కొన్ని వందల సంవత్సరాల క్రితం జాన్ విల్మాంట్ అనే ఒక ఆంగ్ల మోతుబరి, పిల్లల పెంపకం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. " పెళ్ళికి ముందు నా వద్ద పిల్లల పెంపకం గురించి ఆరు సిద్దాంతాలుండేవి, ఇప్పుడు ఆరుగురు పిల్లలున్నారు సిద్దాంతాలు లేవు". కాబట్టి, పిల్లల పెంపకం అంటే మీరేం చెయ్యాలి? మీరు వెనుదిరిగి మీ బాల్యాన్ని చూసుకోండి, ఎటువంటి తల్లిదండ్రులైతే మీకు బాగుండేది? ఒక పిల్లవాని లా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది.

దురదృష్టం ఏంటంటే, పిల్లలు పుట్టడమే సరిగ్గా పుట్టలేదు కాబట్టి , మనం వారిని సరిదిద్దాలని అందరూ నమ్ముతున్నారు, ఇది నిజం కాదు. సాధారణంగా మనం తల్లిదండ్రులను, పిల్లలను, చూసినట్లైతే, ప్రత్యేకించి పది సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లల్ని చూసినట్లైతే, ఖచ్చితంగా వారు ఆనందంగా ఉంటారు. అటువంటప్పుడు జీవితానికి సలహాదారు ఎవరై ఉండాలి? - ఎవరైతే ఆనందంగా వున్నారో వారా లేక, వారి సంతానాన్ని సంభాళించుకోలేక సతమతమవుతున్న వారా? మీ పిల్లలు మిమ్మల్ని అనుకరిస్తారు. మీరు వారి ముందు ఒక ఉదాహరణగా నిలిస్తే చాలు. వారి పెంపకం గురించి ఎక్కువగా చెయ్యవలసిందేం లేదు.

1. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి

మీరు పిల్లల్ని కనేముందు మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ విశ్లేషించుకోండి. మీరు కూర్చునే విధానం , నిలబడే తీరు ఎలా ఉంది, మీరు మాట్లాడే తీరు , ప్రతి పరిస్థితికి .ప్రతిస్పందించే విధానాలనన్నిటి నీ ఎలా ఉన్నాయని విశ్లేషించుకోండి. . ఒక వేళ మీరు గనక ఓ అయిదు సంవత్సరాల పిల్లవాడైతే, ఇటువంటి మనిషిని ఇష్టపడతారా? అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. వీలైనంత సమయం పిల్లలతో వెచ్చించి వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, ఇంకా మీరు వారిని ఇష్టపడుతున్నారా, గమనించండి, ఈ విధంగా చాలా జ్ఞానం అంకురిస్తుంది. సంతానసాఫల్య కేంద్రాలు మూతపడతాయి.

2. సరైన వాతావరణం కల్పించండి.

మీకు ఇప్పటికే పిల్లలు వున్నట్లైతే, మీరు చేయాల్సిందల్లా, ప్రేమపూరితమైన, అనుకూలమైన మరియు ఉత్సాహపూరితమైన వాతావరణం కల్పించడం. నిజానికి వారికి నేర్పించవలసినది ఏమీ లేదు. మీ పిల్లవాడికంటే మీరు కాస్త ముందు ఇక్కడికి వచ్చారు. మీ పిల్లవాడికి తెలియనిది, మీకు తెలిసినది, ఏంటంటే కాసిన్ని ప్రాపంచిక ఎత్తులు, ఎలా జీవించాలి, జీవనం సాగించడానికి ఏం చెయ్యాలి- ఇవే /ఇంతే. కానీ మీకు జీవితం యొక్క లోతైన అంశాలు తెలియవు. ఈ ఎత్తులు పిల్లలకు ఇంత తొందరగా నేర్పించాల్సిన అవసరం లేదు. వారు వాటిని తరువాత నేర్చుకుంటారు. పిల్లలు మీ జీవితంలోకి వచ్చారంటే ఇది నేర్చుకునే సమయం, నేర్పించే సమయం కాదు. పిల్లలకు ఏది ప్రమాదమో ఏది కాదో ఇలాంటివి తెలియదు. మీకు ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ఒక పరిజ్ఞానం ఉంటుంది. పిల్లలకు ఇది ఉండదు. వారు ప్రమాదంవైపుగా వెళ్తున్నట్టయితే మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించండి లేదంటే పిల్లలు మీకంటే చాలా ఆనందంగా వారి జీవితం గడపగలరు. మీరు అవి వారి దగ్గర నేర్చుకోండి.

మీకు పనిచేయని, మీరు ఎప్పుడూ పాటించని ఆంక్షలు వారికి నేర్పించకండి. ప్రతి సమాజంలో కొన్ని ఆంక్షలుంటాయి. ప్రతి ఒక్కరూ అవి పాటించి ఉంటే ప్రపంచం వేరే విధంగా వుండేది, స్పష్టంగా తెలుస్తుంది అవి ఎవరూ పాటించలేదని. అయినా ఈ ఆంక్షలు ఇంకా వున్నాయి ఎందుకంటే జనం వారి పిల్లలకు ఇవి నేర్పిస్తూ ఉంటారు. ‌మీ పిల్లలు మీకన్నా బాగుండాలనుకుంటే మీరు చేయవలసింది నిజాయితీ, నైతిక విలువలతో కూడిన సమగ్రతా పూర్ణ వాతావరణాన్ని ఏర్పరచడం ., ఇది వారు ఎక్కడికి వెళ్లినా జీవితం కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. మీరు పాటించలేని విషయాలు మీరు వారికి నేర్పిస్తే కొంతకాలానికి వారికి ఆ విషయం అవగాహన అవుతుంది. మీ మాటలు, ప్రవర్తన ఒకటై వుండాలి. మీరు ప్రేమతో, ఉత్సాహపూరితమైన వాతావరణం కల్పించ గలిగితే వారు బాగానే ఉంటారు.

3. బొమ్మలు వదిలెయ్యండి, చెట్లు ఎక్కండి

మీరు వారిని భౌతికంగా పోషించండి, మానసికంగా ఉత్తేజితులను చేయండి. వారిని బయటకు ప్రకృతిలోకి తీసుకెళ్ళండి, అక్కడ . . కీటకం నుంచి ఒక పువ్వు దాకా అన్నీ ఉత్తేజకరంగా ఉంటాయి. కానీ నేడు చాలా మంది తల్లిదండ్రులు ఏదో ఒకటి కొని పిల్లల గదిలో పడేసి తాళం వేస్తున్నారు. ప్రతిదీ కవచంలా తయారు చేసి వారికి ప్రమాదం కలగకుండా పెట్టి,.. తల్లిదండ్రులు పార్టీకి వెళ్ళటానికి వీలవుతుందిక. ఇది కాదు పిల్లల పెంపకం అంటే.

ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి, ప్రపంచంలో 20%-30% పిల్లలకు బొమ్మలు కొంటున్నారు, మిగతా 70% పిల్లలకు జీవితంలో ఒక్క బొమ్మైనా ఉండదు. ఎవరికైతే ఈ బొమ్మలున్నాయో వారే చాలాసార్లు మానసిక , భావోద్వేగ సమస్య లకు లోనవుతున్నారు. మిగతా వారు పోషణ లోపంతో, ప్రాథమిక అవసరాలు తీరక ఇబ్బంది పడచ్చు. కానీ ధనికులు మాత్రం అంతరంగ మథనం చెందుతున్నారు. దాని బదులు, మీరు కాస్త మీ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళే శ్రమ తీసుకుంటే ., వాళ్ళను చెట్టెక్కించ గలిగితే, ఎక్కడికైనా నడిపించుకుంటూ తీసుకెళ్లడం, లేదా ఈతకు తీసుకెళ్లడం లేదా ఇటువంటివేదైనా చేస్తే మీ పిల్లలు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంటారు.

4.ఇరవై సంవత్సరాల ప్రాజెక్టు సంసిద్ధం అవ్వండి

ఒకసారి మీకు పిల్లలు పుట్టారంటే, ఇది ఇరవైయ్యేళ్ళ ప్రాజెక్టు - వారు బాగా స్థిరపడితే., లేదంటే అది జీవిత కాల ప్రాజెక్టు. ఒకవేళ మీరు దానికి సంసిద్ధంగా లేకపోతే మీరు అందులోకి ప్రవేశించవద్దు. దురదృష్టమేమిటంటే చాలా జంటలు వారి వివాహాన్ని కాపాడుకునేందుకు పిల్లలను కనాలనుకోవడం. పిల్లలు అంటే వ్యక్తిగత ప్రాజెక్టు కాదు. మనం తరువాత తరాన్ని సృష్టిస్తున్నాం. ముందు తరం కనీసం ఒక అంచె అయినా ముందుండాలని. మనం ఆ విధంగా ప్రేరేపించబడి పని చేయలేకపోతే పిల్లల్ని కనగూడదు. ముందు తరం మనలాగే ఉంటే ఉపయోగం ఏముంది, ఏవిధంగాను మెరుగ్గా లేకుండా.

అన్నింటికీ మించి, మానవ జాతి అంతరించిపోయే స్థితి లో ఏమీలేదు - కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రత్యుత్పత్తి చేయవలసిన అవసరం లేదు. మనమంతా జనాభా పెంచటంలో కీటకాల సంఖ్యతో పోటీపడుతున్నట్లుగా ఉంది. మనం అన్ని విధాలా కొంచెం నెమ్మదించాల్సిన సమయం వచ్చింది.

ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వారు పిల్లల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇదంతా మన ముందు తరాన్ని మనకన్నా ఉత్తములను చేయడం కోసమే. ఇంకా ముఖ్యంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడమే. పిల్లలు మీ . పట్ల ఆసక్తి చూపేలాగా, ఇంకా మీతో గడపడానికి ఇష్టపడే విధంగా మీరు ఉండాలి. అప్పుడు సమయాన్ని కూడా సర్దుబాటు చేసుకోగలరు. వారు మీ వైపు చూసేందుకు ఇష్టపడుతున్నారు అంటే వారితో గడిపే అయిదు నిమిషాలైనా అయిదు రోజులతో సమానం.

పిల్లలు కావాలనుకోవడం మీ ప్రమేయంతో కూడుకున్న భాద్యత. ఒకవేళ మీరు సరైన అవగాహన లేకుండానే పిల్లలను కనే పొరపాటు చేసారంటే, ఆ పిల్లవాడిని ఎవరైనా ప్రేమగా, వాత్సల్యంతో మరియు ఆనందంగా చూసుకోగల వారికి అప్పగించండి, ఎవరైతే వారి జీవితం అర్పించగలరో వారికి. మీరు ఆర్థికంగా మద్దతు ఇవ్వండి. వారు పిల్లవానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాకపోవచ్చు - కానీ పిల్లలు పట్టించుకోరు. ఎవరైతే వారిని చాలా ప్రేమిస్తారో, ఆనందంగా ఉంటారో పిల్లలు వారి చుట్టే తిరుగుతారు.

5. అనుకూలమైన, అద్భుతమైన ప్రపంచాన్ని శోధించండి

ఈ రోజుల్లో మూడేళ్ల పిల్లలు టీవీకో, స్మార్ట్ ఫోన్ కో అతుక్కు పోకపోవడమంటే అసాధారణం. ఆ పరికరాలలో చూపించే వాటిని వారు ఎలా అర్ధం చేసుకొంటున్నారు దాని నుంచి ఏం తీసుకుంటున్నారనేది మనకు తెలియదు, ఎందుకంటే ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు గనుక. ఒక్క క్షణం అందమైన ప్రపంచం సృష్టించడం గురించి మాట్లాడతారు, మరు క్షణం విధ్వంసం జరుగుతుంటుంది, మరుక్షణం మరేదో.

ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు దేనిపై అవగాహన ఇవ్వాలో ఆలోచించుకోవాలి. వారు . ఏ అనుభవాలను ఎదుర్కొంటున్నారో, ఏ అనుభూతులకు లోనవుతున్నారో , అదే వారితో జీవిత కాలం అంటిపెట్టుకుని ఉంటుంది. నైతిక భోదన కాదు, జీవితంలో . . ., సకారాత్మక మూ, అద్భుతమూ . అయిన విషయాల ను వారి అనుభవంలోకి తీసుకు రండి. సరైన విషయాలు అంటే తప్పు ఒప్పు కాదు. జీవితం యధాతధంగా.

ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ, నేననుకోవడం, ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వారు కనీసం నంవత్సరానికి రెండు నెలలైనా వారి పిల్లలతో ప్రాకృతిక ప్రదేశాల్లో ప్రత్యేకంగా గడిపేందుకు సంసిద్దులు కావాలి. చెట్టు తొర్రల్లాంటి పట్టణపు బొరియలలో లేదా అపార్ట్మెంట్ పక్షిగూళ్ళల్లో కాకుండా ప్రకృతికి దగ్గరగా ఉండేలాగా, మీకు ఒకవేళ ఎక్కడైనా గుడారాలలో ఉండాల్సి వచ్చినా సరే . పిల్లలు ప్రకృతితో ఉండాలి, మీకు వారు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా, సమతౌల్యం కలవారుగా ఎదగాలనుకుంటే, , ఇది చాలా ముఖ్యమైన విషయం.

6. భావోద్వేగ భద్రతను కల్పించండి.

ఈ రోజుల్లో మానసిక సమతౌల్యం చెడిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు గత రెండు శతాబ్దాలలో చాలా మేరకు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన జనాభాలో, 38% మందికి మానసిక సమస్యలున్నాయి. వారిని ఎవరూ పట్టించుకోని వాతావరణం లో వారు పెరగడం దీనికి ముఖ్యమైన కారణం. వారికి వారి తల్లిదండ్రుల విషయంలో కూడా మానసికంగా ఒక అభద్రత వుండేది. వారి తల్లి కానీ తండ్రి కానీ ఏ సమయంలో వదిలేసి వెళ్ళిపోతారో తెలిసేది కాదు. ఇక పెద్దవారై , ఒక వయస్సు వచ్చిన తరువాత , ఇప్పుడు వారికి వారి జీవిత భాగస్వాముల గురించిన అభద్రత. ఆ స్త్రీ లేదా పురుషుడు ఏ నిమిషమైనా వదిలేసి వెళ్ళవచ్చు, ఎప్పుడైతే భావోద్వేగ భద్రత ఉండదో అప్పుడు మనిషి మానసిక సంతులనం/సమతౌల్యం కోల్పోతారు. ఒక తరం ఉత్పాదకంగా ఉండాలంటే, వారు చైతన్యవంతులై ఉండాలి లేదా భావోద్వేగ భద్రత ఉండాలి - లేదంటే వారు పిచ్చి వారైపోతారు. మనం ఇలాంటివన్నీ నాశనం చేసాం, ఇప్పుడు మనం ఎందుకు సరిగ్గా బ్రతుకలేకపోతున్నాము , మన పిల్లలు ఎందుకు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, పిల్లలెందుకు వారిని వారు లేదా ఇంకొకరిని ఎందుకు కాల్చి పారేస్తున్నారు, అని ఆశ్చర్యపడుతున్నాం. ఇదంతా ఎందుకంటే చిన్నతనం నుంచే వారికి భావోద్వేగ భద్రత లేకపోవడం వల్ల.

నా ఉద్దేశంలో, చాలా మందికి, వారి వ్యక్తిత్వం/అస్తిత్వంలో 80% భావోద్వేగాలు నిండి ఉంటాయి/భాగంగా ఉంటాయి . మీ ఫై గొప్ప ప్రభావం చూపగల అంతటి శక్తివంతమైన మీ భావోద్వేగాలను మీరు అదుపులోకి తెచ్చుకొని, , వాటిని మీ జీవితానికి అనుకూలమైన శక్తి గా మార్చుకోకపోతే, అవి మీకు ఊపిరాడనివ్వవు. మిమ్మల్ని నాశనం చేస్తాయి. నేడు భావోద్వేగం పొందడం అంటే నకారాత్మక భావావేశంగా పరిగణిస్తున్నారు.. ఎవరైనా బాగా భావోద్వేగానికి గురయ్యారంటే అతను కాస్త పిచ్చిగా ప్రవర్తించాడని అర్ధం. మనం ప్రపంచంలో ఈ భావనను మార్చాలి. సంతోషం, ఆనందం, ప్రేమ, భక్తి మరియు పారవశ్యం ఇవి కూడా భావోద్వేగాలే అని మనమెందుకు గుర్తించటంలేదు ?

భావోద్వేగ భద్రత ఖచ్చితంగా ముఖ్యమైనది, ఎందుకంటే ఇప్పటికీ చాలామందికి భావోద్వేగాలు వారి జీవితంలో అన్నిటికంటే పెద్ద కొలమానం . ఒకరు నిజంగా చైతన్యవంతులైతే ఇక భావోద్వేగాలకు ప్రాముఖ్యత ఉండదు . కానీ అంత వరకూ , భావోద్వేగాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి , మనం మన పిల్లలను బాగా పెంచాలనుకుంటే, వారి చుట్టూ అన్ని వేళల్లో ప్రేమతో కూడిన వాతావరణం ఉండాలి - కేవలం ఇంట్లోనే కాదు, బడిలో ఇంకా వీధిలో కూడా.

ప్రేమాశీస్సులతో,

సద్గురు