మధురైలో, సద్గురు నిర్వహించిన పదివేల మందికి పైగా పాల్గొన్న ఒక మెగా ప్రోగ్రాములో, ఒక వాలంటీరు తన అనుభూతిని పంచుకుంటున్నాడు.

సద్గురు, ఒకే రోజు పదివేల మందికి శాంభవి మహాముద్ర దీక్ష ఇస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏది ఏమైనా నా సద్గురు సద్గురూనే.

ఈ ప్రోగ్రాం గ్రౌండ్లో, ఆఖరి రోజున దీక్ష ఇచ్చే సమయంలో నేను వాలంటీరంగ్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రాం నిర్వహణకు, ఎన్నో పనులు జరుగుతున్న హడావిడిలో, నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నాకూడా, ఆయన శక్తి, కరుణ ఆ వేదిక మీది నుంచి వర్షంలా కురవడం గమనించకుండా ఉండలేము.

ప్రోగ్రాం మొదటి రోజున, ఇటువంటి పబ్లిక్ గ్రౌండ్లో పదివేల మంది పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పరిసరాలు, పరిస్థితులు ఎలా ఉండబోతాయో అని నేను ఆలోచించాను. కానీ నేను చింతంచ నవసరంలేదు. ఆయన సమక్షం అన్నింటినీ సరి చూసుకుంటుంది. క్లాసులో పాల్గొన్న వారందరూ ప్రతిక్షణం గొప్పగా అనుభూతి చెందారని తెలుస్తూనే ఉన్నది. ఆ ప్రోగ్రాంలో రెండున్నర రోజులలో వారి నడక, మాటలు, చిరునవ్వు, అన్నీ పూర్తిగా పరిణామం చెందాయని నాకు తెలుస్తూనే ఉన్నది.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే, మానవ చరిత్రలో ఇంత పెద్ద ప్రోగ్రాం బహుశా ఎప్పుడు జరిగి ఉండదు అనిపిస్తోంది. ఆ సమయంలో అటువంటి ప్రదేశంలో ఉండటం, అంత గొప్ప కార్యక్రమంలో ఒక భాగం కావడం నాకు ఎంతో గొప్ప వరం. - ఒక వాలంటీర్

-ఒక వలెన్టిరు