్తఋషులపై ఆయన దృష్టిని సారించారు. మానవ చరిత్రలో మొట్టమొదటి సారిగా మానవులకు వారిది నిర్బంధ జీవితం కాదని గుర్తు చేయబడింది, వారు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ అస్తిత్వంలో ప్రతి ద్వారం తెరుచుకుని ఉంది. ప్రకృతి విధించిన సరళమైన నియమాలకు మానవుడు బంధీ అవ్వాల్సిన అవసరం లేదు.

మానవుడికి అత్యంత దుఃఖాన్ని కలిగించే విషయం నిర్బంధ స్థితిలో ఉండడం. మేము అమెరికాలో ఇంకా భారతదేశంలో కూడా జైళ్లలో మా కార్యక్రమాలను నిర్వహించాము. నేను ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గాలిలో ఏదో ఒక భాదని అనుభూతి చెందుతాను. ఇది నేను ఎప్పటికీ వివరించి చెప్పలేను. నేను భావావేశాలకు లోనయ్యే రకాన్ని కాదు అయినప్పటికీ జైలుకు వెళ్లిన ప్రతిసారీ ఆ గాలిలో ఉన్న నా కళ్ళు చెమర్చకమానవు. నిర్బంధం వల్ల కలిగిన బాధ ఇది. మౌలికమైన ఈ మానవ స్వభావాన్ని తెలుసుకుని అర్థం చేసుకొని ఆదియోగి ముక్తిని గురించి మాట్లాడారు.

మన సాంప్రదాయంలో ముక్తి అత్యున్నతమైన లక్ష్యం ఉన్న ఒకే ఒక లక్ష్యం. మీ జీవితంలో మీరు చేసే ప్రతిది మీ ముక్తి కోసమే ఎందుకంటే నిర్బంధం ఎలాంటిదైనా సరే అది జైలు గోడల మధ్య నిర్బంధమైనా, అది వివాహం లేదా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల వల్ల లేదా కేవలం ప్రకృతి విధించిన నియమాలు ఆ మాటకు వస్తే ఏదైనా సరే మీరు బంధనం అనే విషయాన్ని మానవుడు అంగీకరించ లేడు ఎందుకంటే అంతర్లీనంగా ముక్తిని కాంక్ష అతనిలో ఉంటుంది.

కొన్ని వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఈ రోజున ఆదియోగి మనకు ఈ నిర్బంధ స్థితిని ఎలా అధిగమించాలో అందుకు మార్గాన్ని అందించారు. ఆదియోగి గొప్పతనానికి నేను ఆయనకి ప్రణామం చేస్తున్నాను. కానీ సప్త ఋషుల పట్ల నాకున్న ఆరాధన భావం ఆదియోగి మీద ఉన్న దానికంటే మించినది. ఆయన వారిని విస్మరించలేని విధంగా సప్తఋషులు వారిని వారు మలుచుకున్నారు.

ఏ గురువైనా, యోగి అయినా ఇలాంటి మరొక ఏడుగురిని సంపాదించుకోలేకపోయారు - వారు అందించాలనుకున్నవి అందించలేకపోయారు. ఎందుకంటే అది గ్రహించగల సామర్థ్యం ఉన్న వారు వారికి దొరకలేదు. ఎందరో యోగులకు గురువులకు అద్భుతమైన భక్తులు ఉన్నారు వారి అనుగ్రహాన్ని వారిపై కురిపించారు. కానీ ఇలాంటి ఏడుగురిని - ఎవరితో అయితే వారి జ్ఞానాన్ని పంచుకోగలరు అటువంటి వారు మరెవరికీ దొరకలేదు. అది ఇంకా జరగలేదు మేమూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు