సంతోషంగా ఉన్న జీవితం

సామి నిరాకారా:

మా నాన్నగారు తరచూ సాధువులను, సన్యాసులను ఇంటికి ఆహ్వానించి వారిని గౌరవ మర్యాదలతో సత్కరించి భోజనం పెడుతూ ఉండేవారు. నేను కూడా వారి పాదాలకు నమస్కారం చేసి, గౌరవంగా చూడడం నేర్చుకున్నాను. సుమారు 1989 ప్రాంతంలో మా తమ్ముడు ఇంటిని వదిలి రామకృష్ణమఠంలో సన్యాసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, నాకు అది చాలా సాధారణం అనిపించింది - అది నన్ను కలవరమూ పెట్టలేదు, లేదా నన్ను కదిలించినూ లేదు. అది అతని మార్గంగా చూశాను, అంతే ! కానీ, ఏదో ఒక రోజున నేను కూడా అదే మార్గంలో నడుస్తానని ఊహించలేదు. ఇది ఎలా జరిగింది? ఇదంతా ముందే నిర్ణయించబడిందా? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది.

అప్పట్లో నేను తిరుచెంగూడు లో ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడిని. మా ఊరయిన నామక్కల్ కు ఇది ఒక్క గంట ప్రయాణ దూరంలో ఉండేది. ఇది ఎంతో సౌకర్యంగా, సుఖంగా, స్థిరంగా ఉన్న ఉద్యోగం కావడంతో నేను సంతోషంగా ఉండే వాడిని. మరో పక్కన, నేను ఎన్నో సాంఘిక కార్యక్రమాలలో ఇంకా యూత్ క్లబ్ లో కూడా పాలుపంచుకునే వాణ్ని. నామక్కల్ ఇంకా తిరుచెంగూడు  ప్రాంతాల్లో నేను ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉండేవాడిని. నాకు సంబంధించినంత వరకు యోగా, ధ్యానం అనేది మంచి ఆరోగ్యం కోసం చేసేవి. అంతవరకే. వీటిని ఏర్పాటు చేయడంలో నేను ఎంతో సంతృప్తిగా ఉండేవాడిని. ఎంతగా అంటే, నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు.

అనుగ్రహ స్పర్శ

అది 1992. ఒక రోజున నన్ను ఒక యోగా క్లాస్ కు రిజిస్టర్ చేశారని నేను దానికి హాజరవ్వాలని నాకు తెలిసింది. నేను ఏర్పాటు చేసిన మరొక సంస్థ వారు అందించే హఠ యోగా క్లాసులకు హాజరైన కొంతమంది నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. వాళ్లు అంత అభిమానంతో నాకు దీన్ని అందించడంతో, నేను తిరుచెంగూడులో జరిగిన మొట్ట మొదటి ఈశా యోగ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇది నా జీవితానికి ఓ పెద్ద మలుపు అవుతుందని అప్పుడు నేను అనుకోలేదు. క్లాసుకు హాజరైన తర్వాత కూడా ఈశా యోగాతో ఈ తొలి పరిచయం నన్ను ఇంత దూరం తీసుకు వస్తుందని అనుకోలేదు. స్వామినాథన్ అన్న క్లాస్ తీసుకుంటున్నారు. సద్గురు దీక్ష ఇవ్వడానికి వచ్చారు. నేను సద్గురుని మొదటిసారి చూసింది అప్పుడే. దీక్ష ఇస్తున్నప్పుడు పార్టిసిపెంట్స్ ఏడవడం, దొర్లడం ఇంకా ఎన్నో రకాల పనులు చేశారు. ఇదంతా నాకు కొత్తగా ఉంది, కానీ ఇవన్నీ నన్ను ఏమీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది లేదు. వాళ్ళందరూ అనుగ్రహానికి పాత్రులు అయ్యారని నాకు అర్థం అయింది, సద్గురు కేవలం యోగ టీచర్ కాదని కూడా అర్థమైంది. కానీ వ్యక్తిగతంగా నాకు అప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన అనుభూతి కలగలేదు కానీ సద్గురు పట్ల ఎంతో గౌరవభావం కలిగింది.

ఒక సంవత్సరంలోపు భావస్పందన కార్యక్రమాన్ని సద్గురుతో పూర్తి చేశాను. ఆ తరువాత సంయమా చేశాను.  సంయమ కార్యక్రమం చేస్తున్నప్పుడు, అందులో పాల్గొన్నవారు ఎంతో ఉన్నత శక్తి స్థాయిలో ఉండడం చూసి నాకు సద్గురు ఎంత గొప్ప వారో అర్థమైంది. అక్కడ అందించేది ఏదో, దాని రుచి నాకు తెలిసింది. ఒక రోజున నేను  ఒక విశ్రాంతి సమయం(break)లో ఒక బిళ్ళని నములుతున్నాను. అది విక్స్ బిళ్ళ అనుకుంటా, నా గొంతు పట్టకుండా తీసుకున్నాను. నేను దాన్ని పూర్తిగా నమిలే లోపే విశ్రాంతి సమయం అయిపోయి, మమ్మల్ని హాల్ లోపలికి పిలిచారు. ఆ బిళ్ళ  ఇంకా నా నోట్లో ఉండగానే సద్గురు లోపలికి వచ్చి క్లాసు మొదలుపెట్టారు. నాకు ఆ బిళ్ళను ఏమి చేయాలో అర్థం కాలేదు. దానిని నమలడం నాకు ఇష్టం లేదు. అలాగని అక్కడ దాని ఉమ్మేయలేను, సరే అది కరిగేంతవరకు నములు దాము అనుకున్నాను. వెంటనే అది ఎంత చేదుగా మారిందంటే మరు క్షణమే నేను దాన్ని అక్కడ ఉన్న కార్పెట్ మీద ఉమ్మేసాను.

ఆ రోజుల్లో సంయమా హాల్లో ఏం జరిగేదో, సద్గురు నిర్వహించే హఠ యోగ కార్యక్రమాల్లో కూడా అదే జరుగుతూ ఉండేది. తిరుచెంగూడు లో హఠ యోగ క్లాసులలో కేవలం సూర్య నమస్కారాలు చేస్తూ కూడా ప్రజలు ఏడవడం, దొర్లడం, పారవశ్యంతో అరవడం చేసేవారు. నెల నెలా జరిగే సత్సంగంలో కూడా టీచర్లకు  క్లాసులో వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజలను నిర్వహించడం ఎంతో కష్టంగా ఉండేది. ధ్యానలింగ ప్రతిష్టకు మునుపు సద్గురు చుట్టూరా పరిస్థితులు ఎంతో తీక్షణంగా ఉండేవి. 

నోటి మాటతో ప్రచారం కంటే  ఎక్కువ

నామక్కల్ లో కూడా ఈశా యోగా క్లాసు జరగాలని నేను అనుకున్నాను. ఆ రోజుల్లో సద్గురువే స్వయాన క్లాసులు షెడ్యుల్ చేసేవారు కావడంతో నేను 15 గోవింద స్వామి నాయుడు లే అవుట్, సింగనల్లూరులో ఉన్న ఆయన ఇంటికి, ఆయనను మా ఊరిలో కూడా క్లాస్ నిర్వహించమని అడగడానికి వెళ్లాను. నేను లోపలికి వెళ్లడంతోనే, సద్గురు ఇంకా విజ్జి అమ్మ నన్ను లోపలికి ఆహ్వానించారు. సద్గురు నా ముద్దు పేరుతో పిలిచారు. ఈయనకు నా ముద్దు పేరు ఎలా తెలుసు అని నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను అది ఏ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులలో కూడా రాయలేదు. ఏది ఏమైనా అది నాకు పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికీ సద్గురుతో ఇలాంటి విషయాలు జరగడానికి నేను అలవాటు పడిపోయాను.

సద్గురు నా కోరిక విని,” సరే, నువ్వు ఒక 50 మందిని ఉదయం జరిగే క్లాసుకు తీసుకొనిరా” అని చెప్పారు. 50 మందిని క్లాసుకు తీసుకురావడం చేయగలిగిన పనే, కానీ ఉదయం పూట క్లాస్ కి రావడం అంటే అంతమంది రాకపోవచ్చును. నేను ఇదే సద్గురుకి చెప్పాలని చూశాను. కానీ ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు. ఉదయం యోగా చేసేందుకు మంచి సమయమని నాకు నచ్చ చెప్పారు.

