పదిహేడేళ్ళ కిందట ఒక గాఢమైన ప్రక్రియ ద్వారా ప్రపంచానికి ధ్యానలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి సమర్పించడం జరిగింది. ధ్యాన లింగ ప్రతిష్ఠ జరిగిన తేదీ జూన్ 24. గతంలో ఒక సద్గురు లేఖలో ధ్యానలింగ ప్రాముఖ్యాన్ని, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో వివరించారు.

ప్రాచీన కాలం నుండీ భారతదేశాన్ని ఎందరో సందర్శించారు. వారిలో సుప్రసిద్ధ అమెరికన్ రచయిత, ఆలోచనావేత్త మార్క్ ట్వయిన్ కూడా ఉన్నాడు. అతని కొద్దిరోజులు భారతదేశాన్ని సందర్శించిన తర్వాత, భారతదేశం గురించి ఇలా అన్నాడు, “ఏదైనా, ఎన్నడైనా, దేవుడైనా, మనిషి అయినా చేయగలిగిందేదైనా ఉంటే అది ఈ భూమిలోనే జరిగింది.” ఎవరినుంచి అయినా ఈ దేశం అతి గొప్ప ప్రశంస పొందిందంటే అది ఇదేనని నేననుకుంటాను.

భారతదేశంలో జరిగిన, జరుగుతున్న మార్మికత, ఆధ్యాత్మిక ప్రక్రియల లోతు గురించి చాలామందికి తెలియదు. ప్రపంచానికి  ఆధ్యాత్మిక రాజధానిగా ఈ భూమిని ఎల్లప్పుడూ గుర్తించారు. దీనికి కారణం ఏంటంటే, మానవ అంతర్ముఖ విజ్ఞానశాస్త్రం గురించి ఈ సంస్కృతికి ఉన్నంత గాఢమైన దృష్టి, అవగాహన మరే సంస్కృతికీ లేదు. ఈ సంస్కృతిలో ముక్తి ఒక్కటే పరమగమ్యం – చివరికి దేవుడు కూడా ఈ గమ్యం చేరుకోవడానికి ఒక సోపానం మాత్రమే.

ఆధ్యాత్మిక ప్రక్రియను వాస్తవ జీవితంలోకి తేవడంలో కొందరు యోగులు నిశ్శబ్దంగానే దృశ్యాన్ని మార్చగలిగారు. ఇటువంటి యోగుల్లో అగస్త్యముని అత్యంత ప్రభావం చూపించారు. ఆయన చేసిందాని ప్రయోజనాన్ని భారతీయులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఆయన ప్రతి మానవ ఆవాసాన్నీ స్పృశించారు, ఆధ్యాత్మిక ప్రక్రియ ఒక సజీవ సంస్కృతిగా ఏర్పడేట్లు నిశ్చయపరిచాడు – అది కేవలం ఒక బోధనగాకాదు, కేవలం తత్త్వం గా  కాదు, దాన్ని జీవన విధానంగా మార్చాడు. మొత్తం సమాజ నిర్మాణాన్ని ఎలా తీర్చిదిద్దారంటే, భారతదేశంలో పుట్టిన వెంటనే మీ జీవితలక్ష్యం మీ వ్యాపారంగాని, భార్యకాని, భర్తకాని, మీ కుటుంబంకాని కాదు.  మీ జీవితం మీ ముక్తి కోసమే.

కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానలింగంలో కూర్చుంటేచాలు, ధ్యానమంటే తెలియనివారు కూడా గాఢమైన ధ్యానస్థితిని అనుభవిస్తారు.

ఈ గమ్యం కోసం అనేక రకాల శక్తిమంతమైన సాధనాల సృష్టి జరిగింది. ఆలయ నిర్మాణ శాస్త్రం ఏర్పడింది, ఇక్కడ ఆలయం ఒక మహా శక్తి క్షేత్రం, అదొక శక్తి సాగరం అవుతుంది. భారతదేశంలోని కొన్ని దేవాలయాలను మీరు చూడాలి. మీకు ఏ దేవుళ్ల మీదా విశ్వాసం ఉండవలసిన అవసరం లేదు. మీలో కొంచెం స్పందన ఉంటే చాలు, మీరక్కడ కేవలం కూర్చుంటే చాలు. అది మీ అంతరంగంలో నుండే మిమల్ని ఉత్తేజ పరుస్తుంది.

ఈశా యోగా సెంటర్లో మీరు వచ్చి ధ్యానలింగంలో కూర్చుంటే చాలు, అది మిమల్ని లోపలినుంచి ఊపివేస్తుంది. ఎందుకంటే, దాన్ని చాలా శక్తిమంతమైన పద్ధతిలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ క్రతువులుండవు, అర్చనలుండవు; ఎల్లప్పుడూ సంపూర్ణ నిశ్శబ్దమే. అన్ని మతనేపథ్యాల వారూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానలింగంలో కూర్చుంటేచాలు, ధ్యానమంటే తెలియనివారు కూడా గాఢమైన ధ్యానస్థితిని అనుభవిస్తారు. ఈ స్థానాన్ని ఆ విధంగా సృష్టించడం జరిగింది.

దక్షిణ భారతదేశంలో ఆలయ నిర్మాణం ఒక పెద్ద ప్రకియగా ఉండేది. పెద్ద పెద్ద దేవాలయాలు కట్టబడ్డాయి. ఇవి ఎంత అద్భుతమైన వంటే , ఈ దేవాలయాల బాహ్య శిల్ప కళ  (architecture), దానికి అవసరమైన మేధస్సు కూడా, నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. దేవాలయాలు ఎంతో పెద్దగా, ఘనంగా ఉండేవి. కాని ఇవి కట్టినవారేమి రాజభావన్నాల్లో ఉండేవారు కాదు. వీరు చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. వారికీ అదేమీ పట్టేదికాదు. వారికీ ఈ దేవాలయాలు మానవ చైతన్యానికీ, ముక్తికీ సాధనాలవుతాయని తెలుసు. మిగితా విషయాలు వారికి ముఖ్యమైనవి కాదు. మొత్తం ఈ సంస్కృతి అంతా ఈ విధంగానే నిర్మిచబడ్డది.

వారికీ ఈ దేవాలయాలు మానవ చైతన్యానికీ, ముక్తికీ సాధనాలవుతాయని తెలుసు.

దురదృష్టవశాత్తు భారతదేశంలోని ఆధ్యాత్మిక సంస్కృతిని విదేశీ దండయాత్రలు, ఆక్రమణలు అనేకవిధాలుగా భగ్నం చేశాయి. సుదీర్ఘకాలపు ఘోర దారిద్ర్యపు తరంగాలు దాన్ని చెడగొట్టాయి. ఎన్నో స్థానభ్రంశాలు పొందాయి, కాని ఆధ్యాత్మిక ప్రక్రియ వెన్నెముక, సాంస్కృతిక విశ్వాసపు పునాది భగ్నం కాలేదు, కాదు కూడా. దాన్ని దాని పూర్వవైభవానికి పునరుద్ధరించవలసిన ఆవశ్యకత ఉంది. అయితే దాన్ని ప్రాచీనకాలంలో నిర్మించిన విధానంలో నిర్మించడం ఇప్పుడు సాధ్యంకాదు. ఈ రోజుల్లో ప్రజలు మరింత తార్కికంగా, మరింత విజ్ఞానశాస్త్రపరంగా ఆలోచిస్తున్నారు.

ప్రజలమీద విద్యావిధానం ప్రభావం చూపుతున్న పద్ధతిలో, ఆధ్యాత్మిక ప్రక్రియను ఒక విజ్ఞానశాస్త్రంగా అందిస్తే తప్ప వారికి దాంట్లో అర్థం కనిపించదు. యోగశాస్త్రం ఒక శాస్త్రంపై కాని, వ్యక్తిపై కాని విశ్వాసాన్ని కోరదు. ఏ విశ్వాసం అవసరం లేదు, ఏ నమ్మకం  అవసరం లేదు – కానీ అది పనిచేస్తుంది. వేలాది సంవత్సరాలనుండి ఒక వ్యక్తి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక సంక్షేమం కోసం ఆచరించే పద్ధతి ఇది – ఇది పనిచేస్తుంది. ఈ దిశలో , ఇంకా మరెన్నో విధాలలో ఈ ప్రపంచ భవిష్యత్తు యోగాలోనే ఉంది.

మతాతీతమైన, శాస్త్రీయ ఆధ్యాత్మిక ప్రక్రియ నేటి ఆవశ్యకత

ప్రస్తుతం ఈశాలో మేము ‘ఒక చుక్క ఆధ్యాత్మికత’- అనే అతి సాధారణ ప్రక్రియను ఎవరైనా ఎవరికైనా ఎటువంటి ప్రమాదమూ లేకుండా బోధించగలిగే ప్రక్రియను అందిస్తున్నాం. కుల, మత, జాతి, లింగ తదితర ఏ భేదమూ లేకుండా కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికత ఐనా ప్రతి వ్యక్తీ పొందడం అన్నదే లక్ష్యం. ఒక్క చుక్క అంటే తేలికగా భావించకండి. ఆ చుక్క అదానికదే ఒక మహాసముద్రం.

‘ఆధ్యాత్మిక ప్రక్రియ’ అని మనం అన్నప్పుడు అది దేవతల గురించికాని, పూజ గురించికాని, అటువంటి మరేదైనా దాని గురించి కాని కాదు. మతాతీతమైన, శాస్త్రీయ ఆధ్యాత్మిక ప్రక్రియ నేటి ఆవశ్యకత.  అది ఈ శతాబ్దపు అవసరం, ఈ సహస్రాబ్దపు అవసరం, అది అనంత కాలపు అవసరం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు