యువతా - సత్యం: తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాటామంతి
ఢిల్లీలో సెప్టెంబరు 4న బ్రహ్మాండంగా ప్రారంభమైన “Youth and Truth – యువతా, సత్యాన్ని తెలుసుకో!” కార్యక్రమం, దక్షిణాదిన జరిగిన తన మొదటి ఈవెంట్ కి హృదయపూర్వక స్వాగతం పొందింది. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండవ కార్యక్రమానికి వేదికగా నిలిచింది.

"Youth and Truth" అనేది విద్యార్థుల్లో స్పష్టత, సమతుల్యత తీసుకురావడానికి సద్గురు, దేశంలో అనేక విద్యాసంస్థలలో ఒక నెల పాటు ముఖాముఖీ నిర్వహించే కార్యక్రమం. తరవాతి కార్యక్రమం చెన్నైలోని CEG లో సెప్టెంబర్ 10న జరగబోతుంది.
యౌవ్వనం - గందరగోళంగా ఉండే ఒక అమోఘమైన సమయం...
మనిషికి జీవితం మీద ఎంత ఎక్కువ ఉత్సుకత ఉంటే, అతనిలో అంత ఎక్కువ చురుకుతనం ఉంటుంది. యౌవ్వనం జీవితంలోని అతి చురుకుగా ఉండే సమయం, అందువల్ల అది సహజంగా ప్రతిదాని గురించీ, తనలోనూ, చుట్టుప్రక్కలా ఉత్పన్నమౌతున్న లక్షలాది ప్రశ్నలతో నిండి ఉంటుంది. లక్ష్యలూ, విజయాలూ, అపజయాలూ, స్వప్నాలూ, ఆకాంక్షలు, ఉద్వేగాలూ, వాద ప్రతివాదనలు వంటివి ఎన్ని జరుగుతున్నా, వాటిని మించి ఇంకా ఎన్నోప్రశ్నలు ఉంటాయి. కొన్ని స్పష్టంగానూ, ఇంకెన్నో అస్పష్టంగానూ ఉంటాయి. సత్యాన్ని తెలుసుకోవడానికి మన:పూర్వకంగా వచ్చే సందేహమే ఉత్తమ ఉపకరణం. ప్రపంచంలోని తమకున్న అనిశ్చతలను కప్పిపుచ్చుకోవడానికి మనుషులు చాలా సులువైన సమాధానాలు కనిబెట్టారు, కానీ వాటితో ఈ సందేహాలు తీరవు. ఇన్ని ఆశ్చర్యాలూ, గడబిడల మధ్య ఎవ్వరికైనా సరైన మార్గం ఎలా తెలుస్తుంది? అసలు సరైన దారంటూ ఒకటుందా?
యువతకు కావలసిన స్పష్టత, సమన్వయం తీసుకువచ్చి వారు తమ పూర్తి సామర్ధ్యం పొందడానికి సద్గురు ప్రారంభించిన ఉద్యమమే “యువతా - సత్యం”.
కార్యక్రమానికి సిద్ధమవుతూ...
కార్యక్రమానికి ముందు మేము అనేక మంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారు సద్గురును చూడడానికి ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. వారిలో కొందరు, సద్గురును YOUTUBE వీడియోలలోనో, tv లోనో చూశామని, మరి కొంతమంది ఆయన గురించి విన్నామని చెప్పారు, కానీ అందరూ ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. అన్ని చోట్లలాగానే కొంతమందికి తాము పాల్గొనబోయే కార్యక్రమం గురించి ఏ మాత్రం అవగాహన లేదు, కానీ మేము వివరాలు తెలియజేసినప్పుడు వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుని తమకు కూడా స్పష్టత కావలసిన ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని అన్నారు.
ఇక ఆడిటోరియంలోని వాతావరణానికి వస్తే, సద్గురు కోసం ఎదురు చూస్తూ వాళ్ళు ఏదో కబుర్లాడుకోవడం కనిసించింది. కాని సద్గురు ప్రవేశించగానే, అదంతా గౌరవ సూచకమైన నిశ్శబ్దం అయిపోయింది. విద్యార్థులంతా లేచి నిలబడి ముఖ్య అతిథికి కరతాళధ్వనులతో స్వాగతం పలికారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు కొన్ని వీడియోలు ప్రదర్శించారు. Youth and Truth వీడియోలు ప్రదర్శించేటప్పుడు వారిలో ఎంతో ఆసక్తి కనబడింది.
అన్వేషణ అరంభిద్దాం!
కార్యక్రమం ఆరంభంకాగానే, విద్యార్థులు Q&A, ప్రారంభించారు. మొదటి ప్రశ్న “stress management” గురించి. ఒక విద్యార్థి “నేను నా స్నేహితులతో, సద్గురుతో మాట్లాడబోతున్నానని చెప్పినప్పుడు వారందరికీ ఉన్న ముఖ్యమైన ప్రశ్న “Stress Management” గురించే అని చెప్పాడు. వెంటనే సద్గురు అడిగినది, మీకు అవసరమైనది, వదిలేయాలా? లేక మానేజ్ చేసుకోవాలా? అని. ఆ తరువాత యూనివర్శిటీ విద్యార్థులను వేధిస్తున్న ఈ ప్రశ్న మీద ఆయన మరింత వివరణ ఇచ్చారు.
అక్కడ అడిగిన ఇతర ప్రశ్నలు - రేపిస్టులను ఎలా శిక్షించాలి, అమాయకత్వం మంచిదనుకుంటే, అందరూ జ్ఞానాన్ని ఎందుకు కోరుకుంటారని, అర్థంలేని ఆప్యాయతలు, యువత దృష్టి పెట్టవలసిన లోపలి భయాలు లాంటివి, భారత దేశం ముఖ్యంగా వ్యవసాయ దేశమైనా జీడీపి లో వ్యవసాయం ఎందుకు ఎక్కువ భాగం ఇవ్వడంలేదని.
సోషల్ మీడియాలో ఏది ఎక్కువ కనబడుతోంది?

తరువాత విద్యార్థులు సోషల్ మీడియాలో ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్నను చదివి వినిపించారు. అందులో కొన్ని కొత్తవారిని కలిసినప్పుడు వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను అరికట్టడానికి యువత ఏమిచేయాలి? వాయిదాలు వేయడం, బద్ధకం లాంటివి ఎలా అధిగమించాలి అని.
ఆడియన్స్ నుంచి మరిన్ని ప్రశ్నలు....!
సోషల్ మీడియా మీద వచ్చిన ప్రశ్నల అనంతరం, ఆడియన్స్ నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. ఒక అమ్మాయి ‘మీ విజయ రహస్యమేమిటి’ అని సద్గురును అడిగిన ప్రశ్నకు విశేష ఆదరణ లభించింది. ‘సద్గురు, మై లవ్... ’ అంటూ ఒక అమ్మాయి ప్రశ్న మొదలు పెట్టగానే అందరూ నవ్వుకున్నారు.
మొదట మౌనంగా ఉన్న ఆడియన్స్ ఇప్పుడు మరింతగా స్పందిస్తూ, ఉత్సాహంగా పాల్గొన్నారు. సద్గురు వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చేటప్పుడు ఎంతో మంది ‘అవుననీ’ లేదా ‘కాదనీ’ స్పందించారు. విద్యార్థుల దగ్గర అన్నిరకాల ప్రశ్నలూ వచ్చాయి. ‘‘తమిళనాడు స్వతంత్ర దేశం అవ్వాలా లేక అవుతుందా?’’ ‘‘ఈనాటి సమస్యలకు ఆధ్యాత్మికత సమాధానాన్ని ఇస్తుందా?’’ ‘‘నా జీవితంలో నేనేమి చేయాలి?’’
https://twitter.com/ishafoundation/status/1038031511474167808

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.