అభినవ్ బింద్రా: మన సమాజాన్ని క్రీడల్లో బాగా ఆడేలా ఎలా చెయ్యాలో..ఆ సత్యాన్ని తెలియజేయండి.యువత శారీరకంగా, సామాజికంగా, భావోద్వేగంగా ఎదగటానికి క్రీడలు ఎంతో సహాయం చేస్తాయి.దీనివల్ల ఆరోగ్యం ఇంకా టీం వర్క్  కూడా మెరుగౌతుంది.మన దేశ యువత క్రీడలు అంటే ఇష్టపడేలాగా,వాళ్ళని ఆ వైపుకు ఎలా నడపాలి? 

సద్గురు: నమస్కారం అభినవ్!. క్రీడల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, పూర్తిగా లీనమవ్వకుండా   మనం ఆడలేం.మన జీవిత సారమంతా మనo లీనమవ్వటం లోనే ఉంది .క్రీడలు ఆడాలంటే లీనం అవ్వాల్సిందే. మీరు శ్రద్ధ లేకుండా కాలేజీకి వెళ్ళచ్చు,  అలానే ఉద్యోగానికి వెళ్ళచ్చు, అలాగే లీనం కాకుండా పెళ్లి కూడా చేసుకోవచ్చు.కానీ లీనం అవ్వకుండా క్రీడలు ఆడలేరు. -ఎందుకంటే లీనం కాకపోతే క్రీడలు ఉండవు. మీరనుకున్నాటు ఏది చెయ్యలేకపోతారు.

Sadhguru playing cricket at Isha Yoga Center

 

మీరు ఒక బాల్ ని కొట్టినా లేదా ఒక బులెట్ షూట్ చేసినా..అందులో పూర్తిగా లీనమవ్వకపోతే  , అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళదు. సొసైటీలో కవర్ చేసుకునట్టు.. మీ చేతగానితనాన్ని ఎవరి మీదో తోసేద్దాం అనుకుంటే..క్రీడల్లో అలా కుదరదు. క్రీడల్లో క్లియర్ గా తెలిసిపోతుంది, మీరు చేసినవాటికి మీదే బాధ్యత అని. చెయ్యాల్సింది చెయ్యకపోతే అది పనిచేయదు.. ఇదే క్రీడల్లో ఉన్న గొప్పతనం.  

క్రీడలు మన జీవితంలోకి రావాలా..అంటే..? తప్పకుండా!.క్రీడలు మనదేశంలో భాగంగా ఎలా చెయ్యాలి...? అవును.., మేము గ్రామాల్లో దీని కోసం పని చేస్తున్నాం.గ్రామాల్లోకి స్పోర్ట్స్   రావాలంటే మీ లాంటి వాళ్ళ సహాయం కావాలి. క్రీడల నుంచి రిటైర్ అయిన సీనియర్ ఆటగాళ్ళు ఇందులో భాగమయ్యి..  స్పోర్ట్స్ ని గ్రామాలకి  తీసుకురావాలి, ఎందుకంటే ఇక్కడే డబ్భై శాతం జనాభా ఉండేది.మేము క్రీడలకు సంబంధించి వేలమంది పాల్గొనే గ్రామోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.ఇలాంటివి మన దేశమంతా జరగాలి.గ్రామీణ భారతాన్ని  క్రీడల్లో లీనం కాకపోతే మన దేశం క్రీడల్లో ముందుకు వెళ్ళలేము.

Editor's Note: Whether you're struggling with a controversial query, feeling puzzled about a taboo topic, or just burning with a question that no one else is willing to answer, now is your chance to ask! Ask Sadhguru your questions at UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image