మనుషుల ఎరుక మీద మత్తు మందు ప్రభావాల గురించి ఇంకా "ఎరుకను కోల్పోవటం" నిజంగా సాధ్యమా అన్న విషయం మీద ఒక మత్తు మందు నిపుణుడు ప్రశ్నించారు. అందుకు సద్గురు విధంగా బదులిచ్చారు "మీరు ఎటువంటి మందుని వాడినా కేవలం బాధ ఇంకా స్మృతిని మాత్రమే కోల్పోతారు." సద్గురు, ఇందుకు కొనసాగింపుగా,మొద్దుబరేలా చేయటం అనేది యోగా విధానానికి విధంగా విరుద్ధమో కూడా చర్చించారు.

Q: నమస్కారం. నేను వృత్తి రీత్యా అనస్థీషియన్ ను. నేటికి రెండు వందల సంవత్సరాలు గడిచినా కూడా మేము వ్యాధిగ్రస్తులను స్పృహ లేనిస్థితిలోకి ఎలా తీసుకువెళ్తున్నామో తెలియదు. ఇందుకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ నిరాశపరిచే సమస్య ఏంటంటే, శస్త్ర చికిత్స జరుగుతున్నంతసేపూ పూర్తి తెలివితో ఉండే రోగులు కూడా కొంత మంది ఉన్నారు, వారు అలా ఎలా ఉండగలుగుతున్నారో మాకు తెలియటం లేదు. మీరు మనిషి ఎరుకలోని ఏడు పొరల గురించి ఇంకా ఎరుక మీద ఎన్నో విషయాలు చెప్పగా విన్నాను. మందుల వలన ఎరుకుని ఎంత మేరకు నిలిపివేయగలము? యోగాను అభ్యసించేవారు శస్త్ర చికిత్స జరుగుతన్నంత సేపూ తెలివితో ఉండగలరా?

సద్గురు: మీరు ఎటువంటి మత్తు మందు ప్రయోగించినా, మీరు ఎరుకను అణువంత కూడా తీసివేయలేరు. మీరు కేవలం బాధ ఇంకా స్మృతిని, లేదా వ్యక్తి జ్ఞాపకశక్తిని మాత్రమే లేకుండా చేయగలరు. విధంగా కూడా జరగొచ్చు, ఒక వ్యక్తికి పెద్ద శస్త్ర చికిత్స జరుగుతున్నంతసేపూ పూర్తిగా స్పృహ లేనిస్థితిలో ఉన్నా, తెలివి రాగానే జరిగిందేదీ గుర్తులేకుండా ఉండి, ఒక పాతిక సంవత్సరాల తరువాత తనకి జరిగిన శస్త్ర చికిత్సను అనుకోకుండా పూస గుచ్చినట్టు జ్ఞప్తికి తెచ్చుకోగలడు. ఇటువంటి వైద్య దృష్టాంతాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, ఇలా జరగటం మాత్రం కచ్చితంగా సాధ్యమే, ఎందుకంటే మత్తు మందు ద్వారా మీరు కేవలం జ్ఞప్తికి తెచ్చుకొనే ప్రక్రియను మాత్రమే నిరోధించగలుగుతున్నారు. మీరు ఎంత స్థాయిలో మందులు వాడినా కూడా ఎరుకను నిరోధించలేరు.

ఒక రోజు ఇలా జరిగింది. శంకరన్ పిళ్ళై ఒక దంత వైద్యుడి దగ్గరకి వెళ్ళి ఇలా అన్నాడు "నేను ఒక పన్ను పీకించుకోవాలి. ఎంత ఖర్చు అవుతుంది?" "500 రూపాయిలు అవుతుంది" అన్నాడు దంత వైద్యుడు. "అబ్బో చాలా ఖరీదు" అన్నాడు శంకరన్ పిళ్ళై. "మరి మా దగ్గర అంత ఖర్చు అవుతుంది మరి" అని సమాధానమిచ్చాడు వైద్యుడు.

అప్పుడు శంకరం పిళ్ళై "పన్ను పీకటంలో సగం ఖర్చు మత్తు మందు ఇవ్వటానికే అవుతుందని నేను విన్నాను. ఒకవేళ నేను మత్తు మందు తీసుకోకుండా పన్ను పీకించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది?" అందుకు వైద్యుడు "అది మీకు చాలా నొప్పిని కలిగిస్తుంది. అయితే ఖర్చు మాత్రం రెండు వందల యాభై రూపాయిలు తగ్గుతుంది." 

అందుకు శంకరన్ పిళ్ళై "ఒకవేళ మీరు పన్ను పీకకుండా మీ దగ్గర శిక్షణ పొందుతున్న ఎవరైనా దంత వైద్య విద్యార్థి చేత పీకించారనుకోండి అప్పుడు ఎంత అవుతుంది?" 

అందుకు సమాధానంగా దంత వైద్యుడు "అలా చేస్తే మీకు అంత నైపుణ్యమైన చికిత్స దొరకదు కానీ ఖర్చు మాత్రం కేవలం వంద రూపాయిలు అవుతుంది."

శంకరన్ పిళ్ళై మళ్ళీ ఇలా అన్నాడు "మీ దగ్గర శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థి పన్ను పీకుతుండగా మిగిలిన పది మంది విద్యార్థులకు అది చూసే అవకాశం దొరికితే? మీరు దీనిని వాళ్ళకి శిక్షణ నిమిత్తం ప్రదర్శిస్తే, అప్పుడు ఎంత ఖర్చు?" అందుకు దంత వైద్యుడు " ఇది చాలా నొప్పితో కూడుకున్న ప్రక్రియ. పైగా ఒక పది మంది వ్యక్తులు మీ నోటిలోకి చూస్తుంటే మీకు చాలా ఇబ్బందిగా ఉండవొచ్చు. అయితే ఇలా చేయటానికి నేనే మీకు ఎదురు రెండు వందల రూపాయిలు ఇవ్వవలసి ఉంటుంది." అప్పుడు శంకరం పిళ్ళై వెంటనే "! ఇప్పుడు మీరు సరిగ్గా మాట్లాడుతున్నారు. మా అత్తగారి పన్ను పీకించటానికి రేపటికి అపాయింట్మెంట్ బుక్ చేయండి." అన్నాడు.

నొప్పిని ఇంకా జ్ఞాపకశక్తిని నిరోధించే ఒక వరం మత్తు మందు, కానీ అది ఎరుకను కోణంలోనూ నిలిపివేయలేదు. మీలోని అంశాన్ని అది ముట్టుకోలేదు. మత్తు మందు ఎక్కువై ఎవరైనా చనిపొయినా కూడా - అలాంటి ఘటనలు తరచూ జరగకూడదని కోరుకుంటున్నాను - మీరు అతని ఎరుకను స్పృశించలేరు. మీరు కేవలం శరీరాన్ని మాత్రమే తిరిగి కోలుకునే అవకాశం లేకుండా మొద్దుబారుస్తున్నారు. అతని ఎరుకను మాత్రం ముట్టుకోలేదు, ముట్టుకోలేరు కూడా. కారణం చేతనే ఆధ్యాత్మిక సాధన ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వేరే వస్తువు చేత స్పృశించలేని అంశాలని కూడా ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా స్పృశించగలరు. అందుకనే ఒక వ్యక్తి జీవితంలో గురువు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, ఎందుకంటే మీలో ఎవ్వరూ ముట్టుకోలేని కోణాన్ని కూడా ఆయన స్పృశించగలరు.

Q: మీరు మత్తు మందు కేవలం జ్ఞప్తికి తెచ్చుకోగల ప్రక్రియను మాత్రమే నిరోధించగలదు అని అన్నారు కదా, మరి యోగా సాధకులలో కూడా జ్ఞప్తి నిలిపివేయబడుతుందా?

సద్గురు: యోగా సాధకులతో సమస్య ఏంటంటే, వారు అందరికంటే ఎక్కువ విషయాలను జ్ఞాపకం చేసుకోగలరు. నేను నా జీవితంలో చంటిబిడ్డగాఉన్నప్పుడు, రెండు, మూడు నెలల పిల్లోడిగా ఉన్నప్పుడు నా చుట్టూ జరిగిన విషయాలను కూడా గుర్తుంచుకున్నాను. చాలా మంది వారికి నాలుగేళ్ల వయసుకు ముందు జరిగిన సంగతులు గుర్తుకు తెచ్చుకోలేరు. అసలు విషయం ఏమంటే జ్ఞప్తి అనేది మీ చిన్నప్పటి కంటే వెనుకకు వెళ్ళగలదు.

యోగా ఉద్దేశం మిమల్ని మొద్దు బార్చటం కాదు. యోగా ఉద్దేశం మిమల్ని ప్రజ్వలింపచేయడం. విధంగా అంటే, మీరు ఇప్పుడు దేనినైతే జీవం అనుకుంటున్నారో అంతకంటే హెచ్చుగా మీరు జీవించేలా చేయటం. వాస్తవికతకు తిమురు కప్పటం, దాని నుంచి దాక్కోవటం యోగా ఉద్దేశము కానే కాదు. వాస్తవికతను ఎదురుకుంటూ, ఇప్పటికంటే ఉన్నతమైన, విస్తారమైన సత్యాన్ని మీరు తెలుసుకుని, తద్వారా మీరు వాస్తవికత అనుకుంటున్న, మిమల్ని బాధించే, హింసించే చిన్న చిన్న విషయాలన్నీ మాయమైపోయేలా చేయటమే యోగా లక్ష్యం. చిన్న విషయాలు మిమల్ని వదిలి వెళ్ళిపోవటం వల్ల మాయం కావు, అవి మీకు అస్సలు ప్రాధాన్యత లేని అంశాలుగా మారిపోవటం వల్ల మాయం అవుతాయి.

యోగాలో బాధని మొద్దుబార్చటం అనేది ఉండదు. యోగా విధానం ఎటువంటిదంటే, మీకు ఒక సమస్య ఉంటే, మేము మిమల్ని ఇంకా పెద్ద సమస్యని అర్ధం చేసుకోమంటాం. మీరు పెద్ద సమస్యని ఎదురుకుంటే, అప్పుడు మీ చిన్న సమస్యలన్నీ అప్రధానం అయిపోతాయి. అప్పడు కేవలం ఒక్క సమస్య మాత్రమే మీలో తొలుస్తూ ఉంటుంది. సమస్య మిమల్ని ఎంత శక్తివంతంగా ఇంకా తీవ్రంగా తొలుస్తుంది అంటే దానికి సమాధానం కనుగొనకుండా మీరు జీవించలేరు. మరి సమాధానం మీరు కరుగుటలోనే ఉంది.

కనుక మత్తు మందు అనేది యోగా విధానానికి వ్యతిరేకం. ఎందుకంటే మత్తు మందు ఉన్న విషయాన్ని తిమురు కప్పాలని చూస్తుంది. యోగా ద్వారా మేము మిమల్ని మొద్దుబార్చాలని ప్రయత్నించటం లేదు. మేము మీ సమస్య పరిధిని ఒక అపరిమితమైన స్థాయికి పెంచి తద్వారా మీ సమస్యను ఒక పరిమిత సమస్యగా కాకుండా ఒక అపరిమిత సమస్యగా మార్చాలనే ప్రయత్నిస్తాము. విషయం గనుక మీకు అర్థం అయితే, ఇంక మీకు ఇతరత్రా ఏ సమస్యలూ కనపడవు ఎందుకంటే మిగతావన్నీ అత్యంత అప్రధానమైనవి అయిపోతాయి. అవి నశిస్తాయి అని చెప్పలేము - కానీ మీరు చూసే బృహత్తరమైన విషయం ముందు మిగతా సమస్యలు అల్పమైనవిగా తోస్తాయి.

Q: మీరు ప్రస్తావించిన ఎరుకలోని ఏడు పొరలు ఏమిటి?

సద్గురు: నిజానికి ఎరుకకు ఏడు పొరలు లేదా వివిధ పార్శ్వాలు అంటూ ఏవీ లేవు. ఎరుక కేవలం ఒక్కటే. ఒక్కొక్క వ్యక్తి పరిణామ క్రమంలో, అతను విషయాలను అర్ధం చేసుకునే విధానంలో, ఏడు పురోగమ స్థాయులు ఉండొచ్చు. ఏడు పురోగమ స్థాయులు ఉండబట్టే సదరు వ్యక్తి ఎరుకను ఏడు అంశాలుగా పరిగణిస్తాడు. లేదంటే, అర్ధం చేసుకునే వెసులుబాటు కోసం మనం ఎరుకను ఏడు పొరలుగా విభజించవొచ్చు.

ఇది ఎలా ఉంటుందంటే, భారతదేశంలో మనం వెల్లంగిరి కొండలలో ఉంటూ, ఇక్కడ ఏడు కొండలు ఉన్నాయి అని అంటాము. నిజానికి అక్కడ ఒక్క పెద్ద పర్వతం మాత్రమే ఉంది. కేవలం మనం పర్వాతారోహణ చేస్తూ ఒక్కోసారి పైకెక్కుతాం, మళ్లీ కొంత కిందకి దిగుతాం, మళ్లీ పైకెక్కుతాం, కొంత కిందకి దిగుతాం, అలా ఏడు సార్లు ఎక్కటం దిగటం జరుగుతుంది. కాబట్టి మన అనుభవ రీత్యా మనం ఏమని మనస్సులో గ్రహిస్తాం అంటే అక్కడ ఏడు కొండలు ఉన్నాయి అని. ఎందుకంటే మనం పర్వాతారోహణకు ఎంచుకున్న మార్గం ఏడు ఎత్తు పల్లాలతో కూడి ఉంది. మీరు ఇదే పర్వతాన్ని వేరొక వైపు నుండి అధిరోహించారనుకోండి, అప్పుడు మీకు ఒకే పర్వతంగా తోస్తుంది, ఏడు కొండలు ఉండవు.

ఎరుక ఒక్కటే. కానీ, మానవులు ఒక విధమైన మార్గం ఎంచుకుంటే మాత్రం అది ఏడు అడుగులుగా అనిపిస్తుంది. అయితే, మీరు మిమల్ని నాకు సమర్పిస్తే, కేవలం ఒకే ఒక్క అడుగు ఉండేలా నేను చూసుకోగలను - ఏడు అడుగులు ఉండవు. మీరు ఏ వైపు నుండి పర్వతం ఎక్కుతున్నారు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే, ఒకరి అనుభూతి మారుతుంది.

రచయిత గమనిక: సద్గురు అందించిన "Body - The Greatest Gadget" అనే ఈబుక్, భూమి మీదే ఎంతో అధునాతనమైన, అద్భుతమైన పరికరానికి పరిచయం. ఒక ఆసక్తికరమైన, ఉత్తేజకరమైన ప్రయాణానికి మొదటి అడుగు. ప్రయాణం, మీ శరీరంపై మీరు పూర్తి ఆధిపత్యం తెచ్చుకుని, భౌతికతలో వేళ్లూనుకుని ఉంటూనే భౌతికత ఆవల వస్తువుని మీరు రుచి చూడగలగటంతో ముగుస్తుంది. ఇప్పుడే ఈబుక్ ని డౌన్లోడ్ చేసుకోండి.

https://www.ishashoppe.com/downloads/portfolio/body-the-greatest-gadget/