ప్రశ్న : సద్గురూ, మీరు బాలుడిగా ఉన్నప్పుడే హఠ యోగాని అభ్యసించేవారని చెప్పారు. అందులో సూర్య క్రియ కూడా ఉన్నదా ? ఉంటె మీ అనుభవాలు ఏమిటీ?

సద్గురు : నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు , నన్ను నిద్ర లేపడం అనేది ఒక పెద్ద పని. మేము ఉదయం 8 . 30 గంటలకు స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి ఈ ప్రయత్నం మా కుటుంబం 6 .30 కి మొదలు పెట్టే వారు. మొదట , మా అక్కలు ఇద్దరూ చాలా ప్రయత్నించే వారు. అయినప్పటికీ, నేను నిద్ర పోతూనే ఉండేవాడిని . వాళ్ళు చల్లటి నీళ్లు నా మొఖాన చల్లేవారు- తిరిగి నేను నిద్ర పోయేవాడిని. అప్పుడు మా అమ్మ వచ్చి నన్ను కూర్చో పెట్టేది. ఆమె " మంచం దిగి వచ్చేయి " అంటుండేది . "వస్తున్నా" "వస్తున్నా" అంటూనే, ఆమె అటు వెళ్ళగానే, తిరిగి నిద్ర పోయే వాడిని.

అప్పుడు వాళ్ళు నన్ను పక్క మీంచి లేపి బాత్ రూమ్ దగ్గరకు, నా వంతు వచ్చేందుకు తీసుకు వెళ్లేవారు. ఇంట్లో రెండే బాత్ రూములు ఉండేవి . నిజానికి ఒకటే బాత్ రూము, రెండవది పాయిఖానా. మేము నలుగురు పిల్లలు స్కూలుకి వెళ్ళాలి , నాన్నగారు హాస్పిటల్ కి వెళ్ళాలి కాబట్టి బాత్ రూము వాడటానికి సమయ నియమం ఉండేది. మా అమ్మ నాకు టూత్ బ్రష్ పై పేస్టు వేసి ఇచ్చేది . అది నోట్లో పెట్టుకుని నిద్ర పోయే వాడిని. అప్పుడు బాత్ రూమ్ కి వెళ్ళడానికి నా వంతు రాగానే, నేను నెల మీద పడుకొని తిరిగి నిద్ర పోయే వాడిని. ఎవరూ లేపక పొతే 12 లేదా ఒంటి గంట దాకా పడుకొనే వాడిని. నాకు ఆకలి వేస్తేనే నిద్ర లేచే వాడిని . నేను నటిస్తున్నానని కాదు - నేను నిద్రావస్థ లోనే ఉన్నా. నేను చురుకుగా ఉన్నప్పుడు , అతి చురుకుగా ఉండే వాడిని. కాకపోతే, నిద్ర పొతే, ఇక నేను లేనట్లే .

అప్పుడు నేను యోగా అభ్యసించడం మొదలు పెట్టాను. ప్రధానంగా, సూర్య క్రియ ని అభ్యసించేవాడిని . కానీ అది ప్రస్తుతం మీరు అభ్యసించే దాని కంటే పూర్తిగా వేరే పద్ధతిలో ఉండేది. షుమారు 6 నుంచి 8 నెలల అభ్యాసం తర్వాత, ఎక్కడ ఉన్నప్పటికీ తెల్ల వారు జామున 3 . 30 లేదా 3 .40 కి లేచి ఉండే వాడిని. నిద్ర లేచి తీరాల్సిందే- ఈ విషయంలో ఏమీ సందేహం లేదు. నా నిద్రా సమయం తగ్గడం ప్రారంభం అయింది. నాకు 13 - 14 సంవత్సరాల వచ్చే నాటికి అందరి కంటే ముందు లేచే వాడిని.

బ్రహ్మ ముహూర్తము - సూర్యుడు

సూర్యోదయానికి పూర్వమే , తెల్లవారు ఝామున షుమారు 3.20 నుండి 4.00 గంటల మధ్య, సూర్య శక్తి మనకు చేరుతూ ఉంటుంది. వెలుగు రాక పోయినప్పటికి, భూమి మీద సూర్య శక్తి ఆ సమయంలో విశేషంగా పెరుగుతుంది. రాత్రి సమయాల్లో సూర్యాస్తమయానికి చాలా ముందే సూర్య శక్తి బాగా క్షీణిస్తుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లొ, సంవత్సరంలోని ఋతువులను బట్టి సూర్యాస్తమయం వేరు వేరు సమయాలలో ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గరలో సూర్యాస్తమయం షుమారు సాయంత్రం 6 నుండి 6 .30 మధ్య ఉంటుంది .భూమధ్య రేఖ దగ్గరలో సూర్యాస్తమయం షుమారు 6 నుండి 6 .30 మధ్య ఉంటుంది .

భారత దేశంలో , సూర్యుడు షుమారు సాయంత్రం 6 గంటలకు అస్తమిస్తున్నాడనుకోండి. సూర్యుని శక్తి 5 .20 గంటలనుండే తగ్గడం ప్రారంభమవుతుంది. వెలుగు ఉన్నప్పటికీ , శక్తి తగ్గుతూ ఉంటుంది. భూమి తిరుగుతూ ఉన్న కారణంగా, సూర్యుడు మనకు దూరంగా వెళ్లి, శక్తి వెనక్కి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ శక్తి తగ్గాడాన్నే ప్రజలు ఒక దేవతా సంబంధమయిన పనిలాగా అనుభవం చెందుతారు. సూర్యాస్తమయాన్ని మీరు శ్రద్ధగా గమనిస్తే, దానికి ఒక మహనీయ స్వభావం ఉంది. ఎందుకంటే , మిట్ట మధ్యాహ్నం ప్రజ్వరిల్లిన సూర్యుడు హఠాత్తుగా అంతమయ్యాడు. మీకు దరిదాపుగా ఊపిరి ఆగినంత పనవుతుంది.

తెల్ల వారు జామున 3.20 గంటల నుండి, సూర్యుని శక్తి పెరగడం ప్రారంభిస్తుంది. దీనినే మేము బ్రహ్మ ముహూర్తము అంటాము. బ్రహ్మన్ అనేది సృష్టికి ఒక ఆకారంలేని మూలాధారం. మన విషయానికి వచ్చేటప్పడికి , ఈ సౌర మండలంలో , శక్తికి, సృష్టికి మూలాధారమయినది సూర్యుడే . మన శరీరంలో ప్రతి క్షణం జరిగే కోటాన కోట్ల రసాయన ప్రక్రియలు సూర్య శక్తి లేకుండా జరగవు. బ్రహ్మ ముహూర్తం ఆరంభమయిన క్షణం నుండి , మీ దేహం తనంతట తానే శరీర లోతులనుండి జాగృతమవుతుంది . కేవలం 6 నుండి 8 నెలల సూర్య క్రియ అభ్యాసంతో నేను అందరికంటే ముందు నిద్ర లేచే వాడిని. నేను నిజంగా నిద్ర లేస్తున్నానంటే మా కుటుంబం నమ్మ లేక పోయే వారు.

చివరికి ఈ క్రియలు దేన్నీ గురించి

సూర్య క్రియ నన్ను ప్రేరేపించింది. అది వ్యాయామం వలన కాదు. మీరు ఆ శక్తితో పూర్తిగా విలీనమవుతారు. అంతే అన్ని సిద్ధంగా ఉన్నట్లు ఉంటుంది. క్రియలు అనేవి దీన్ని గురించే . క్రియ అనేది మిమ్మల్ని ఒక దిశలోకి నిర్దేశించడం గురించి కాదు - అది ప్రతిదానితో మిమ్మల్నిసరిగ్గా సమన్వయంతో ఉండడం గురించి. ప్రతిదీ సమన్వయంలో ఉన్నప్పుడు, ఏ విధమయిన ఘర్షణా లేకుండా అంతా మృదువుగా ఉంటుంది. ఎప్పుడయితే ఘర్షణ లేదో అప్పుడు అరుగు తరుగులు కానీ వత్తిడి కానీ ఉండవు. ఘర్షణ లేనప్పుడు , నిరంతరం పయనించి వచ్చు . ఘర్షణ ఉంటేనే ఎక్కువ సార్లు విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

యోగా పధ్ధతి సరిగ్గా ఇదే- అనేక స్థాయిలలో - మిగిలిన సృష్టితో ఒక సమన్వయాన్ని సృష్టించడం . యోగాని మీరు తెలుసుకొనే ఏకైక మార్గం మీకు మీరు సంపూర్ణమైన సమతుల్యత సాధించడం. మీరు బాహ్యంగా ఉన్న వాటితో సమతుల్యత సృస్టించనవసరం లేదు. మీరు మీ వ్యవస్థ తో పూర్ణమయిన సమతుల్యత సాధిస్తే, మిగిలిన ప్రతిదాని తోనూ పూర్ణమయిన సమన్వయము ఏర్పడుతుంది. అలా ఎప్పుడయితే జరిగిందో , అప్పుడు ప్రతి విషయం స్వాభావికమైన విధానం లోనే జరుగుతుంది.

ఎంత తినాలి, ఎన్ని కేలరీల ఆహరం తీసుకోవాలి , ఎంత వ్యాయామం చేయాలి , ఎం చేయాలి అన్న ప్రయాసలు ఉండవు. ఇటువంటి అర్థ రహిత విషయాలు కనుమరుగవుతాయి. ఆలోచించకండానే, ఈ జీవితంతో ఏమి సాధించాలి అన్నది అర్థమవుతుంది. కారణం దానికి అవసరమైన జ్ఞానం ఈ జీవితం లోనే పెట్టుబడి పెట్టారు. ఇదే జ్ఞానం అంతర్గతంగా ఉండి, మీ దేహాన్ని, మనస్సుని నిర్మాణం చేస్తుంది.

సంపాదకుని వివరణ: ఈశా హఠ యోగాలో విస్తారమయిన అన్వేషణతో ప్రపంచంలోనే కనుమరుగయిన పురాతన సాంప్రదాయ హఠ యోగా విజ్ఞానాన్ని దాని యొక్క వివిధ ప్రమాణాలను తిరిగి పునరుద్ధిస్తున్నారు. ఈ కార్య క్రమాలు ఉప యోగా ,అంగమర్దన, సూర్య క్రియ ,సూర్య శక్తి , యోగాసనములు , భూత శుద్ది ఇంకా ఇతర శక్తివంతమైన యోగాభ్యాసాలను పరిశోధించడానికి అసమాన అవకాశాలు అందిస్తున్నాయి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు