సద్గురు దుష్టత్వం అనేది ఒక స్వభావమూ కాదు లేదా ఒక చర్య కూడా కాదు, ఇది అజ్ఞానం యొక్క పర్యవసానం. దీనిని ఎన్నో విధాలుగా వ్యక్తపరిచారు. "వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియడం లేదు" అన్నమాటను మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ దుష్టత్వం ఉంటుంది . దానిని ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా, ఇది సహజంగానే ఇలా జరుగుతుంది.

ఎంతో ఘోరమైన విషయాలు జరుగుతున్నది ఒకరి దుష్టత్వం వల్ల కాదు, అలా జరుగుతున్నది వారి అజ్ఞానం వల్ల. ఒక మానవుడు చేస్తున్న ఒక ఘోరమైన పనిని మనం దుర్మార్గంగా గుర్తిస్తాము లేదా అన్నది ఎంతమంది ఆ పని చేస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీరు కనుక మొత్తం ఉారినంత ఆ దుర్మార్గపు చర్య లో పాలు పంచుకునేలా చేయగలిగితే అది సరైన పని గానే చెలామణి అవుతుంది. గతంలో ప్రజలు, అవి సరైన పనులు గా తలచి చేసిన పనులను ఈనాడు మనం చేయదలచుకోవడం లేదు, ఎందుకంటే అవి ఎంతో ఘోరమైన పనులు. గతంలో ఎంతో మంచి వారు చేసిన పనులను, ఈనాడు పరమ దుర్మార్గులు కూడా చేయడం లేదు. అయినప్పటికీ పరిస్థితులు ఈనాడు కూడా ఏమాత్రం మారలేదు 

దుష్టత్వం అనేది ఎప్పటికీ విడిచి పోయేది కాదు. అది విడిచి పోవడానికి అది ఒక స్వభావము లేదా చేసే ఒక పని కాదు , అది జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతోంది. ఏదైనా ఉంటే దానిని మనం వినాశనం చేయవచ్చు కానీ లేని దానిని ఎలా పారద్రోలడం - మీరు అంధకారాన్ని వినాశనం చేయలేరు, మీరు కేవలం వెలుగుని తీసుకురావాలి. అదేవిధంగా మీరు దుష్టత్వాన్ని వినాశనం చేయలేరు, మీరు జ్ఞానాన్ని, ఎరుకను తీసుకురావాలి. దుష్టత్వం రంగు రూపు లను దిశను మారుస్తుంది, కానీ అదృష్టవశాత్తు అజ్ఞానానికి ఒకటే రూపం. అందుకే దానిని నిర్మూలించడం తేలిక. అజ్ఞానాన్ని అంతం చేయాలంటే మనకు సృష్టి గురించి తెలియాలి.సృష్టి గురించి తెలుసుకోవాలంటే, మొదట మీ మనస్సు, మీ శరీరం అనేవి ఈ ప్రపంచం ఇంకా అందులోని ప్రజలు ఉత్పత్తి చేసినవే అని అర్థం చేసుకోవాలి. మీ సహజమైన స్వభావం మీ అనుభవం లో ఎందుకు లేదంటే అది మీ మనసుకు మరోవైపున ఉంది. ఒక విధంగా చూస్తే, మీ మనస్సు ఒక అద్దం లాంటిది. అందులో అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా కనపడక పోతున్నప్పటికీ అది అద్దం లాంటిదే. ప్రపంచం మీ మనసులో ప్రతిబింబస్తోంది కాబట్టే మీరు ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. కానీ మనస్సు ఎప్పటికీ తనను తాను ప్రతిబింబించ లేదు. నేను భౌతికమైన దాని గురించి లేదా మీ మానసికమైన దాని గురించి మాట్లాడడం లేదు. మీ ఆలోచనలను,భావాలను మీరు తర్కించగలరు. కానీ మీ సహజత్వాన్ని గురించి మీరు తర్కించలేరు. మీ అస్తిత్వాన్ని మీరు తర్కించలేరు, దానిని కేవలం అనుభూతి చెందగలరు. మీ మనసు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రతిబింబిస్తోంది కానీ మిమ్మల్ని ఒక జీవంలా అది అనుభూతి చెందలేదు. 

ఈ అద్దం యొక్క స్వభావం మీరు తెలుసుకోగలిగితే, మీరు అది ప్రతిబింబిస్తున్న చిత్రాల స్వభావం కూడా తెలుసుకోగలుగుతారు. అజ్ఞానం ఒకే తరహాలో ఉంటుంది - మీకు ఆ అద్దం గురించి ఏమీ తెలియకపోవడమే అజ్ఞానం. ఈ ఒక్క విషయాన్ని మీరు స్థిమితపరచుకోగలిగితే, మీరు ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని విషయాలను గురించి తెలుసుకోవాల్సిన పనిలేదు. మీరు ఇదేమిటో తెలుసుకోగలిగితే, అది అజ్ఞానానికి ఇంకా దుష్టత్వాన్ని కి కూడా అంతం అవుతుంది.

Signature:

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor’s Note: Curious to know if there is such a thing as “necessary evil”? Click here to read Sadhguru’s take.