గ్రామీణుల జీవితాలలోకి ఆట పాటలను తీసుకురావడానికి, వారి సమగ్ర ఆరోగ్యాభివృద్ధికి, వారి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి, ఈశా గ్రామోత్సవం ఒక పెద్ద ప్రయత్నం. ఈ గ్రామోత్సవం ఈశా ఫౌండేషన్ వారి గ్రామీణ పునరుజ్జీవన ప్రోగ్రాంలో ఒక భాగం. ఈ ఉత్సవం రాష్ట్రవ్యాప్త గ్రామీణ ఆటల పోటీలతో సమాప్తం అవుతుంది.

ఈశా వారి గ్రామీణ గ్రామోత్సవం కార్యక్రమాలలో ఆటలు ఒక అంతర్భాగం. ఆటలు వారి కులాల అడ్డంకులను తొలగిస్తూ, కొత్త స్థాయిలో వారికి శ్రేయస్సు చేకూర్చింది. అంతేగాక అది వ్యసనాల నుంచి బయటపడటానికి, సామాజిక జీవనం పునరుజ్జీవనం చేయటానికి తోడ్పడుతుంది. ఈ ఆటలలో ‘చిన్న-పెద్ద’ ‘ఆడ-మగ’ అనే తేడాలు లేకుండా, అన్ని సామాజిక స్థాయిల, అన్ని రకాల ఆర్థిక స్థాయిల ప్రజలను, ఒక చోటకు చేరుస్తుంది. ఆడవారు, ముఖ్యంగా వయసు మీరిన ఆడవారు, ఆటలు ఆడటం కొన్ని సంవత్సరాల క్రితం తలచను కూడా తలచలేము. కానీ ఈ ఆటలు వారిలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని తీసుకువచ్చి వారి జీవితాలను మార్చుకోవడానికి తోడ్పడింది. ఆటలతో వచ్చిన ఈ కొత్త బాంధవ్యాల వల్ల, సామాజిక గ్రంధాలయాలు, చిన్న తరహా రుణపథకాలు, ఉత్సాహంగా జరుపుకునే ఆటలపోటీలు, ప్రజల జీవితాల్లో జీవితాలను ఎన్నో విధాలుగా మార్చాయి.