అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సద్గురు, సమకాలీన సమాజంలో స్త్రీల స్థానం గురించి తమ అభిప్రాయాలను మనతో పంచుకొంటున్నారు. అంతే కాదు, అటు వ్యక్తులుగా కానీ, ఇటు సమష్టిగా స్త్రీ జాతిగా కానీ, స్త్రీల సాధికారతను సంపూర్ణంగా సాకారం చేయటం విషయంలో తన దృష్టి కోణాన్ని వివరిస్తున్నారు. ‘మీలో అందరిలోనూ అంతర్గతంగా ఉన్నపురుష, స్త్రీ ధర్మాల రెంటి మధ్య ఒక సమతౌల్యాన్ని ఏర్పరచుకో గలిగితేనే, మీరు బౌద్ధికం (intellectual)గానూ, అనుభూతిపూర్వకం(experiential)గానూ జీవితపు లోతులన్నిటినీ గ్రహించగలుగుతారు‘ అంటున్నారు.