ప్రశ్న: అధిక వేతనం ఇచ్చే ఉద్యోగం ఇంకా తక్కువ జీతం ఇచ్చే నచ్చిన మరొక ఉద్యోగం మధ్య ఎంపిక చేసుకునే అవకాశం ఉంది నాకు. నేను వీటిలో ఏది ఎంచుకోవాలి?

సద్గురు: మీ విలువని మీకు జీతం ఎంత వస్తుందన్న అంశంతో చూడకూడదు. మీ విలువని మీకు ఎటువంటి భాద్యతలు ఇచ్చారన్న అంశంతోనే చూడాలి. ఇక్కడ మీకు ఇచ్చిన అధికారం డబ్బుతో కూడుకున్నది కాదు, అది మీకు కొత్తగా ఏదో సృష్టించడానికి ఇవ్వబడింది.

డబ్బు అనేది అవసరమైన మేరకు మన మనుగడకు ఒక మార్గమే. కానీ మీకు ఎటువంటి బాధ్యతలు ఇవ్వబడ్డాయి అన్న దానిపై ఆధారపడి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు. మీకు ఏ స్థాయిలో బాధ్యతలు ఇవ్వబడ్డాయి? మీకోసం ఇంకా మీ చుట్టూ ఉన్న వారికోసం నిజంగా విలువైనది సృష్టించడానికి ఎటువంటి అవకాశం ఉంది?

వేరే జీవితాన్ని స్ప్రుసించడం

ప్రపంచంలో మీరు చేసే ఎటువంటి పనైనా ప్రజల జీవితాలను లోతుగా తాకినపుడు మాత్రమే, ఆ పని మీకు నిజంగా విలువైనది అవుతుంది. ఉదాహరణకు, మీరు ఒక సినిమా తీయాలనుకుంటే, ఎవరూ చూడని సినిమా తీయాలనుకుంటారా? లేదా ఎవ్వరూ నివసించాలనుకోని ఇల్లుని కట్టాలనుకుంటారా? మీరు అలా ఎవ్వరికీ ఉపయోగంలేని వాటిని సృష్టించాలనుకోరు ఎందుకంటే మీరు ఏదో రకంగా ప్రజల జీవితాలను స్ప్రుసించాలనుకుంటారు.

మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు చేసే పని ప్రజల జీవితాన్ని తాకాలని కోరుకుంటారు. చాలామంది ప్రజలు తమ జీవితాన్ని పని ఇంకా కుటుంబం మధ్య విభజించడానికి ప్రయత్నిస్తారు, ఇక్కడ పని డబ్బు కోసం మీరు చేసేది, ఇంకా కుటుంబం అనేది మీరు ప్రజల జీవితాలను తాకడం కోసమే. కానీ ఈ అంశం కుటుంబానికి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రజల జీవితాలను తాకేలా మీరు ఏమి చేస్తారో అది ఇక్కడ ముఖ్యమైన విషయం.

మీరు ఎంత లోతుగా ప్రజల జీవితాలను తాకుతారనేది మీరు చేసే పనిలో మీరు ఎంతగా నిమగ్నమయ్యారనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

మీరు ఎంత లోతుగా ప్రజల జీవితాలను తాకుతారనేది మీరు చేసే పనిలో మీరు ఎంతగా నిమగ్నమయ్యారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మీరు లోతుగా నిమగ్నమయితే, సహజంగానే మీ పనితీరు భిన్నంగా ఉంటుంది ఇంకా మీ సామర్థ్యం మేరకే మీకు చెల్లింపు జరుగుతుంది. కొన్నిసార్లు మీరు బేరమాడాల్సి వస్తుంది లేదా జీతం పెంపు కోసం అడగవలసి వస్తుంది, బహుశా ఈ విషయాల గురుంచి మీ సంస్థకు గుర్తు చేయవలసిరావచ్చు. కానీ, సాధారణంగా ప్రజలు మీరు ఆ సంస్థకు ఎంత విలువైనవారో గుర్తిస్తే మీకు తదనుగుణంగానే చెల్లిస్తారు.

మీరు చేస్తున్న పనిలో మీరు వృద్ది చెందుతుంటే, ఎప్పుడో ఒకరోజు, అవసరమైనప్పుడు మీరు ఒక స్థానం నుంచి పై స్థానానికి మారినప్పుడు మీ డబ్బు పది రెట్లు పెరగొచ్చు. ఉదాహరణకు మీరొక సంస్థకు అధ్యక్షునిగా ఉంటూ పూర్తి బాధ్యతలను నిర్వహిస్తూ కూడా మీరు తక్కువ జీతానికి పని చేస్తున్నరనుకుందాం. మీరు మీ పనిని బాగా నిర్వహిస్తే ప్రపంచం మొత్తం అది చూసి గుర్తిస్తుంది ఇంకా రేపు ఎవరో ఒకరు మిమ్మల్ని ఎక్కువ జీతానికి తీసుకోవడానికి ముందుకొస్తారు. కాబట్టి మీ విలువని ప్రతీసారి డబ్బు అంశంతోనే చూడకూడదు.

మనం సంస్థలు ఎందుకు స్తాపిస్థామంటే..

మనం సంస్థలు పెట్టుకున్నది మనమేదైతే ఒంటరిగా సాధించలేమో వాటిని అందరం కలిసి సాధించటానికే. చారిత్రాత్మకంగా పూర్వం ఎవరికి వారే తయారీదారుగా ఇంకా వర్తకుడుగా ఉన్నట్టు మనం కూడా ఇప్పడు అలాగే ఉండవచ్చు. కానీ మనమెప్పుడైతే వేలాది వ్యక్తులు ఒకే సంకల్పంతో ఒక దిశగా వెళ్తామో అది ఏదో ఒక గొప్ప ఘనతను సాధించటానికి ఏర్పడిన సంస్థ అవుతుంది.

ప్రజలు మీకు ఎంత బాధ్యతను ఇవ్వదలచారో ఇంకా మీరు సృష్టించేది మీకు ఇంకా ప్రజలకు ఉపయోగకరమా లేదా అన్న దానిపై ఆధారపడి మీరు మీ విలువను అంచనా వేసుకోవాలి.

మీ నిజమైన విలువ, సంస్థ మీపై ఉంచిన బాధ్యత ఇంకా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీరు దాని నుంచి డబ్బు రూపంలో ఎంత సంపాదిస్తారో ముఖ్యమే కానీ, అదే సర్వస్వం కాదు. ప్రజలు మీకు ఎంత బాధ్యతను ఇవ్వదలచారో ఇంకా మీరు సృష్టించేది మీకు ఇంకా ప్రజలకు ఉపయోగకరమా లేదా అన్న దానిపై ఆధారపడి మీరు మీ విలువను అంచనా వేసుకోవాలి. 

ప్రేమాశిస్సులతో,
సద్గురు