ఆశ్రమంలోని పదకొండు రసలింగాలు ...!!
నమస్కారం సద్గురు. ఆశ్రమంలో వివిధ చోట్ల గుడులు ఏర్పాటు చేశారు. ఈ గుడుల ఉద్దేశం ఏమిటి, ఆ లింగాలు విభూతితో ఎందుకు కప్పి ఉన్నాయి?
మేము చాలా గుడులు పెట్టలేదు – పదకొండు మాత్రమే పెట్టాము. ఇది ఒక సంకేంతిక పరమైన అంశం. ఇది మీరు ఒక టెలీకాం కంపెనీతో నమోదు చేసుకోవటం లాంటింది. వారికీ ఒక బేస్ స్టేషన్ ఎక్కడో ఉంటుంది , కానీ ఈ ప్రసారణ పెంపొందిచటానికి అన్నీ చోట్లా టవర్లు ఉంటాయి. ఈ గుడులు అలా పని చేస్తాయి.
మేము ధ్యానలింగము, లింగ భైరవి గుళ్ళని యోగా సెంటర్ భూగోళ స్థానాన్ని బట్టి కట్టాము. అదృష్టవశాత్తూ, ఈ పర్వతం మనకు ఒక సహజమైన ప్రాకారంగా ఉంది. అదే ఒక కృపా వెల్లువ. మేము ధ్యానలింగము ప్రతిష్టకు మా జీవితాన్ని ధారపోసాము. ధ్యానలింగం నుండి వచ్చే ప్రసారం ఎంతో తీక్షణంగా ఉంటుంది. కానీ కొంత కాలం క్రితం ఒక అమెరికన్ మహిళ చెప్పినట్లు కొంత మంది దాన్ని కవేలం “పెద్ద నల్ల వేరుశెనగ గింజ’లా మాత్రమే అనుభూతి చెందగలుగుతున్నరు. మరి కొందరు మాటల్లో చెప్పలేనటువంటి పరమానంద స్థితులలోకి వెళ్తూ ఉంటారు.
ప్రసరణ మెరుగుపరచటం
మీ జీవితం మీకు అందించేవి మీ గ్రహనశీలత, సూక్ష్మగ్రాహక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనమంతా ఒకే ప్రపంచంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రతీ మనిషి ఈ జీవితాన్ని ఒకే విధంగా అనుభూతి చెందడు. ఒకరికి అన్నీ అద్భుతంగా కనిపించ వచ్చు , మరోకరికి అన్నీ భయంకరంగా అనిపించవచ్చు. ఈ మధ్యలో ఉండే వారు - అప్పుడప్పుడూ ఈ రెంటి మధ్యా ఊగే వారు కూడా తప్పకుండా ఉంటారు. ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది, కానీ రేపు మాత్రం విచారంగా ఉంటుంది. ఎల్లుండి మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. ఇది బయట ప్రపంచంలో మాత్రమే కాదు – యోగా సెంటర్లో కూడా ఇంతే. ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, మేము వీరికి మరింత మెరుగైన ప్రసరణ జరిగేటట్లుగా ఈ లింగాలను ఏర్పాటు చేశాము.
ఇక ప్రశ్నలోని రెండొవ భాగం – ఇవి విభూతితో ఎందుకు కప్పబడి ఉన్నాయి, ఈ ప్రకంపనను మీరు మీతో కొంచం తీసుకోవాలి అనేదే ఆలోచన. ఈ పవిత్రమైన భస్మం కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో తయ్యారు చేయబడింది. ఇది ఆ రసలింగాన్ని తాకుతూ ఉంది, దీన్ని మీరు పదకొండు చోట్ల నుంచి తీసుకోవచ్చు. కనుక మీరు ఎప్పుడూ ధ్యానలింగానికి కానీ సాధన హాలుకు కానీ వెళ్ళని వారిలో ఒకరైనా సరే మీరు కూడా ఈ అనుగ్రహం పందాలని ఈ గుడులను పెట్టాము.
ఈ పదకొండు గుడులు ఎంతో ప్రత్యేకమైన పరిస్థితిని సృష్టిస్తాయి. ముఖ్యంగా, చల్లగా ఉన్న రోజుల్లో లేక తెల్లవారుఘామున మీరు దీన్ని గమనించ వచ్చు. మీరు ఈ పదకొండు గుడులను తెల్లవారుఘామున ౩:40 నుంచి 6:00 లోపు దర్శించుకోవాలి – అవి తమదైన పద్ధత్తిలో ఉజ్వలంగా వెలుగుతూ ఉంటాయి.ఇవి ఆశ్రమ ఖగోళ ప్రకారం ముఖ్యమైన ప్రదేశాలలో పేట్టము.
మరొక అంశం ఏమిటంటే ఇది మీకు నమస్కరించటానికి /మోకరిల్లటానికి ఒక అవకాశాన్ని ఇస్తాయి. కేవలం పదకొండు సార్లు మాత్రమే చేయకండి – ఇది రోజుకు లక్షల సార్లు చేయాలి. మేఘం కదిలిన ప్రతీ సారి, గాలి వీచినప్పుడు, మరొక మనిషి వచ్చినప్పుడు, చెట్టు కదిలినప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడూ, వదిలేటప్పుడూ – నమస్కరించండి. జీవితంలోని ప్రతీ అంశానికి/పార్శ్వానికీ నమస్కరించండి ఎందుకంటే ఇవి అన్నీ మీ కంటే తెలివైనవే.ఒక విషయం ఏమిటంటే మనం నమస్కరించటం నేర్చుకోవాలి. ఎదో ఒక్కదానికే కాదు – కేవలం భక్తిభావనతో ఉండాలి అంతే.
ఈ శ్వాస ఎలా సాగుతుంది, గాలి లోపలి ఎలా వెళ్తుంది, ఈ జీవాన్ని పోషించటానికి అది ఇవ్వవలసింది ఎదో ఇస్తుంది, బయటకు వచ్చి ఒక చేట్టులోకి వెళ్తుంది. చెట్టుకి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది – ఈ లావాదేవీ కొన్ని లక్ష్యల సంవత్సరాల నుంచీ జరుగుతోంది. ఆదియోగి 15,000 సంవత్సరాల క్రితం పీల్చిన గాలినే మనం ఇప్పుడు కూడా పీలుస్తున్నాము. కచ్చితంగా ఆయన తన సంతకాన్ని ఈ గాలి మీద విడిచిపెట్టారు. అలా ఎందరో చేశారు. అలానే ఎంతోమంది దుష్టులు కూడా ఉన్నారు కానీ గాలి మాత్రం అదే, ఇన్ని లక్ష్యల సంవత్సరాలుగా దాన్ని అది ఎంతో బాగా పోషించుకుంటూ వస్తోంది.
మనం దాన్ని ఎక్కువగా పాడు చేయకపోతే, కొన్ని బిలియన్ల సంవత్సరాలు ఇలాగే సాగుతుంది – అదే గాలి మరి. కొత్త గాలి ఏమి చేరలేదు. కొత్త నీరు కూడా చేరలేదు. ఇవే నిరంతరంగా పని చేయగలవు – ఎంత ఆద్భుతమైన పధకమో చూడండి. ఇప్పుడు మనం చేసే పనులు కొంత నిర్వహనీయమైన పద్ధత్తిలో చేయటం మొదలు పెట్టటానికి ఆలోచిస్తున్నాము – కానీ మనం చేసేవి ఏవి అటువువంటివి కాదు. మనం సృష్టించినవి ఏవీ మన్నికైనవి కాదు – ఇంతకు ముందు కంటే కొంచం ఎక్కువ రోజులు అవి మన్నుతున్నయి అంతే. ఒక విషయం ఏమిటంటే మనం నమస్కరించటం నేర్చుకోవాలి, భక్తిగా ఉండటం నేర్చుకోవాలి, ఎదో ఒక్కదానితో కాదు – కేవలం భక్తిభావనతో ఉండాలి అంతే.