అంతవరకూ ఈశా యోగా క్లాసులు నోటి మాట ద్వారానే తెలిసేవి. కాని నేను కొన్ని నోటీసులను ప్రింట్ చేసి ప్రజలకు పంచాను. నా ఇతర సాంఘీక కార్యక్రమాలకు ఇలా చేయడం నాకు అలవాటే. సద్గురు ఆ క్లాసును నిర్వహించారు, 50 మంది హాజరయ్యారు. అదెంతో యాదృచ్ఛికంగా అనిపించింది. ఆ 50మందిలో ఇద్దరు ఆ తరువాత బ్రహ్మచర్యాన్ని కూడా తీసుకున్నారు. 

ప్రతి రోజు క్లాసు పూర్తయిన తర్వాత సద్గురు మధ్యాహ్నం క్లాస్ కోసం వేలాయుధం పాల్యం ప్రయాణం ఆ తర్వాత కరూరులో సాయంత్రం క్లాసు. ఒక సాయంత్రం నేను కరూరు క్లాసులో వాలంటీర్గా కూర్చోవడానికి వెళ్లాను. నేను హాల్ లో కి వెళ్ళేసరికే సద్గురు అప్పటికే క్లాస్ మొదలు పెట్టేశారు. నేను లోపలికి వెళ్ళేసరికి, సద్గురు నన్ను ఆహ్వానించి, నన్ను లోపలికి వచ్చి మొదటి వరుసలో కూర్చోమన్నారు. నేను కూర్చున్న తర్వాత నాకు ఒక విషయం అవగతమైంది. సద్గురు క్లాస్ లో పాల్గొంటున్న వారితో క్లాస్ గురించి మాట్లాడుతూనే, నాతో కూడా మాట్లాడారని ! అంటే, క్లాసు డిస్టర్బ్ కాలేదు. మరో మాటల్లో చెప్పాలంటే ఆయన రెండు విభిన్నమైన విషయాలు - ఒకటి  నాతోనూ, రెండొవది క్లాస్ లో పాల్గొంటున్న వారితోనూ ఏకకాలంలో మాట్లాడారు. కానీ మాలో ఆ విషయం ఒకరిది ఒకరికి తెలియదు. అది ఆ విధంగానే జరిగిందని సద్గురు తర్వాత చెప్పారు.

100 మందితో జరిగిన మొదటి క్లాసు

మరో రెండు నెలల తర్వాత నేను సద్గురుని నామక్కల్ లో మరో క్లాసు నిర్వహించమని అడిగాను. ఈసారి ఆయన పొద్దున ఇంకా సాయంత్రం కూడా క్లాసులు ఇవ్వాలనుకున్నారు. అందుగ్గాను నేను 100 మందిని పాల్గొనేలా చేయగలనా అని అడిగారు. నేను ఒక్కో క్లాసులో వందమంది అనుకుని, సాధారణంగా పంచిపెట్టే నోటీసులతో పాటు, చిన్న పోస్టర్లు ప్రింట్ చేసి, నేనే స్వయంగా క్లాస్ గురించి ప్రచారం చేశాను. క్లాస్ జరిగే వేదిక వద్ద, పరిచయ కార్యక్రమం ప్రజలతో నిండిపోవడం చూసి నాకు ఎంతో సంతోషం వేసింది. పరిచయ కార్యక్రమం అయిన తరువాత చాలామంది క్లాసుకు రిజిస్టర్ చేసుకునేందుకు లైన్లో ఉన్నారు. ఉదయం క్లాసుకు 50 మంది రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాతో పాటు ఉన్న టీచరు రిజిస్ట్రేషన్ ఆపేద్దామన్నారు. నాకు అప్పుడే గుర్తొచ్చింది సద్గురు క్లాసుకి వందమంది ఉండాలని అడిగారని. అందుకే నేను రిజిస్ట్రేషన్ ఆపడానికి నిరాకరించాను, మొత్తానికి మాకు ఉదయం క్లాసులో వంద మంది సాయంత్రం క్లాసులో 50 మంది పాల్గొనడానికి వచ్చారు. వీరు సమాజంలో అన్ని కోవలకు చెందిన వారు - రాజకీయ నాయకులు ఇంకా కొంతమంది పేరు పొందిన వారు ఎంతో ఉత్సాహంగా తెలుసుకోవాలన్న కుతూహలంతో వచ్చారు. సద్గురు క్లాసును బాగా ఆస్వాదిస్తున్నట్లు అనిపించింది. ఒక ఈశా యోగా క్లాసులో వంద మంది పాల్గొనడం అదే మొదటిసారి అనుకుంటాను.

సద్గురు ఇంకా క్రతువులు?

నేను కొద్దిగా హేతువాదిని కావడంతో ఎటువంటి క్రతువులైనా సరే, అందుకు వ్యతిరేకంగా ఉండేవాడిని. ఎందరో సిద్ధుల లాగా సద్గురు కూడా విగ్రహారాధనకు వ్యతిరేకి అని నేను నమ్మాను. నేను సధ్గురుకు ఆకర్షితుడిని కావడానికి అది ఒక కారణం కూడా. అది 1993 ఆశ్రమానికి తీసుకున్న స్థలంలో భూమి పూజ చేస్తున్నప్పుడు, నేను సద్గురు ఒక క్రతువులో పాల్గొనడం చూశాను. పూజకి ఒక పురోహితుడిని పిలిచారు, ఆ క్రతువులో భాగంగా ఆయన సద్గురువుకు ఒక బూడిద గుమ్మడికాయ ఇచ్చి కొన్ని సమర్పణలు చేయించారు. “ఇక్కడకు ఒక పురోహితుడు రావడమా ...అందులోనూ సద్గురు చేతులో బూడిదగుమ్మడికాయ”... ఇదంతా చూసి నేను గందరగోళంలో పడ్డాను. ఆ క్షణంలో సద్గురు నా వైపు తిరిగి ఓ నవ్వు నవ్వారు.. “నేను ఇతరుల కోసం ఏమి చేయవలసి వస్తున్నది” అన్నట్లుగా ఉంది అది. ఆయన నవ్వడం చూసి నేను కూడా ఆ పరిస్థితికి ఆశ్చర్యపోయాను. 1994లో జరిగిన ప్రోగ్రాంలోని ఆయన ఉద్దేశం ఏమిటి అన్నది తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇక ఆయన బయట చేసే పనులు చూసి, ఆయన మీద ఒక నిర్ణయానికి రావడం అన్నది ఎంతో అర్థంలేని పని అని నేను తెలుసుకున్నాను.

 

ధ్యానలింగ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు నేను ఇక్కడ ఉండడం ఇంకా సద్గురు సమకాలంలో జీవించడం అనేది నా భాగ్యంగా నేను భావిస్తాను.

దారిలో పోగు చేసుకున్నది వదిలేయడం

1994లో జరిగిన 90 రోజుల హోల్ నెస్ ప్రోగ్రాంలో నేను మొదటి 30 రోజులు పాల్గొన్నాను. ఆ తర్వాతి రెండు నెలలు ఎవరైతే ఈశా యోగ ప్రోగ్రాములకు టీచర్ అవుదాం అనుకుంటున్నారో లేదా ఆశ్రమానికి పూర్తిగా రాదలచుకున్నారో, వారికోసం అవడంతో అప్పట్లో అది నన్ను అంతగా ఆకర్షించలేదు. అయినాగానీ నాకు అసలు ఒక నెలకి సెలవు దొరికింది. హోల్ నెస్  ప్రోగ్రాం లో 30 రోజులు ఉన్న తర్వాత నేను ఆశ్రమం వదిలి వెళ్ళిన మరుసటి రోజే నాకు దీక్ష ఇచ్చిన మరో గురువును చూడడానికి వెళ్లాను. ఆ రోజు ఆయన ఆశ్రమంలో కొత్తగా నిర్మించిన భవనానికి ప్రారంభోత్సవం కావడంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా మూడు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను కొద్దిగా ఆలస్యంగా చేరుకున్నాను. కానీ అక్కడికి చేరుకుని, చివరి వరసలో కూర్చుందామని నడుస్తున్న నన్ను స్టేజి మీద ఉన్న గురువుగారు తల ఎత్తి చూసి ఆయన కళ్ళతో గుర్తుపట్టారు. నా సమీపంలో ఏదో ఉపస్థితిని ఆయన గ్రహించారు. నాకు ఆ రోజే సద్గురు కేవలం నా గురువే కాదు నా ఏకైక మార్గం అని అర్థమైంది.

అయినప్పటికీ 1995లో దీక్ష పొందిన మొదటి బ్రహ్మచారుల్లో నేను లేను. అందుకు ఒక కారణం ఏమిటంటే నేను సన్యాసం నా జీవితం మార్గమని లేదా ముక్తి పొందడం నా లక్ష్యం అని కచ్చితంగా తేల్చుకోలేదు. నాకు సంబంధించినంత వరకు ప్రజలకు సేవ చేయగలిగితే అది సరిపోతుంది. ఇంకొక కారణం ఏమిటంటే మా అన్నయ్య అప్పట్లో ఓ ఆక్సిడెంట్ లో మరణించారు. ఆయనకు భార్య, పదేళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణం నుండి మా తల్లిదండ్రులు ఇంకా కోలుకోలేదు. అంతకు కొద్ది సంవత్సరాల మునుపే మా తమ్ముడు కూడా సన్యాసం తీసుకున్నాడు. ఈ సమయంలో వారిని బాధ పెట్టి వెళ్లాలా అన్నది నాకు తెలియలేదు. కానీ నన్ను నేను ఎక్కువ కాలం ఆపుకోలేకపోయాను.

ఆ తరువాతి సంవత్సరం కూడా బ్రహ్మచర్యానికి అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం వచ్చినప్పుడు నేను నా మనసులో ఈ నిర్ణయం తీసుకోలేక ఆఖరి తేదీని దాటేసాను. కానీ ఆ వెంటనే ఇక నన్ను నేను నిగ్రహించుకోలేక పోతున్నానని తెలుసుకున్నాను. ఒక కార్యక్రమం కోసం నేను ఆశ్రమంలో ఆ సమయంలో ఉన్నాను. ఆ రోజున సద్గురు అక్కడ నడుస్తున్నప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్లి విన్నవించుకుంన్నాను. అయినా నన్ను మరోసారి ఆలోచించమన్నారు - మా తల్లిదండ్రుల పరిస్థితి గురించి, అప్పుడు నేను ఏమనుకుంటున్నానో ఆయనతో చెప్పాను. ఆరోజు నేను ఆయనతో మాట్లాడింది 20 ఏళ్ల తర్వాత సద్గురు ఒక సత్సంగంలో చెప్పడం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నిజానికి నేనే దాని గురించి మర్చిపోయాను. సద్గురు 20 సంవత్సరాల తరువాత, అప్పుడు నేను మాట్లాడినవి యధాతధంగా చెప్పడంతో నేను నిర్ఘాంతపోయాను. కానీ సద్గురు అంటే అదే మరి..!

సద్గురులోని ఈ కోణం నేను చూసిన మరో సందర్భంలో గుర్తు వస్తోంది. ఒకతను ఈశా యోగ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, తానే స్వయంగా, విడిగా ఈశా యోగా కార్యక్రమాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. క్లాసులో అతనికి వచ్చే ప్రశ్నలను నిర్మూలించుకోవడం కోసం అనుకుంటా అతను సత్సంగంకు రావడం మొదలు పెట్టాడు. ప్రతి సత్సంగం లోనూ సద్గురును ఆయన ప్రశ్నలు వేసేవాడు. కొన్ని సత్సంగాల తర్వాత ఆయన మరో ప్రశ్నతో నుంచున్నప్పుడు, ఆయనతో సద్గురు ఇలా అన్నారు, "నువ్వు విడిగా క్లాసులు ఇస్తున్నావని నాకు తెలుసు" అని అతను అంతకు ముందర సత్సంగాల్లో ఆయన అడిగిన ప్రశ్నలన్నీ చెప్పారు. ఇది విని ఆయన నివ్వెరపోయాడు. అతన్ని మళ్ళీ ఇక్కడ మేము ఎప్పుడూ చూడలేదు.

లక్కీ డిప్స్

1996లో నేను బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత సత్సంగాలను ఇంకా తమిళనాడులో ధ్యానలింగ నిర్మాణానికై లక్కీ డిప్స్ నిర్వహించడం నాకు అప్పగించారు. లక్కీ డిప్స్ అంటే ప్రజలు చీటీలో నుంచి ఒక చిట్టి తీసి దాని మీద ఎంత రాసి ఉంటే అంత చెల్లించాలి. చిట్టి లలో రూపాయి నుండి 2,500 వరకు రాసి ఉండేది. నేను తమిళనాడు రాష్ట్రమంతా ప్రయాణం చేసి తగినంత డబ్బుని పోగు చేయగలిగాను.

ఒకానొక నగరంలో, నేను ఎప్పుడు సత్సంగానికి గాని లక్కీ డిప్పుకు గాని అక్కడకు వెళ్లినా, అక్కడి కోఆర్డినేటర్ నా భోజనం ఏర్పాటు మరిచిపోయేవారు. ఈ విషయం సద్గురుకు ఎలాగో తెలిసింది. నేను అదే నగరానికి వెళ్లాల్సిన ఒకరోజు, సద్గురువు ఆశ్రమం నుండి సింగనల్లూరు ఆఫీసుకు వచ్చి ఆ కోఆర్డినేటర్ ను ఆ మధ్యాహ్నం అక్కడికి వచ్చి ఆయన్ని కలవమన్నారు. వారు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ నేను సాయంత్రం అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఇది ఏదో కాకతాళీయం అని నాకనిపించదు. నా షెడ్యూలు నేనే వేసుకునేవాడిని, నేను ఎవరితోనూ ఆ సాయంత్రమే ఆ ఊరు వెళ్తున్నాను అని చెప్పలేదు.

వంట చేసి పెట్టే భాగ్యం

నేను బ్రహ్మచారిగా వచ్చిన మొదటి సంవత్సరాల్లో, నేను సింగనల్లూరు ఆఫీస్లో ఉండేవాడిని. నాకు వంట చేయడం అస్సలు రాదు, మా అందరికీ ఒకరు వంట చేసి పెట్టే వారు. ఎప్పుడైనా తినడానికి ఏమీ లేకపోతే నేను అన్నం వండుకొని మజ్జిగ లేదా పచ్చడి వేసుకుని తినేవాడిని. ఒక రోజున నేను ఉత్సాహంగా దోశ పిండి ఎలా చేయాలో నేర్చుకుని మిక్సీలో దోశ పిండి చేశాను. ఆ రాత్రి, తన కుమార్తె రాధేని తీసుకుని సద్గురు ఆఫీసుకు వచ్చి తినడానికి ఏదైనా ఉందా అని అడిగారు. నేను సంతోషంగా వాళ్లకి దోస చట్నీ పెట్టాను. మరొక రోజు నేను పుస్తకం చూసి రసం మొదటి సారి పెట్టిన రోజు, సద్గురు విజ్జి అమ్మను తీసుకుని వచ్చి,  అలానే “తినడానికి ఏమైనా ఉందా” అని అడిగారు. అయినా రసంతో అన్నం తినడం మాత్రం కాదు, నా సంతోషానికి దాన్ని మెచ్చుకున్నారు కూడా.

హిమాలయాల్లో ఎదుర్కొన్న ప్రమాదం

ఏడుగురు స్వాములను సద్గురు అమర్నాథ్ యాత్రకు పంపించినప్పుడు మేము మార్గమధ్యం నుండి తిరిగివచ్చివేయవలసి వచ్చింది, అమర్నాథ్లో కొన్ని అల్లర్లు ఉన్నాయి అని తెలియడంతో.

అప్పుడు సద్గురు మమ్మల్ని హిమాలయాలకు వెళ్ళమని సూచించారు. మేము ఆ యాత్రలో ఉన్నప్పుడు ఒక రోజున సద్గురు సూచన మేరకు ఒక్కొక్కరం ఒక్కో దిశగా భిక్షకు వెళ్ళాము. సాయంత్రం అందరమూ ఒకచోట కలిసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో పదార్ధం భిక్షగా పొందాము. ఒకరికి పళ్ళు మరొకరికి, చాక్లెట్ ఇలా. మాకు దొరికిన పదార్థాలను చూస్తే మాకు ఏది నచ్చుతుందో లేదా మేము ఏది కావాలి అనుకున్నామో అవి దొరికాయి లేదా మా తత్వం ఎలాంటిదో అలాంటివి దొరికాయి. నాకు గోధుమపిండి దొరికింది. అవును, నాకు నా భోజనం నేనే వండుకోవడం అంటే ఇష్టం. ఇన్ని విధాలుగా మా తత్వం ఏమిటో సద్గురు మాకు చూపించారు.

ఈ యాత్రలో మరొకసారి మేము భోజ్వాస వెడుతుండగా నేను ఒక సన్నని వంతెన మీద ఉన్న దుంగ మీద నుంచి జారిపోయాను. కింద గంగ ఎంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. కొంత మంది బ్రహ్మచారులు ఈత రాకపోయినా సరే అందులో దూకి నన్ను కాపాడాలి అనుకున్నారు. కానీ స్వామి నిసర్గా వాళ్ళని వివేకంతో ఆపారు. అక్కడి గైడ్ కూడా ఏమీ చేయలేకపోయాడు. నేను ఆ దుంగని కాసేపటి వరకు కాళ్లు చేతులతో పట్టుకున్నాను. కానీ నా బ్యాగు నన్ను కిందికి లాగేస్తోంది. కొంచెం సమయం తర్వాత ఇక తట్టుకోలేక నదిలో పడి పోయాను. కానీ నాకు వచ్చిన కొద్దిపాటి ఈతతో నేను తీరం చేరుకున్నాను. ఆ రోజున ఉన్న గైడ్ కూడా ఏదో అనుగ్రహమే నన్ను కాపాడింది అని అర్థం చేసుకున్నాడు.

మేరతాన్ లో పరుగులు

సింగనల్లూరులో ఒక ఏడాది ఉన్న తర్వాత నేను ఆశ్రమానికి మఖాం మారెను. అక్కడ ఆఫీస్ రిసెప్షన్ లో పనిచేయడం మొదలు పెట్టాను. నేను అక్కడ అ నిర్మాణానికి సంబంధించిన డబ్బు నిర్వాహణ చూసేవాడిని – వోచర్లు రాయడం, సప్లైయర్స్ కు, సేవాదార్లకు డబ్బు చెల్లించడం, డబ్బు జాగ్రత్తగా చూస్కోవడం లాంటివి. ఆ తర్వాత అది ఈశా క్యాష్ పాయింట్ గా మారింది. 10 సంవత్సరాల క్రితం ఒక పరిస్థితుల్లో నేను తమిళ పబ్లికేషన్ ను చూడవలసి వచ్చింది. అప్పటినుండి నేను తమిళ పబ్లికేషన్స్లో ఒక భాగంగా ఉన్నాను.

నేను ఆశ్రమానికి వచ్చిన తర్వాత నా చుట్టూ ఉన్న ప్రకృతితో ప్రభావితమై నేను సాధారణంగా జాగింగ్ చేయడం మొదలుపెట్టాను. నేను ఆటగాడిని కావడమో లేదా  క్రీడలను అంతకుముందు ఆడి ఉన్నదో లేదు. ఒకసారి సద్గురు నేను జాగింగ్ చేయడం చూసి అది కొనసాగించమని చెప్పారు. అప్పటికే నాకు 40 పై పడ్డాయి. కానీ సద్గురు ప్రోత్సాహం వల్ల అది నా దినచర్యలో భాగం అయిపోయింది. ఆ తరువాత ఆయన నన్ను మారథాన్ లలో కూడా పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆశ్రమంలో ఎందరో ఈ మారథాన్లో పాల్గొనడం చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది.

నా భాగ్యం

ధ్యానలింగ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు నేను ఇక్కడ ఉండడం ఇంకా సద్గురు సమకాలంలో జీవించడం అనేది నా భాగ్యంగా నేను భావిస్తాను. ధ్యానలింగం అంటే సద్గురు తప్ప మరొకటి కాదు. ధ్యానలింగంని పాముపటంలో పెట్టే ముందు రోజు సద్గురు దానికి ఒక ప్రక్రియ నిర్వహించారు. ఆ ప్రక్రియలో కేవలం ధ్యానలింగం మీద మాత్రమే సన్నటి జల్లు పడడం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. అది దేవతలు జల్లుతున్న దీవెనలు లా అనిపించాయి. అదంతా ఒక కట్టు కథలా కనిపించింది.

అప్పటివరకు నేను ఎంతో తర్కబద్ధంగా ఆలోచించే మనిషిని. నాకు కారణం అర్థం కాక నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు చాలా అరుదు. మా అన్నయ్య ఆక్సిడెంట్ లో ఉన్నట్టుండి పోయినప్పుడు కూడా నేను, “ సరే, ఏదో జరిగింది” అనుకున్నాను. కన్నీరు కార్చే లేదు. కానీ ఈ మధ్య నేను ఒక రోజు గురుపూజ చేస్తున్నప్పుడు, నా చెంపల మీద అశ్రువులు జారడం అనుభూతి చెందాను. ఈ రోజుల్లో నేను వాలంటీర్లు ఎంతో నిబద్ధతతో స్వార్థ రహితంగా పనిచేయడం చూసినప్పుడు కదిలిపోతూ ఉంటాను. హోల్ నెస్ ప్రోగ్రాం జరిగే మునుపే సద్గురు ఒకసారి నాతో ఇక్కడకు భవిష్యత్తులో లక్షల మంది వస్తారని, వారి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈశాలో భాగం అవుతారని చెప్పారు. అదంతా ఇప్పుడు సాకారం అవడం చూస్తుంటే, అది నన్ను కరిగించివేస్తోంది.

సద్గురు వంటి సామర్థ్యం కలిగిన గురువులు కలిగి ఉండడం అనేది కొన్ని తరాల వారికి మాత్రమే కలిగిన భాగ్యం. అందరికీ పురోగతి కలిగించాలనే సద్గురు ఎల్లప్పుడూ ఆలోచించేది, వీధిలో ఉన్న బిక్షగాడితో సహా. ఎంతో వినమ్రతతో సద్గురు పేదవాళ్లతోనూ,  గ్రామీణ ప్రజలతోనూ కలిసి పోవడం చూస్తే, నేను ఎంతగానో కదిలిపోతాను. సద్గురు అనంతమైన సాగరం లాంటివారు. ఆయనకున్న అనంతమైన జీవ కారుణ్యం వల్ల ఆయన మన మధ్య జీవిస్తూ మనతో పనిచేస్తూ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు పాటుపడుతున్నారు. నాయనార్లు, ఆళ్వారులు ఇటువంటివి చేశారని నేను కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాను. కానీ ఇక్కడ నా కళ్ళ ఎదురుకుండా నేను చదివిన అటువంటి జీవులు అందరిలోకి కూడా ఎంతో ఉన్నతమైన వారిని చూస్తున్నాను.

ఆయన నాకు అందించిన కొన్ని అవకాశాలను నేను వదులుకున్నానని నాకు అనిపించినప్పటికీ ఆయన శిష్యులలో ఒకడిని అవ్వడమే నాకు భాగ్యం. ఇక నా ముక్తి విషయానికి వస్తే అది ఆయన సమస్య. నిజంగా నేను దాని గురించి ఆలోచించను కూడా. ఆయనకు నేను దేనికి సమర్ధుడనో, నాకు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో తెలుసు. నాకు నేను తెలిసిన దానికంటే ఆయనకు నేను మెరుగ్గా తెలుసు కాబట్టి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు