IEO-Covid-19-banner-small

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో మనమేం చేయాలి?

సద్గురు: మనం ఎంతో విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఇటువంటి పరిస్థితి మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఇది ఇంకా ఎంతకాలం ఉంటుందన్న దాన్నిబట్టి , ఇది మనం అసలు జీవించే విధానాన్ని ఎంతగా మార్చివేయగలదనే విషయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం దీనిపట్ల బాధ్యతగా, వ్యవహరించకపోతే, మన జీవితంలో చాలా అంశాలు ఎప్పటికీ మారిపోగలవు. మనం ఈ సమస్యని వివేకంతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తే, ఇది మన తరంలో ఒక చిన్న అవాంతరంలా గడిచిపోతుంది, లేకపోతే ఇది ఎంతో పెద్ద విపత్తు అయ్యే ప్రమాదం ఉన్నది. మనుషుల ద్వారానే ఇది వ్యాపిస్తుంది కాబట్టి, ఇది విస్తరించకుండా ఆపడం లేక అన్నిచోట్ల విస్తరించేలా చేయటం, అనేది మన చేతిలోనే ఉన్నది.

ఇటువంటి సమయంలో మన ప్రాథమిక బాధ్యత ఏమిటంటే, మనకు ఇది సంక్రమించకుండా చూసుకోవడం. కానీ, దురదృష్టవశాత్తూ మీకు ఈ వ్యాధి సంక్రమిస్తే, మీనుంచి మరెవరికీ ఇది సోకకుండా చూడటం అనేది, మన ప్రాథమిక కర్తవ్యం. ఇది మనతోనే ఆగిపోవాలి. మనం ఈ మాత్రం చేయగలిగితే, దీనిని మనం కట్టడి చేయవచ్చు. లాక్ డౌన్ కారణంగా, మన జీవితాలను నియంత్రించుకోవడం వల్ల ఈ వ్యాధి ప్రస్తుతం కొంతవరకు కట్టడి చేయబడింది. అంతేగాని మనం ఈ వైరస్ మీద విజయం సాధించలేదు. అది ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది, మనం అజాగ్రత్తగా ఉంటే అది చాలా విపత్తుకు దారి తీయవచ్చు. దయచేసి సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించండి, ఆరోగ్యంగా ఉండండి.

ఇటువంటి పరిస్థితుల్లో ఈశా ఫౌండేషన్ ఏమి చేస్తున్నది?

సామాజిక దూరం అమలుచేయడంలో కృషి చేస్తున్న పోలీసులు మరియు ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్యసహాయం అందించడం ద్వారా వైద్యశాఖలో పనిచేసేవారు, ఇంకా అనేక ఇతర శాఖలలో పని చేసే వారందరూ ముందువరుసలో నిలిచారు. వారందరికీ మనం ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ప్రోగ్రాంను ఉచితంగా అందిస్తున్నాము. దీనివల్ల ఫౌండేషన్ కు ఎంతో ఖర్చు, మరియు దీనిని ఎన్నాళ్లు భరిస్తామో అన్నది ప్రశ్నార్థకం. మేము దీనిని మే 31 వరకు వారికి ఉచితంగా అందిస్తున్నాము. అంతేకాక ప్రపంచంలో మిగతా వారందరికీ ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ప్రోగ్రాంను సగం ధరకే అందిస్తున్నాము. ఎందువలనంటే అందరి ఆర్థిక పరిస్థితీ అనేక విధాలుగా దెబ్బతిన్నది, లేక ముందు ముందు అలాగే అయ్యేలా ఉన్నది.

ఇతరుల శ్రేయస్సు తమ జీవితంకన్నా ముఖ్యమైనదని ఎవరు భావిస్తారో. నా ఉద్దేశంలో వారు పూజ్యులు.

ఈశా వాలంటీర్లు అందరూ కనీసం ఒక డాక్టర్ కు, ఒక నర్సు, తమకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ కు, ఈ ప్రోగ్రాం అందించాలి. అలా అందిస్తామని అందరూ ఒక సంకల్పం చేయాలి. వారు మీకు తెలిసిన వారై ఉండనక్కరలేదు. మీరు వారికి ఫోన్ చేసి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని, ఈ పోగ్రామ్ మీలో ఎలాంటి మార్పు తెచ్చిందో వారికి తెలియ చెప్పవచ్చు. ఇంకా, దీనిని వారికి మీరు ఎందుకు ఉచితంగా అందిస్తున్నారో, చెప్పవచ్చు. అలాగే, ఈ నెలలో కనీసం మరో ఇద్దరికి, మీరు ఈ ప్రోగ్రాం సగం ధరకు అందజేయాలి. ఎందుకంటే ప్రస్తుతం మన వాలంటీర్లు చాలామంది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలలో అనేక గ్రామాలలో ఎంతో పని చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ, ఆకలి బాధకు లోనయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. వారందరికీ సేవలందించడానికి, ప్రక్రియను ఒడిదుడుకులు లేకుండా చేయడానికి, ఇది మనకు సహకరిస్తుంది.  

ఇతరుల శ్రేయస్సు తమ జీవితంకన్నా ముఖ్యమైనదని ఎవరు భావిస్తారో. నా ఉద్దేశంలో వారు పూజ్యులు. ప్రతీరోజూ ఈ మహమ్మారికి తమని తాము గురిచేసుకుంటూ పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇంకా ఇలాంటి ఇతరులకు మనం ఇచ్చే కానుక ఇది. 

ieo-blog-mid-banner

 

ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ - మానసిక శ్రేయస్సుకు ఒక సాధనం

దాదాపు ఒక నెల క్రితం ఈ వ్యాధికి గురై, బయటపడ్డ వారిలో చాలమంది శ్వాస ప్రక్రియ ఇంకా మామూలు పరిస్థితికి రాలేదని మాకు తెలిసింది. ఈ వ్యాధి బాగా సోకిన వారి శ్వాస ప్రక్రియ చాలా దెబ్బతిన్నదని డాక్టర్లు భయపడుతున్నారు. శ్వాసకోశం కొంతభాగం గట్టిపడిపోయినప్పుడు, ఇక వారి జీవితంలో, వారి శ్వాస మామూలు స్థితికి రావడం చాలా కష్టమని తెలుస్తున్నది.

అంటే ఇప్పుడు బయట మనకు కనబడని శత్రువు ఉంది. దానిని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియని,. అటువంటప్పుడు, కనీసం మనతో మనం ఎలా ప్రవర్తించాలోమనం తెలుసుకుని ఉండాలి. ఇటువంటి సమయంలో ఈ విపత్తును ఎదుర్కోవడానికి మన ఆలోచనలు, మనోభావాలు అడ్డంకి కాకూడదు. మనలో ప్రతి ఒక్కరూ ఈ సమస్య పరిష్కారంలో ఎలా భాగం కావాలో చూడాలి. ఈ సమస్యలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వివేకాన్ని, సమతుల్యతను, అలాగే ఆనందం, ఉత్సాహాలను నిలుపుకునేందుకు తయారుగా ఉండాలి. దీనికి ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఎంతో గొప్ప సాధనం, అందుకే దీనిని వీలైనంత ఎక్కువ మందికి మనం అందించాలి. మనం ఎంత ఎక్కువమందికి అందిస్తే ప్రపంచం అంత బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి సమయంలో మానసిక సంతులనం, మనోభావాల స్థిరత్వం, అనేవి తీసుకురావడం ఎంతో ముఖ్యం. 

శాంభవి మహా ముద్ర ఉపదేశం పొందకుండా ఇంజనీరింగ్ ఆన్లైన్ పోగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది?

ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ పోగ్రామ్, మీ గుర్తింపు తాలూకు మనోభావం, మానసిక పార్శ్వాలను స్థిమిత పరిచేలా రూపొందించబడింది. శాంభవి మహా ముద్ర సాధన అనేది మనిషిలోని శక్తి ఇంకా రసాయనిక సమతుల్యతలపై పనిచేస్తుంది. ఈ శాంభవి మహా ముద్ర సాధన అనేది ఆన్లైన్లో అందించలేనిది. ఈ కరోనా పరిస్థితి బాగుపడిన వెంటనే ఈ శాంభవి మహాముద్ర క్రియను, అనేక నగరాలు, పట్టణాలలో అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తాము. కానీ ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ తో ప్రజలు తమ మానసిక స్థితిని ఒక విధమైన సమతుల్యతకు, మనోభావాలను ఒక నిర్దిష్టమైన మాధుర్యపు స్థాయికి తీసుకురావచ్చు. ఇది వారిని ఈ ప్రతికూల పరిస్థితి నుంచి గట్టెక్కి స్తుంది. 

ఇంజనీరింగ్ ఆన్లైన్ ప్రోగ్రాంకి సద్గురు మిగతా వీడియోలకి మధ్య ఉన్న అంతరం ఏమిటి?

ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ అనేది అంచెలంచలుగా అడుగు ముందుకు వేస్తూ, మీరు స్వతహాగానే శాంతంగా, ఆనందంగా ఉండేలా చేయడానికి ఒక సాధనం. యూట్యూబ్ వీడియోస్ మీలోని కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి ఉద్దేశించినవి. అవి అంచెలంచలుగా చేసే ప్రక్రియ కాదు. మీరు చూసే, యూట్యూబ్ వీడియోలు, వేరే పలురకాల కార్యక్రమాలను ఇంజనీరింగ్ ఆన్లైన్ పోగ్రామ్ తో పోల్చలేము. ఇది ఒక పద్ధతిలో, మీపై, వేరే స్థాయిలో పనిచేసే ఒక ఉపకరణం. 

ఇది మన తరానికి నిర్దేశించబడిన ఒక బాధ్యత

మీరు వేసే ప్రతి అడుగులో, నేను మీతో ఉంటాను. మనమందరం ఈ సమయంలో సజీవంగా ఉండాలి, అలాగే మీ చుట్టూ ఉండేవారు కూడా సజీవంగా ఉండేటట్లు మీరు చూడాలి. ముఖ్యంగా, మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు లాంటి వయసు మీరిన వారితో మీరు ఉంటే, వ్యాధి తేలికగా సోకే అవకాశంగల వారు సజీవంగా ఉంచడం అనేది మీరు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన బాధ్యత. ఈ బాధ్యత ఈ తరానికి సంబంధించినది. ఈ మహమ్మారి మాకు ఎదురయింది. కానీ, మేము దీనిని వివేకంతో బాధ్యతాయుతంగా ఎదుర్కొని, చివరకు విజయం సాధిస్తాము, అని మీరు సంకల్పించాలి. మీకు, మీ సమాజంలో జీవించే ఇతరులకు అలా జరిగేలా మీరు బాధ్యత వహిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ విషయంలో మీరు విజయలు కావాలన్నది నా ఆకాంక్ష, దానికి నా ఆశీస్సులు.. 

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor’s Note: Inner Engineering Online is available free of cost for COVID Warriors and at 50% of the cost for everyone else.

ieo-covid19-blogbanner