మార్మికులు ఎల్లప్పుడూ ధ్వనిని కేవలం వినోదం కోసమే కాక, ఇంకా ఎన్నో మార్గాలలో వాడారు. సితార లాంటి ఒక సంగీత వాద్యం తీగను మీటినా, అది మనకు ఓ పరానుభూతిని ఇవ్వగలదు. ఆ అనుభూతి ఎటువంటిదంటే, 1000 మాటలతో కూడా, అంతటి అనుభూతి కలుగదు. సద్గురు ఈ గ్రూపును తయారు చేసి, వారితో సంగీతం కూర్చడం గురించి మాట్లాడారు. ఒక వారం తర్వాత ఈ సౌండ్ ఆఫ్ ఈశా గ్రూపు ప్రదర్శనతో సద్గురు సత్సంగం ఆరంభమయ్యింది. ఈనాడు ఆయన చాలా కార్యక్రమాలలో వారు ఓ ముఖ్య భాగం. సద్గురు ఎంతో ఉదారంగా అందించే ఆధ్యాత్మిక ప్రక్రియలపట్ల, ప్రేక్షకులలో సరైన సుముఖత, గ్రాహ్యత కలుగ చేయడానికి, ఆ ప్రోగ్రాంలలో వారు ఒక అంతర్భాగం అయిపోయారు.

సౌండ్స్ ఆఫ్ ఈశా వారి పని, వారిలాగానే వైవిధ్యమైన అనేక శబ్దాలకు, ఒక సున్నితమైన కలబోత ఇవ్వటం. ఈ గ్రూపు సభ్యులు ఈశాలో ఫుల్ టైం వాలంటీర్లు. ఉర్రూతలూగించే వారి పాటలు ఈశా ఫౌండేషన్ చేసే పనిలో ఒక ప్రత్యేక కోణాన్ని అందరికీ పంచడం. ఈ పాటలలోని సంగీతం మన మనసులకు సాంత్వనను ఇచ్చి వారిని మైమరపింపజేస్థాయి. ఈ పాటల అసలైన సంభావ్యత, మానవునిలోని మూలంలో ఉన్న నిశ్శబ్దాన్ని ఆవిష్కరింపజేయడం.

కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం వల్ల ఎంతో నూతనంగా ఉండే, సౌండ్స్ ఆఫ్ ఈశా వారు, తమ మొదటి ఆల్బం Exuberance of the Unmanifest 2004లో మహా శివరాత్రి సమయంలో విడుదల చేశారు. వారి రెండవ ఆల్బమ్ మార్మికమైన వెల్లంగిరి పర్వతాల స్ఫూర్తితో White Mountain విడుదలైంది. ఆ తర్వాత ఇంకా అనేక గొప్ప గొప్ప పాటలు విడుదలయ్యాయి. అవి అన్నీ ఎంతో తీవ్రమైన మైమరపు, ఆనందాలను పంచే స్వరకల్పనలు.

ఈ గ్రూపువారు అనేక పేరొందిన సంగీత సభలలో పాల్గొన్నారు, వాటిలో 2006 లో జరిగిన జహానే ఖుస్రౌవ్ ఫెస్టివల్ ఇంకా అనేక ఐక్యరాజ్య సమిమతి కార్యక్రమాలు. వారు శివమణి, సింగర్ జిలాఖాన్, రెమో ఫెర్నాండజ్ లాంటి అనేకమంది గొప్ప కళాకారులతో కలసి ప్రదర్శనలిచ్చారు.

శ్రోతలను సున్నితమైన స్థితులకు తీసుకుపోయి, వారి అంతరంగాన్ని శోధించేందుకు కావలసిన ఘాటైన ఔషధాన్ని ఇవ్వడంలో సౌండ్స్ ఆఫ్ ఈశా వారు ఆరితేరారు.