అమీష్ త్రిపాఠి: నా ప్రశ్న విషాదం గురించి. మనందరికీ తెలిసిన ఫిలాసఫీలు ఆనందాన్నీ, బాధనీ సమంగా తీసుకుంటూ అనాసక్తి గా ఉండమని చెబుతాయి. కానీ బాధ భరించలేనట్టుగా ఉంటే ఏమి చేయాలి? మనం బాగా ఆరాధించే వాళ్ళని పోగొట్టుకునప్పుడు...ఆ బాధ నుంచి బయటపడడం ఎలా?

సద్గురు: ఇది మీ బాధని కొట్టి పారేయడం కాదు కానీ మీరు అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే... విషాదం అనేది ఆ పోయిన మనిషి  గురించిందికాదు. అది ఎప్పుడూ పోగొట్టుకున్న దాని గురించే. పోగొట్టుకోవడం... అంటే, మనం ఎదో పోగుట్టుకున్నామని. వస్తువులు పోయినా, పదవి పోయినా, ఉద్యోగం పోయినా మనుషులు బాధ పడతారు. 

నిజానికి విషాదం అంటే ఓ మనిషి దేన్నో పోగొట్టు కోవడం వల్లే.

నిజానికి విషాదం అంటే ఓ మనిషి దేన్నో పోగొట్టు కోవడం వల్లే. మనుషుల విషయానికొస్తే, వారి మరణం వల్ల వారిని పోగొట్టుకుంటే, ఆ నష్టాన్ని పూడ్చలేం. వస్తువులు, పదవులు, డబ్బు, ఆస్తులూ మరలా వస్తాయ్ కానీ మనిషి పోతే మళ్ళీ రాడు. అప్పుడు బాధ చాలా ఎక్కువగా  ఉంటుంది.

మనకి ఇలా జరగటానికి కారణం, మనం మన వ్యక్తిత్వాన్ని ఒక అతుకుల బొంతలా చేసుకున్నాము. మనమేంటి అనేది మనకున్న వస్తువులు, పదవులు, బంధాలు, మనుషులు, అనేవి నిర్ణయిస్తున్నాయ్. ఇందులో ఏ ఒక్కటి పోయినా మన వ్యక్తిత్వం చాలా వెలితి అనిపిస్తుంది. మనం బాధపడేది దీని గురుంచే. 

అందుకే మన జీవితాల్లో ఈ విషయం భాగం కావాలి  – మనం ఏమిటనేది మన దగ్గర ఉన్నవి నిర్ణయించకూడదు. మనమేమిటనేది - మన జీవితంలో ఏముండాలో నిర్ణయించాలి.

అందుకే, మన అనుబంధాలు మనలో ఉన్న నిండుదనంతో రావాలిగానీ, మన జీవితానికి నిండుదనాన్ని తెచ్చేవి కాకూడదు. మీలో నిండుదనాన్ని తీసుకురావటానికి  మీరు అనుబంధాల్ని వాడితే, అవి లేనప్పుడు మీకు అంతా శూన్యంగా అనిపిస్తుంది. మీ అనుబంధాలు మీలోని నిండుదనాన్ని పంచుకోవటానికే అయతే మీలో బాధ ఉండదు.

మీ దగ్గరి వాళ్ళు పోయినప్పుడు, ఇలా చెప్తే ఇదంతా పనిచెయ్యకపోవచ్చు- మీకు జరిగిన నష్టాన్ని తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. అందుకే మన జీవితాల్లో ఈ విషయం భాగం కావాలి  – మనం ఏమిటనేది మన దగ్గర ఉన్నవి నిర్ణయించకూడదు. మనమేమిటనేది - మన జీవితంలో ఏముండాలో నిర్ణయించాలి. ఇది అందరికీ జరగాలి - ఇదే ఆధ్యాత్మికం అంటే.

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image