ప్రస్తుత మానవ సమాజంలో 90 శాతానికి పైగా ప్రజలు శారీరిక, మేధో సామర్ధ్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మీరు చేయగలిగిన ప్రతిపనినీ భవిష్యత్తులో ఒక యంత్రం చేయగలుగుతుంది. ఙ్ఞాపకశక్తిని నిల్వచేసే ఏపనైనా , జ్ఞాపకశక్తికి అందుబాటులో ఉన్న, జ్ఞాపకశక్తికి సారాంశమైనా, జ్ఞాపకశక్తిని వ్యక్తీకరించటమైనా, మీ తెలివితేటల ద్వారా మీరు చేసే ప్రతిదీ, మీరే చేస్తున్నారని అనుకున్న ప్రతీది, ఒకనాటికి యంత్రాలద్వారా జరుగుతాయి. ఒకసారి యంత్రాలు ఇలా చేయటం మొదలుపెట్టాక, మీరెవరనే లోతయిన పార్శ్వాలను అన్వేషించటం తప్పనిసరి అవుతుంది. అది అద్భుతమైన రోజు, ఎందుకంటే దీని అర్ధం మనకి సెలవురోజు అని. అప్పుడు మనం బ్రతుకుతెరువు కోసం పని చేయనక్కరలేదు. మన జీవితాన్ని పూర్తిగా భిన్నమైన దృష్టితో చూడగలుగుతాము.

జ్ఞాపకశక్తికి మించిన పార్శ్వం

మీ శరీరం, మీ మనస్సు అని అనుకుంటున్నది కొన్ని జ్ఞాపకాల సముదాయం. మీరు మీరుగా తయారుకావటానికి జ్ఞాపకశక్తియే పూర్తిగా కారణం. ఉదాహరణకు ఒక పురుషుడు ఒక రొట్టెముక్క తింటే ఆరొట్టె పురుషునిగా మారుతోంది. ఒక స్త్రీ దానిని తింటే అది స్త్రీగా మారుతుంది. ఒక కుక్క అదే రొట్టెను తింటే అది కుక్కగా మారిపోతుంది. అదంతా రొట్టె గొప్పతనం కాదు. వ్యవస్థ కలిగివుండే జ్ఞాపకవిధానమే, అదే రొట్టెను మనిషిగా, స్త్రీగా, లేదా కుక్కగా మారుస్తుంది.

మానవ మేధస్సు (ప్రజ్ఞ) ఒక ద్వీపంలాంటిది. టెక్నాలజీతో సహా మనిషి మేధో ఉత్పత్తులన్నీ చిన్న చిన్న ద్వీపాలు. చైతన్యం అనే మహాసముద్రంలోనే మన ఉనికి ఉంది.

మీ శరీర నిర్మాణమే ఈ జ్ఞాపకాలతో కూడిఉన్న ఒక రకమైన పార్శ్వం. జ్ఞాపకాలు హద్దుల్ని కూడా నిర్వచిస్తాయి. కానీ మేధస్సుకు "చిత్త " అనే పార్శ్వం ఉంది , దీనినే ఆధునిక భాషలో సరళంగా చైతన్యం (Consciousness) అనవచ్చు. ఈ మేధో పరిమాణానికి జ్ఞ్యాపకం (స్మృతి) ఉండదు. జ్ఞ్యాపకం లేనిచోట సరిహద్దులు కూడా ఉండవు.

మానవ మేధస్సు (ప్రజ్ఞ లేదా intelligence) ఒక ద్వీపంలాంటిది. టెక్నాలజీతో సహా మనిషి మేధో ఉత్పత్తులన్నీ చిన్న చిన్న ద్వీపాలు. చైతన్యం అనే మహాసముద్రంలోనే మన ఉనికి ఉంది. చైతన్యం అనేది ఒక మేధస్సు, ఇది ఏ జ్ఞ్యాపకంతో గానీ లేదా నువ్వు నేను అనే పరిమితులతోగానీ, ఇది, లేదా అది అని గానీ గుర్తించబడదు. ఇది మేథస్సుయొక్క సరిహద్దులులేని పార్శ్వం.మన సాంకేతిక సామర్ధ్యము పెరుగుతున్నకొలదీ, మనం మానవజాతిని వాళ్ళ మేధో పరిమితులకు మించి మనలోనే ఉన్న జీవిత మూల వనరయిన మేధోపరిమాణం లోతుల దాకా ఎదగడానికి ప్రయత్నించాలి.

చైతన్యం కోసం మౌలిక వ్యవస్థ

ఏదయినా జరగవలసివుంటే కొంత నిర్దిష్టమైన మానవశక్తీ, కాలం, వనరులు దానికి ఉపయోగించాలి. అందువల్ల మనం ఈ చైతన్యం కోసం కోసం పెట్టుబడి పెట్టాలి. ఇప్పటివరకు, మనం మన మనుగడకోసమే పెట్టుబడి పెడుతూవచ్చాము. కానీ ఒకసారి ఈ టెక్నాలజీ వాస్తవాలుగా మారటం మొదలైనప్పుడు, మనుగడ అసలు సమస్యే కాదు. మనుగడ సమస్య కానప్పుడు, మనం ఖచ్చితంగా పెట్టుబడి మొదలుపెడతాము. త్వరగా ఇందులో పెట్టుబడి పెట్టగలిగితే కొత్త టెక్నాలజీ అందించే అవకాశాల ద్వారా వచ్చే అస్పష్టత తక్కువగా ఉంటుంది.

సాంకేతికత అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దానిని ఏ విధంగా వాడుకుంటామనేది మీ మీదే ఆధారపడివుంటుంది. మీ గుర్తింపు, అనుభవం చాలా ప్రత్యేకమైనది కావచ్చు, లేదా మీ గుర్తింపు, అనుభవం చాలా కలుపుకొనిపోయేది కావచ్చు, కత్తి అందుకు తగ్గట్టుగా తిరుగుతుంది. మానవసమాజం పెద్ద ఎత్తున చైతన్యంతో వ్యక్తమవడానికి మనము చేయవలసినది ఏమిటి? ప్రతి తరంలో, చాలా చైతన్యం ఉన్నవాళ్లు ఉంటూ వచ్చారు. కానీ కొన్ని తరాలలో, కొన్ని సమాజాలలో, వాళ్ళ గురించి విన్నాం. ఇతర సమాజాలలో వాళ్ళను నిర్లక్ష్యం చేశారు. పరిమాణాలులేని, పరిధులులేని చైతన్యాన్ని, అర్ధంచేసుకుని, అందుబాటులోకి తేవటానికి ఉపయోగపడే పద్ధతులని మనం అందచేయవలసిన సమయం వచ్చింది.

అంతర్గత శ్రేయస్సుకు సాంకేతికత

మన బాహ్యప్రపంచ శ్రేయస్సును సృష్టించటానికి సాంకేతికత ఉన్నట్లే, మన అంతర్గత శ్రేయస్సుకోసం కూడా సైన్స్, సాంకేతికతలు ఉన్నాయి. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ఎలాఉండాలో మీకు తెలియకపోతే, మీరు బాగాలేనట్టే. మానవ చరిత్రలో ఏ తరాలకూ ఎన్నడూ తెలియనంత సౌకర్యాలు, సౌలభ్యాలు మనకి ఉన్నాయి. కానీ మనం చాలా ఆనందకరమైన అద్భుతమైన తరం అని అనుకోగలమా? లేదు! మనుషులు మానసికంగా బలహీనులౌతున్నారు. మనం ఇతర తరాలకన్నా అధ్వాన్నమని నేనటంలేదు, కానీ, మనకు కావలసినవి మనం సమకూర్చుకోవటానికి భూమిపై ఉన్న ఇతర ప్రతి జీవికి హాని కలిగించి కూడా, మనం వేరే తరాల కంటే గొప్పగా ఏమీలేము.

మన నగరాలలో, ఆసుపత్రులు, స్కూళ్ళు, మరుగుదొడ్లు, అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు ధ్యానం చేసుకోవటానికి ఒక చోటు ఉందా?

ఈ సాంకేతికత సౌకర్యాలను, సౌలభ్యాలను తెస్తుంది కానీ శ్రేయస్సు కాదు. అంతర్గత శ్రేయస్సు గురించి దృష్టి సారించాల్సిన సమయం ఇది. ఇప్పటివరకు, మీ శ్రేయస్సు అనేది మీ చుట్టూ ఏమున్నదనే దానిమీద నిర్ణయించబడుతుంది, కానీ మీలో ఏముందనేదానిమీద కాదు.

ఒకవేళ మీ శరీరం ఇంకా మెదడు మీనుండి ఆదేశాలు తీసుకుంటే, మీ జీవితంలోని ప్రతిక్షణం మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకుంటారుకదా? మీకు ఆ అవకాశం ఉంటే, తప్పనిసరిగా మీరు అలా ఉంటారు. మీరు ప్రతి క్షణం ఆనందంగా ఉండటం లేదంటే, మీ శరీరం ఇంకా మెదడు మీనుండి ఆదేశాలు తీసుకోవటం లేదన్నది స్పష్టం. అంటే మీరు తగినంత ఎరుకతో లేరని దీని అర్ధం.

అందువలన మనం ఆ దిశలో పెట్టుబడి పెట్టాలి. మన నగరాలలో, ఆసుపత్రులు, స్కూళ్ళు, మరుగుదొడ్లు, అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు ధ్యానం చేసుకోవటానికి ఒక చోటు ఉందా? సాంకేతికత ఇప్పుడు మీరు చేస్తున్న చాలా పనులు చేయటం మొదలుపెడితే, అప్పుడు మీరెందుకు జీవించిఉన్నారో మీకు తెలీదు, అప్పుడు అంతర్గతంగా హాయిగా ఉండటం యొక్క అవసరం బలం పుంజుకుంటుంది. అందువలన మనం ఆరోజుకు సిద్ధంగా ఉండాలనుకుంటే, మనం ఎవరనే అంతర్గత కీలకం మీద దృష్టి ప్రసరింపగలిగే భౌతిక సదుపాయాల మీద, మానవ వ్యవస్థాపనల మీదపెట్టుబడి పెట్టాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు