Sadhguruశంకరులు ఒక మేధో దిగ్గజం, భాషాశాస్త్ర మేధావి, అన్నిటికీ మించి, ఒక ఆధ్యాత్మిక జ్యోతి, భారతదేశానికి గర్వకారణం. అతి చిన్న వయస్సులోనే అయన ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కనబరిచారు. అయన మానవాళికి ఓ మెరుసే కాంతి పుంజం. ఇలాంటి జీవాన్ని ఉత్పత్తి చేయడం ఎలాగా? క్లుప్తమైన తన జీవితకాలంలోనే, ఆయన దేశం నలుమూలలా పర్యటించారు. భారతదేశం యొక్క దక్షిణ కొన నుండి, ఆయన దేశ మధ్య భాగానికి ఉత్తరం దిశగా ఇంకా తూర్పు పడమటి ప్రాంతాలకు కాలినడకనే సంచరించారు. ఇంత శక్తి, ఉత్సుకత, ఈ విజ్ఞానం ఈయనకు ఎక్కడ నుండి వచ్చాయి? శంకరులు జన్మిచింది “కాలడీ” అని పిలవబడే ఒక గ్రామంలో. ఈ రోజున అది ఒక చిన్న పట్టణం. ఇందులో ముఖ్యమైనదీ ఇంకా ఒక ప్రతీకగా ఉన్న అంశం ఉంది. “కాలడీ”  అంటే "పాదాల కింద" అని అర్ధం. దక్షిణాన, మేము భారతమాత యొక్క పాదాల వద్ద ఉన్నాము, ఇది ఎన్నో విధాలుగా మాకు ఉపకరించింది.

మహాభారతంలో ఒక అందమైన కథ ఉంది, బహుశా ఇది మీలో చాలా మందికి తెలుసు. అర్జునుడు ఇంకా దుర్యోధనుడు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు, కృష్ణుడి నుండి సహాయం అర్ధించడానికి వచ్చినప్పుడు, వారిలో ఒకరు కృష్ణుడి తల దగ్గర మరొకరు కృష్ణుడి పాదాల చెంత నిలబడ్డారు – ఇదే అన్నిటినీ నిర్ణయించింది. ఆనాటి మధ్యాహ్నం, అర్జునుడు కృష్ణుడి పాదాల వద్ద నుంచోవడంతోనే, అతను ప్రధానంగా యుద్ధాన్ని గెలిచాడు. మన దేశ సంస్కృతిలో ఇదే ప్రాథమిక స్వభావం - మనం ప్రతిదానికీ వంగి నమస్కరిస్తాము కాబట్టే మనం వృద్ధి చెందుతాం. మనం అన్నిటినీ తూసుకుంటూ రావడంతో పురోగమనం సాధించలేదు, - అన్నిటికీ ప్రణమిల్లుతూ మనం వృద్ధి చెందుతాం.

మీ శరీరంలోని కణజాలాలు ఇంకా అవయవాలు - కణాల రకాన్ని బట్టి, కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా పునరుజ్జివింప బడుతున్నాయి

భారతదేశంలో మనం, దైవం పాదాల వద్ద ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఇది బేషజాలకు(హెచ్చులకు) పోయే సంస్కృతి కాదు, సహజమైన భక్తి సంస్కృతి. అది ఏమైనా కానివ్వండి - దేవుడు, మనిషి, స్త్రీ, పిల్లలు, జంతువు, చెట్టు, లేదా రాయి అయినా - మనం అన్నింటికీ నమస్కరించడం నేర్చుకున్నాము. కేవలం ఈ ఒక్క అంశముతోనే మనము గొప్ప జీవులని సృజించగాలిగాము. దైవం పాదాల వద్ద ఉండటం ద్వారా, మనం తెలుసుకున్నాము, పరిణామం చెందాము, వికసించాము, అంతేకాదు చాలా కాలం వరకు మిగిలిన ప్రపంచానికి మనమే కాంతి దివిటీలమయ్యాము. వేలాది సంవత్సరాల క్రితం, శంకరుల ముందు కాలం నుండి కూడా, ఆదియోగిని మొదలుకొని యోగులు, మర్మజ్ఞులు, ఋషులు ఇంకా సాధువులు ఇలా, అనేకులు చాలా విధాలుగా దీనిని చెప్పారు. అయితే, ఈయన వ్యక్తపరచిన మేధా స్పష్టత, దేశవ్యాప్తంగా ఇది వ్యాప్తి చెందించడానికి ఆయన చూపిన శక్తి ఉత్సాహాలు, అందరిలోకెల్లా ఆయనని ప్రస్పుటంగా చూపించగలిగేలా చేసాయి. నేటి ప్రపంచంలో చాలా ముఖ్యమైన ఒక అంశం ఏమిటంటే, ఈ జ్ఞానం, విజ్ఞానం అంతా కూడా ఎదో విశ్వాసం లేదా నమ్మకం నుండి వచ్చింది కాదు, ఇది జ్ఞానోదయం వల్ల వచ్చింది. మానవ తర్కంతో ఇంకా ప్రస్తుత శాస్త్రీయ అన్వేషణలతో సమకాలీనంలో ఉంటే తప్ప ప్రజలు ఆధ్యాత్మిక ప్రక్రియను అంగీకరించరు. భవిష్యత్ తరాల వారు తార్క పరంగా ఇంకా శాస్త్రీయంగా లేనిది ఏదైనా సరే తిరస్కరిస్తారు.

ఈ సందర్భంలో, శంకరులు నేడు చాలా ప్రాముఖ్యత కలిగిన వారు. ఆయన చెప్పిన దాని గురించి కొంత అపార్థం ఉంది. నేను కనీసం ఒకదానిని అయినా సరిగ్గా విశ్లేషించి వివరించడానికి ఆయనకి ఋణపడి ఉన్నాను, ఆయన “అంతా మాయ" అని చెప్పారు. చాలామంది తప్పుగా వివరణ ఇస్తున్నారు. వారి ఉద్దేశంలో "మాయ అంటే ఉనికిలో లేనిది” అని. కానీ వాస్తవానికి మాయ అంటే ఒక భ్రమ అని అర్ధం, అంటే మీరు ఉన్న దానిని ఉన్నట్లుగా చూడటం లేదని. ఇక్కడ మీరు ఈ స్థూల శరీరాన్ని కలిగి ఉన్నారు, కానీ మీరు తినే ఆహారం, మీరు త్రాగే నీరు ఇంకా మీరు శ్వాసించే గాలి వల్ల మీ శరీరంలోని కణాలు ప్రతిరోజూ మారుతున్నాయి. మీ శరీరంలోని కణజాలాలు ఇంకా అవయవాలు - కణాల రకాన్ని బట్టి, కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా పునరుజ్జివింప బడుతున్నాయి. దీని అర్థం కొంత సమయం తరువాత, మీరు పూర్తిగా కొత్త శరీరాన్ని కలిగి ఉంటారు. కానీ మీ అనుభవంలో, అది మారనట్లే అనిపిస్తుంది - ఇదే మాయా.

ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పర్వతాల నుండి పట్టణాలకు, గ్రామాలకు ఇంకా అన్నింటికీ మించి ప్రజల హృదయాల్లోకి, మనస్సులలోకి దిగి రావాలి.

అదే విధంగా, మీరు ఉనికిని గ్రహించే మార్గం, మీ పంచేంద్రియాలతో  ప్రపంచాన్ని తెలుసుకోవడం అన్న మార్గం పూర్తిగా తప్పే అవుతుంది - ఇది భ్రాంతి. ఇది ఒక ఎండమావి లాంటిది. మీరు హైవే మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటే, కొన్నిసార్లు, దూరంగా, నీరు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మీరు అక్కడకు వెళ్ళాక ఖచ్చితంగా అక్కడ నీరు ఉండదు. దీని అర్ధం అక్కడ ఏమీ లేదు అని కాదు. ఈ భ్రాంతిని కాంతి ప్రతిబింబం సృష్టించింది. ఒక విషయం మరొక విషయంలా కనిపిస్తోంది. "నేను" అని మీరు అనుకుంటున్నారో వాస్తవానికి అది అన్నీను - ఇదే మయ. మీరు "ఇతరులు" అనుకుంటున్నది వాస్తవానికి మీరే. అంతా అని మీరు అనుకునేదంతా నిజానికి ఏమీ లేనిది. శంకరులు మాట్లాడుతున్నది మాయ గురించి. ఆయన మానవ వ్యవస్థని తెలుసుకోవడం ద్వారా, మొత్తం విశ్వాన్నే తెలుసుకోవచ్చునన్నారు.

ఆధునిక భౌతిక శాస్త్రం, విశ్వం అంతా ప్రాథమికంగా ఒకే శక్తి అని మీకు చెబుతోంది. అలాగే, సృష్టి ఇంకా సృష్టికర్త ఒకటే అని శంకరులు చెప్పారు. శంకరులు ఇంకా అనేక మంది సాధువులు అత్యంత స్పష్టతతో దేన్నైతే పేర్కొన్నారో, నేడు, సుదీర్ఘమైన శోధన తరువాత, దానికి సమాంతరంగా ఆధునిక శాస్త్రం చెబుతోంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పర్వతాల నుండి పట్టణాలకు, గ్రామాలకు ఇంకా అన్నింటికీ మించి ప్రజల హృదయాల్లోకి, మనస్సులలోకి దిగి రావాలి. ఈ సంస్కృతిని, ఈ భక్తిని, మనకు ఎంతో ఫలాలను అందించిన ఈ వినయాన్ని, ఈ భావనలను తిరిగి తీసుకురావడానికి ఇది సమయం - వంగి నమస్కరించడం తెలుసుకోవడానికి. ఇదే మన బలం, ఇదే మన మార్గం, మన పరిణామం, జ్ఞానోదయం పొందిన ప్రక్రియ ఇంకా విధానం ఇదే. ఇది ఓ గొప్ప నిధి - ఇదే దేశానికి భావి భవిష్యత్తు అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని మనం చేస్తే,  ప్రపంచం అంతా మన మార్గదర్శకత్వాన్ని కోరుకుంటుంది. ఈ దేశంలోనూ ఇంకా యావత్ ప్రపంచలోనూ శంకరుల స్పూర్తిని తిరిగి ప్రజ్వలింపచేద్దాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు