సద్గురు: ఒకరు మార్మికులు కావడానికి మరొకరు కాక పోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం, శ్రధ్ధ లేకపోవడమే. ఒకరు కళాకారులు, మరొకరు కాదు, ఎందుకని? శ్రధ్ధ పెట్టకపోవడమే. ఒకరు సరిగ్గా గురిపెట్టగలరు, మరొకరు పెట్టలేరు. ఎందుకని? శ్రధ్ధ పెట్టకపోవడమే. చిన్న వాటి నుంచి పెద్ద వాటిదాకా (అన్నింటి మీదా) శ్రద్ధ చూపకపోవడమే.

మీ శ్రద్ధ ఇప్పుడు ఏ స్ధాయిలో వున్నా, దానితో అన్నీ సాధ్యం కావు. మీకు ఇప్పుడు ఏ స్థాయిలో శ్రద్ధ వున్నా, అదంతా వినియోగించుకోలేరు. చాలా ఉంది కాని అదంతా నిద్రావస్థలో ఉంది, అదింకా వ్యక్తం కాలేదు, దానిని మీరు అందుకోలేరు. అందుకే కనీసం మీకున్నదానితోనైనా మీరు శ్రద్ధ చూపాలి. మీ మానసిక శ్రద్ధ కూడా మీ జీవితంలో ఒక్కో సమయంలో అది ఒక్కో స్థాయిలో ఉంది. ఒక్కో రోజు ఒక్కో స్థాయిలో ఉంటుంది. మీరు ఒక పని చేస్తుంటే మీరు ఒక స్థాయి సావధానత(శ్రద్ధ)తో ఉంటారు. మీరు ధ్యానం చేస్తుంటే మరోరకమైన శ్రద్ధతో ఉంటారు. మీకు ఇష్టమైన ఆహారం తీసుకుంటుంటే, మీరు మరో స్థాయి శ్రద్ధతో ఉంటారు. మీ శ్రద్ధ స్థాయి ఒక్కో సమయంలో ఒక్కో విధంగా ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడైనా మీకు వచ్చిన అతి ఉన్నతమైన శ్రద్ధలో కూడా, అది పూర్తిగా ప్రకటితం కాలేదు. మీకు మరింత శ్రద్ధ చూపగల సామర్ధ్యం ఉంది.

మీరు ఎక్కువ ధ్యాసతో ఉంటే దానిని మీరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవచ్చు.

కొన్నేళ్ళ క్రితం నేను కొంత మందిని కర్ణాటకలోని సుబ్రహ్మణ్య, మంగుళూరు స్టేషన్ల మధ్య రైలు పట్టాల మీద నడిపించాను. ఆ భాగంలో మూడువందలకు పైగా వంతెనలు, వందకు పైగా సొరంగాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎప్పుడు చూసినా చాలవరకు ఒక వంతెన మీదో, సొరంగంలోనో ఉంటారు, అది అద్భుతమైన కొండ మార్గం. కొన్ని సొరంగాలు కి.మీ కన్నా ఎక్కువ పొడవుంటాయి. పగటి పూటకూడా గాడాంధకారంతో ఉంటాయి. మీరు మీ చేతిని కూడా చూడలేరు. బహుశా చాల మంది అటువంటి చోటుకు ఎప్పుడూ పోయి ఉండరు. ఎందువల్లనంటే ఎక్కడకు వెళ్ళినా ఏదో కొంత వెలుతురు ఉంటుంది. నక్షత్రకాంతి ఐనా కొంత వెలుతురునిస్తుంది. కాని ఈ సొరంగాలలో కొంతసేపటికి ఆ చీకట్లో మీ కళ్లు తెరచి ఉన్నాయో లేదో కూడా తెలియదు.

నేను వాళ్ళను ఆ సొరంగాలలో ఏ విధమైనా టార్చిలైటూ లేకుండా నడిపించాను. మొదట్లో వారు కాస్త భయపడ్డారు, కాని కాసేపటికి వాళ్లు మెల్లగా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ నడవడం మొదలెట్టారు. మీరటువంటి చోట ఉంటే మీ ధ్యాస ఎంతో ఉచ్చస్థితిలో ఉంటుంది. ఇటువంటి సావధానత మీరు మీ జీవితంలో ప్రతిక్షణం నిలుపుకోగలిగితే మీరు నిజంగా మెరుస్తారు.

ఆధ్యాత్మికత గురించీ మీకు తెలిసిందే శ్రద్ధ చూపడం వల్ల

ఆశ్రమంలో నేను అందరినీ చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తుండమని ఎప్పుడూ చెబుతుంటాను. ఇది శుభ్రంగా ఉండడమో,ఆ చోటును బాగా ఉంచుకోవడమో గురించి కాదు, ప్రతి దాని పట్లా పూర్తి శ్రద్ధపెట్టడం. ఒక చిన్న గులకరాయి తిరగబడితే మీరు గమనించ గలగాలి. అది గులకరాయి గురించి కాదు, మీరు శ్రద్ధగా ఉన్నారా, లేదా అని. ఈ శ్రద్ధను మీరు అత్యున్నత స్ధాయికి తీసుకువెళితే, మీ సావధానత అత్యున్నత స్థితికి చేరితే, అప్పుడు మీలోని ఏ విషయాల పట్ల మీరు శ్రద్ధ చూపాలో,వేటి పట్ల  శ్రద్ధ చూపనక్కరలేదో తెలుపుతాం.

మీరు ఎక్కువ ధ్యాసతో ఉంటే దానిని మీరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మికత మీకు ఎలా వస్తుందంటే మీరు మీ జీవితంపట్ల ఎంతో సావధానతతో ఉన్నారని, అది ఎక్కడ మొదలయిందో, ఎక్కడ అంతమౌతుందో మీకు  తెలియదని మీరు గ్రహించారు. మీరు వాస్తవానికి ‘మీరు చేసేదే అంతా’ అన్న భావనతో ఉన్నారు. మీరు ఒకసారి శ్రద్ధ పెడితే మీకు అది కాదని అర్థమౌతుంది.

అంటే మీరు ఆధ్యాత్మికతలోని మొదటి అడుగే మీరు ఒక స్థాయిలో శ్రద్ధ చూపడం వల్లనే వచ్చింది. మీరు అన్నింటికీ అదే శ్రద్ధ చూపితే, మీరు సావధానంగా ఉండే స్ధాయిని పెంచితే అది ఎన్నో అద్భుతమైన రీతుల్లో ఉపయోగించుకోవచ్చు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు