స్త్రీ స్వరూపిణి అయిన దేవి అనంతమైన తేజస్సుకు అభివ్యక్తీకరణ. ఈ నవరాత్రి పర్వదినాలలో మీరు ఈ మహోన్నత వైభవాన్ని తెలుసుకోవాలని నా ఆకాంక్ష.

Navratri-2020-Devi-Quotes-1

జీవితం అనుభవించవలసిన అద్భుతమేకాని, అర్థం చేసుకోవలసినది కాదు. నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రాధమిక అంతర్దృష్టి మీదే ఆధారపడి ఉన్నాయి.

Navratri-2020-Devi-Quotes-2

నవరాత్రిని బాగా అనుభూతి చెందేందుకు ఉత్తమమైన మార్గం, దాన్ని ఓ వేడుకలా జరుపుకోవడమే. తీవ్రంగా తీసుకోకపోవడం, అయినా పూర్తిగా నిమగ్నమవ్వడమే జీవిత రహస్యం.

Navratri-2020-Devi-Quotes-3

దేవి అంటే ఒక హర్షాతిరేకం - పిచ్చిగానీ, నిర్భంధతగానీ కాని ఒక శుద్ధ పరమానందం.

Navratri-2020-Devi-Quotes-4

దేవీ ఆరాధనతో మీకు జీవితంలోని మాధుర్యం అవగతమౌతుంది.

Navratri-2020-Devi-Quotes-5

స్త్రీత్వం జీవితంలోని అతి శక్తివంతమైన పార్శ్వం. స్త్రీత్వం లేదా "శక్తి" లేకుండా, అస్తిత్వంలో అసలేదీ ఉండదు.

Navratri-2020-Devi-Quotes-6

దేవి అనుగ్రహానికి పాత్రులైనవారు ధన్యులు. మీరు మీ ఊహకీ, శక్తి సామర్ధ్యాలకూ మించిన జీవితాన్ని జీవిస్తారు.

Navratri-2020-Devi-Quotes-7

మీకంటే దేవి మీకు ముఖ్యమైనప్పుడు మీరు అనుగ్రహ పాత్రులుగా ఉంటారు.

Navratri-2020-Devi-Quotes-8

భక్తితో మీ హృదయం కరిగినప్పుడు, దేవి మీకు అర్థం కాని ఎన్నో వేల రూపాల్లో మీకు తోడ్పడుతుంది.

Navratri-2020-Devi-Quotes-9

మిమ్మల్ని మీరు శూన్యంగా మార్చుకున్నాక, మీతో ఉండడం తప్ప దేవికి మరో మార్గం ఉండదు. ఇక దేవి మీతో ఉంటే, నాకు కూడా మరో ఎంపిక ఏమీ ఉండదు.

Navratri-2020-Devi-Quotes-10

లింగభైరవితో కొన్ని రోజుల సాంగత్యంలోనే, ఆమె శక్తి మిమ్మల్ని అనుభవపూర్వకంగా ఇంకా భౌతికంగా కూడా ఉన్నతస్థాయికి తీసుకువెళుతుంది.

Navratri-2020-Devi-Quotes-11

లింగ భైరవి దేవికి అనాహతంలో కేవలం సగ భాగం మాత్రమే ఉంది. ఆమెకు ప్రేమించే సమర్థత లేదు కానీ , అపారమైన కరుణ ఇంకా శక్తి కురిపించగల తల్లి.

Navratri-2020-Devi-Quotes-12

మీ భౌతిక సామర్ధ్యాలకి మించి మీరు కార్యాలని నిర్వహించే సాధికారతను మీకు లింగ భైరవి దేవి కల్పిస్తుంది. భౌతిక శరీర పరిమితులకు కట్టుబడని సానుకూలత ఆమె సొంతం.

Navratri-2020-Devi-Quotes-13

లింగ భైరవి దేవి రౌద్రిణి, అదే సమయంలో దయాసాగరి కూడా.

Navratri-2020-Devi-Quotes-14

లింగ భైరవి దేవి పవిత్రమైన, ఎల్లలులేని జీవం - ఉన్నత స్థాయిలో ఉన్న జీవమది.

Navratri-2020-Devi-Quotes-15

లింగ భైరవి స్త్రీ తత్వానికి ప్రతీక. ఆమెని మీరు లాలించాలి. ఒక సమర్పణా భావంతో ఆమెను సమీపించాలి .

Navratri-2020-Devi-Quotes-16

లింగ భైరవి దేవి సాన్నిధ్యంలో కూర్చుంటే చాలు, ఆమె శక్తి తీక్షణత మీలో విస్పోటనం కలిగిస్తుంది

Navratri-2020-Devi-Quotes-17

లింగ భైరవి దేవి ఓ నిప్పు - స్త్రీలు ఎలా అయితే ఉండాలో అలా. నిప్పు అంటే గొడవలు పడటం, కోపం, అసూయ కాదు - సృష్టిలో ఉన్న అగ్ని.

Navratri-2020-Devi-Quotes-18

ఈ ప్రపంచంలో స్త్రీ తత్త్వం నశిస్తే, సౌందర్యపూరితమైనవి, సున్నితమైనవి, నిజమైన రసానుభూతిని కలిగించేవి ఏవీ మిగలవు.

Navratri-2020-Devi-Quotes-19

లింగ భైరవి దేవి మిమ్మల్ని లోకిక విషయాలను చాలా తొందరగా, సంపూర్ణంగా అనుభవించేలా చేస్తుంది, తద్వారా ఇంకా ఉన్నతమైనదాని వైపు మీరు సహజంగానే దృష్టి మళ్లిస్తారు.

Navratri-2020-Devi-Quotes-20

భక్తి అనేది మీరు కరిగి పోయేందుకు ఒక సాధనం. ఉన్నత తీక్షణతతో నిండిన శక్తిస్వరూపిణి లింగ భైరవి దేవి మిమ్మల్ని ఆ పరమానందభరితమైన స్వేచ్ఛ దిశగా నడిపిస్తుంది.

Navratri-2020-Devi-Quotes-21

పురుషతత్వం, స్త్రీతత్వం మన జీవితాలలో సమానమైన పాత్రలు పోషించినప్పుడే మన అస్తిత్వానికి ఒక అందం ఇంకా ప్రయోజనం ఉంటుంది. అటువంటప్పుడు భైరవి దేవి లేకుండా మన ఉనికి సాధ్యమేనా?

Navratri-2020-Devi-Quotes-22

లింగ భైరవి దైవత్వంలోని స్త్రీ తత్వానికి వ్యక్తీకరణ , కానీ లింగాకారంలో ఉంటుంది. లింగాకారం, సృష్టిలో పురుషత్వం మరియు స్త్రీత్వం రెండూ కలిగి ఉన్న అతి మౌలికమైన ఆకృతి .

Navratri-2020-Devi-Quotes-23

లింగ భైరవి దేవి అనుగ్రహానికి పాత్రులైన వారికి, ఇక జీవితం లేదా మరణం గురించి గానీ, పేదరికం గురించి గానీ లేదా వైఫల్యాల గురించి గానీ చింతిస్తూ లేదా భయపడుతూ బ్రతకవలసిన అవసరం లేదు. ఆమె అనుగ్రహం కలిగితే చాలు, మానవులు వేటిని అయితే శ్రేయస్సు కారకములని భావిస్తారో అవన్నీ వారి సొంతం అవుతాయి.

Navratri-2020-Devi-Quotes-24

దేవి ఉద్దేశ్యం మీకు అదో, ఇదో ఇవ్వడం కాదు. మీకు సంతృప్తి కలిగించడంద్వారా లింగభైరవి మీ ముక్తికి దోహదపడుతుంది.

Navratri-2020-Devi-Quotes-25

India is a land of many goddesses – wonderful ones, wise ones and wild ones. Find out how worship of the feminine still lives in the world in some unlikely places, and what it takes to walk with goddesses like Bhairavi, Kali & Chinnamasta. Only on Sadhguru Exclusive! Watch now. 

BlogBanner-Devi-V3