Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ప్రతి పరిస్థితీ ఒక అవకాశమే. మీరు శ్రేయస్సును పండించుకుంటారో లేక బాధనో – అది మీ ఇష్టం.
మీ ప్రేమని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని అణుచుకోకండి. కేవలం మీరు పంచేదే మీ గుణం అవుతుంది, అణిచిపెట్టుకున్నది కాదు.
విశ్వంలో మీరు ఓ చిన్న ధూళి కణం మాత్రమే. మీ ఉనికి ఏ పాటిదో అర్థం చేసుకుంటే, సహజంగానే మీరు మౌనులవుతారు.
జీవితమంటే మీ చుట్టూ జరుగుతున్న ఒక నాటకం కాదు. జీవితం అంటే మీరే అయిన ఆ మూల తత్వం.
మీరు ఎంత ఎక్కువ భద్రతను కోరుకుంటారో, మీ జీవితంలో జరిగే ప్రతి మార్పు గురించి మీరు అంత ఎక్కువగా కలత చెందుతారు.
మీ ధ్యానం మీ గురించి మాత్రమే కాదు. మీరు నిజంగా ధ్యానపరులు అయినప్పుడు, ఎందుకో తెలీకుండానే, మీ చుట్టూ ఉన్నవన్నీ ప్రశాంతంగా మారిపోతాయి.
ఆత్మవిశ్వాసం స్పష్టతకు ప్రత్యామ్నాయం కాదు. విజయం సాధించాలంటే, మీకు కావాల్సింది స్పష్టత, ఆత్మవిశ్వాసం కాదు.
ఈ పౌర్ణమి రోజున, గౌతమ బుద్ధుడు సంపూర్ణ ఆత్మజ్ఞానం పొందారు, ఆపై ఓ ఆధ్యాత్మిక వెల్లువని సృష్టించారు. మీ ఆధ్యాత్మిక సాధనని మరింత తీవ్రతరం చేసుకునేందుకు ఇది మీకు స్ఫూర్తి కావాలి.
మార్గమే గమ్యం, అలాగే గమ్యం మార్గంలోనే దాగి ఉంది, సృష్టికర్త సృష్టిలో దాగి ఉన్నట్లు.
ప్రతి ఒక్కరూ మీకు హాని చెయ్యడానికే చూస్తున్నారని నిరంతరం ఆలోచిస్తూ, అనుమానంతో బ్రతికితే, జీవితంలో మీరు చాలా అల్పమైన పనులే చేస్తారు. విశ్వాసం చాలా ముఖ్యం.
అదే శక్తి లక్షలాది భిన్నమైన విధాలుగా వ్యక్తమవుతోంది: రాయిగా, చెట్టుగా, జంతువుగా, మనిషిగా, లేదా దాని అత్యంత సూక్ష్మ రూపంలో – దైవంగా.
మా అమ్మ నా వ్యక్తిగత స్వేచ్ఛకు ఎన్నడూ భంగం కలిగించకుండానే, నాకు పూర్తిగా కలుపుగోలు వాతావరణాన్ని నెలకొల్పింది. ఇది నాకు అద్భుతాలు చేసింది.