సంస్కృతంలో “ఆరోగ్య” అంటే ఆరోగ్యం అని అర్థం, మన జీవిత శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది. అధునాతన చికిత్స విధానాలు, రోగాలకు వెంటనే త్వరగా ఉపశమనం కలిగిస్తాయని మనకు తెలుసు. కానీ, దీర్ఘ వ్యాధులకు సంబంధించినంత వరకు, అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలు శారీరకంగానూ, మానసికంగానూ ఆ వ్యాధులు బయటపడ్డప్పుడు, వాటిని తగ్గించడానికే పరిమితమై పోయాయి. మరో మాటలో చెప్పాలంటే, దీర్ఘ వ్యాధులకు సంబంధించినంత వరకు, అవి లక్షణాలను తగ్గించడానికి పరిమితమయ్యాయి, అంతేగాని ఈ వ్యాధిని సమగ్రంగా నిర్మూలించేందుకు కాదు.

ఆధునిక చికిత్స విధానాలలా కాకుండా, సిద్ధ, ఆయుర్వేదం, అలాగే యోగా శాస్త్రాలవంటి భారతీయ వైద్య విధానాలు, వ్యాధుల మూలాన్ని చికిత్స చేయటానికి ప్రయత్నిస్తాయి. అవి వ్యక్తి జీవిస్తున్న వాతావరణం, వారి జీవన విధానం, సాంఘిక, ఆర్థిక స్థితిగతులు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. కేవలం వ్యాధులకు చికిత్స చేయడం కాక ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని మెరగు పరచడానికి శ్రద్ధ చూపుతాయి. మారే వాతావరణానికి అనుగుణంగా శరీరం తనకు తనే మార్చుకునే స్థితికి వస్తుంది.

వ్యక్తి ఆరోగ్యం కోసం, తక్కువ ఖర్చుతో, వారికి అందుబాటులో ఉండే సంపూర్ణ వ్యవస్థను ‘ఈశా ఆరోగ్య’ అందిస్తోంది. ఈశా ఆరోగ్య వైద్య విధానంలో, అంటురోగాలను త్వరగా తగ్గించగల అలోపతి నైపుణ్యాన్ని, మన సొంత వైద్య విధానంద్వారా మానవ శరీరాన్ని శక్తివంతం చేసి, వ్యాధిని నిరోధించుకునే శక్తిని కలిపి, వైద్యం అందిస్తుంది. ఈ రెండు వైద్య విధానాలను కలపడం ద్వారా, కేవలం రోగాలను తగ్గించుకోవడమే కాక, వ్యక్తి ఆరోగ్యాన్ని సమగ్రంగా నిర్వహిస్తుంది.

ప్రజల ఆలోచనా విధానాల్లో విధానంలో కొత్త రకమైన అవగాహన తీసుకురావడానికి ‘ఈశా ఆరోగ్య’ తమిళనాడులో ఈశా ఆరోగ్య కేంద్రాలను స్థాపించింది. ఈ కేంద్రాలు సమగ్ర ఆరోగ్యానికి, ఉచిత సలహాలను అందిస్తుంది. ఫార్మసీలలో సిద్ధ, ఆయుర్వేద, అలోపతి మందులు అన్నీ దొరుకుతాయి. వాటితో పాటు, కుటుంబ ఆరోగ్యానికి పనికివచ్చే సిద్ధ, ఆయుర్వేద ఉత్పాదనలు దొరుకుతాయి. అవి చర్మ ఆరోగ్యానికి, కేశ ఆరోగ్యానికి, పిల్లల ఆరోగ్యానికి పనికి వచ్చే ఉత్పాదనలు. ఆయుర్వేద మసాజ్ చేయటానికి, రెండు చికిత్స రూములు ఉన్నాయి. దానికి తోడు మధుమేహం, రక్తపోటు, ఆస్థ్మా, చర్మవ్యాధులు, పార్శ్వ నొప్పి, మోకాలు, వెన్నెముక నొప్పులకు, స్థూలకాయం, జుట్టు రాలడం వంటి దీర్ఘరోగాలకు ప్రత్యేక చికిత్సలను అందిస్తాయి.

సేంద్రియ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేస్తున్న వంద వనమూలికలను, ఈశా ఆరోగ్య, తమిళనాడులో అభివృద్ధి చేస్తోంది. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో వనమూలికలతో వ్యాధినిరోధం చేయడానికి పరిశోధనలు చేస్తోంది.