వినాయక చవితి రోజున యువతతో..
"Youth and Truth" ఉద్యమం తన సొంత పట్టణం చేరువవుతున్న సమయంలో, సద్గురు తన తాజా ఈవెంట్ల గురుంచి, మైసూరు లో రాబోయే తన షెడ్యూల్ గురుంచి ఇంకా ఆయన ఫ్యామిలీ, మోటార్ బైక్స్, చిన్నప్పటి స్కూల్ ఇంకా యువత గురుంచి అప్ డేట్స్ ఇచ్చారు. ఇదంతా మన దేశం ఇంకా ప్రపంచం మొత్తం పండుగ చేసుకునే వినాయక చవితి రోజున. గణాలకు అధిపతి అయిన వినాయకుని గురుంచి సద్గురు ఏమన్నారంటే..."ఆయన ఎంతో తెలివైనవాడు, ఇంకా అతని జ్ఞానం ఎటువంటిదంటే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలన్నిటిని విచ్చిన్నం చేయగలదు."

తెలుగు అనువాదం
ఇప్పుడు “Youth and Truth” ప్రోగ్రాం ఊపందుకుంది. ఈరోజు నాలుగు ఈవెంట్లు పూర్తయ్యాయి. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే మేము మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి వస్తున్నాం. అక్కడ ఈవెంట్ అధ్బుతంగా జరిగింది. ఫుట్ బాల్ ఆటగాడు సునీల్ చెత్రి తో కూడా ఇంకొక ఈవెంట్ జరిగింది, భారత ఫుట్ బాల్ ఆటకు అతను ఎంతో కృషి చేసాడు. గణేష్ చతుర్థి..అంటే మీ అందరికీ తెలిసిందే..గణపతి అంటే...గణాలకు నాయకుడు...గణాలకు అధిపతి..ఎందుకంటే ఆయన శిరస్సుని గణాలనుంచే పొందారు. మానవ శిరస్సు కాని ఈ తలకాయ వలన, ఆయన ఎంతో తెలివైనవాడు, ఇంకా అతని జ్ఞానం ఎటువంటిదంటే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలన్నిటిని విచ్చిన్నం చేయగలదు. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అంటాం.
విచిత్రమేమిటంటే, ఎన్నో సంవత్సరాలు కుటుంబానికి సంబంధించిన ఎటువంటి ఫంక్షన్లు, పండుగలు, పెళ్ళిళ్ళ కు వెళ్ళని నేను, గత సంవత్సరం “నదుల రక్షణ” కాంపైన్ సందర్బంగా, అనుకోకుండా, మైసూరులో మా ఫ్యామిలీ దగ్గరికి గణేష్ చతుర్థి రోజున వెళ్ళాను. ఇంకొకసారి, రేపు కూడా నేను మైసూరులో ఉండబోతున్నాను. కాబట్టి, ఈ షెడ్యూల్ ఆర్గనైజ్ చేసినవాళ్లకి థాంక్స్ చెప్పాను, ఎందుకంటే వాళ్లు తెలిసో తెలియకో రేపు నన్ను మైసూరులో ఉండేలా చేస్తున్నారు. అది గొప్పగా ఉండబోతుంది.
చాలా ఉత్సాహకరమైన ఈవెంట్ ఏమిటంటే, నేను మా స్కూల్ కి వెళ్ళబోతున్నాను. నేను అక్కడ రెండేళ్ళు మాత్రమే చదివాను. నలభై అయిదు సంవత్సరాల తరువాత ఇప్పుడు దాని గురుంచి మైసూరు లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా తరువాత ఈవెంట్లలో మేము కొంతమందితో ఛాముండి హిల్స్ లో “సద్గురు సన్నిధి” కి కూడా వెళ్తున్నాం. ఇంకా మోటార్ సైక్లింగ్ కూడా చెయ్యబోతున్నాం.
కాబట్టి, ”Youth and Truth” లో చాలా జరుగుతున్నాయి. కొద్దికొద్దిగా అన్నిచోట్లా ఉత్సాహం పెరుగుతుంది, కాబట్టి, మీరు కనెక్ట్ అయి ఉండండి...facebook, twitter..ఏదయితే అది..మేము మీకు దీని గురుంచి వీటిల్లో పోస్ట్ చేస్తుంటాం. మీరు ఏ వయస్సు వారైనా...మీరు మరలా యువకులవ్వటానికి ఇదే సరైన సమయం...అఫ్ కోర్స్..దాని గురుంచి సత్యం తెలుసుకోటానికి...