మీకు ఎప్పుడూ విజయం చిక్కడం లేదనుకుంటుంటే, ఏదయినా కొత్తవాటిని ప్రయత్నించడానికి ఇదే సమయం. మీరు చేసే వాటన్నిటిలో సాఫల్యానికి ఇక్కడ పది చిట్కాలు ఉన్నాయి.

#1 అదృష్టాన్ని మర్చిపోండి. స్థిర సంకల్పంతో జీవించండి.

 

 Mantras for Success To Gain Sucess and Find Peace

 

సద్గురు: కొన్ని యాదృచ్ఛికంగా జరుగవచ్చు. కానీ అలా యాదృచ్ఛికమైన అవకాశం కోసం మీరు ఎదురు చూస్తుంటే, అవి మీరు చచ్చి సమాధి అయినప్పుడే జరుగుతాయి, ఎందుకంటే, అవి తమ సమయం తీసుకుంటాయి. క్వాంటం సిద్ధాంత ప్రకారంగా కూడా, మీరు కోటాను కోట్ల సార్లు ప్రయత్నిస్తే, ఒక గోడలోంచి నడువగలరు అని చెప్తుంది. ఎందుకంటే గోడలోని కణాలు కొట్టుకుంటూ ఉంటాయి, మీరు ఆ మధ్యలోంచి నడవగలరేమో. కాకపోతే, ఆ కోటాను కోట్ల ప్రయత్నాల చివరకు మీరు చేరక ముందే, మీకు తల పగిలి ఉంటుంది. మీరు అదృష్టం మీద ఆధారబడి జీవిస్తుంటే, భయము, వ్యాకులతలతో జీవిస్తున్నట్లే. మీరు సంకల్ప, సామర్ధ్యాలతో జీవిస్తుంటే, ఏమి జరిగినా, జరగక పోయినా తేడా ఉండదు, కనీసం ఏమి జరుగుతోంది అన్నది మీ నియంత్రణలో ఉంటుంది. అది మరింత స్థిరమైన జీవితం.

# 2 వైఫల్యతకు కారణాలు నిర్ణయించడం మానండి.

successful mantra

సద్గురు: ఒక నిబద్ధతతో ఉన్న వ్యక్తికి వైఫల్యం అనేదే లేదు. మీరు రోజులో 100 సార్లు కింద పడితే, 100 గుణ పాఠాలు నేర్చుకున్నట్లు. మీరు ముఖ్యమైన దాన్ని సృష్టించడం కోసం, మీరిలా నిబద్ధతతో ఉంటే, మీ మనస్సు వ్యవస్థీకృతమౌతుంది. మీ మనస్సు కుదుట బడితే, మీ మనో భావనలు కూడా వ్యవస్థీకృతమౌతాయి, ఎందుకంటే మీరు ఆలోచించే విధంగానే అనుభూతి చెందుతారు. ఎప్పుడయితే మీ ఆలోచనలు, మనోభావాలు వ్యవస్థీకృతమౌతాయో, మీ శక్తులు, మీ దేహం కూడా ఒక వ్యవస్థీకృతమౌతాయి. ఒక్కసారి, ఈ నాలుగూ ఒకే దిశలో వ్యవస్థీకృతమైతే, మీరు కోరుకున్న దానిని సృష్టించి, వ్యక్తపరిచే మీ సామర్థ్యం అసాధారణం ఔతాయి. అనేక రకాలుగా మీరే సృష్టికర్త.

#3 స్పష్టతతో పని చేయండి

success in failure

సద్గురు: ఒక మనిషికి కావాల్సింది స్పష్టత కానీ విశ్వాసం కాదు. మీరు మనుషుల మధ్య నుండి నడవాలంటే, మీ కంటి చూపు బాగుండి, ఎవరు ఎక్కడున్నారో చూడగలిగితే, ఎవరికీ తగలకుండా సునాయాసంగా నడిచి వెళ్ళగలరు. మీ కనుచూపు సరిలేకుండా కేవలం విశ్వాసం ఉంటే ప్రతి వాళ్ళని తగులుతూ వెళ్తారు. స్పష్టత లేనప్పుడు, విశ్వాసం దానికి ప్రత్యామ్నాయం అని ప్రజలు అనుకొంటారు. అది అలా ఎప్పుడూ కానేరదు. ఉదాహరణకి మీ జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఒక నాణెం తీసుకొని, పైకి ఎగరవేసి, బొమ్మయితే ఒక విధంగా, బోరుసయితే మరో విధంగా అని తీసుకున్నారనుకోండి. అది 50 శాతం పని చేస్తుంది. మీరు కేవలం 50 శాతం మాత్రమే సరి అయితే, మీరు చేయదగినవి రెండే వృత్తులు - వాతావరణ శాస్త్ర వేత్త లేదా జ్యోతిష్కుడు. ఈ ప్రపంచంలో మరే వృత్తీ మీరు చేయలేరు.

#4 మీకు ఇష్టంలేని వాటితోనూ, ఇష్టంలేని ప్రజల పట్ల స్వీకార భావంతో ఉండండి.

tips for success in life

సద్గురు: మన జీవితంలో అనేక రకాల పరిస్థితులు ఎదుర్కోటానికి, మనకు వివిధ రకాలైన గుర్తింపులు కావాలి. మీరు వాటి విషయంలో, మృదుత్వంతో ఉండి, ఒక స్థితి నుండి మరొక దానికి స్వేచ్ఛగా మార గలిగితే, మీ పాత్రను మీరు ఎంత గట్టిగా పోషించినప్పటికీ, మీకు ఏ సమస్యా ఉండదు. కానీ చాలా మందికి వారి వ్యక్తిత్వము ఒక పాషాణము లాంటిది. అది వారి నెత్తి మీద కూచుని, దాని పరిధిలోకిరాని ప్రతి దానితో వారు కష్ట పడేటట్లు చేస్తుంది.

దాన్ని ఛేదించి బయట పడాలంటే, మరో విధంగా మీరు ఏదో చేయాలి. ఇది మీరు చేయగల చిన్నపని: మీకు ఇష్టం లేని వారితో జట్టు కట్టండి. ఆ వ్యక్తితో ప్రేమతో, సంతోషంతో ఉండండి. మీకు ఇష్టంలేని పనులు చేయడం, ఇష్టంలేని వ్యక్తులతో ఉండడం నేర్చుకోండి. అది చేస్తూనే వివేకంతోనూ, ప్రేమతోను, ఆనందంగానూ జీవించండి.

#5 లెక్కలేయడాలు మాని వేయండి.

సద్గురు: గొప్పతనం కోసం మీరు అభిలషించాల్సిన అవసరం లేదు. ‘మీరు’గా ఉన్న పరిధులకు దాటి, మీ దృష్టిని పెడితే, మీరు ఎలాగూ గొప్ప మానవులే అవుతారు. కొంతమంది వ్యక్తులను మీరు చూస్తే, గొప్పతనం అనేది వారు ఆశించడం వల్ల కలగలేదు, కానీ జీవితాన్ని వారు చూసే దృష్టికోణం "నా సంగతి ఏమిటి? " అన్న విషయానికి అతీతంగా ఉండడం వల్లే జరిగింది. .

best tips for success

మీరు "నా సంగతి ఏమిటి?" అనే లెక్కని, మీలో నుండి తీసి వేసి మీ పూర్తి సామర్ధ్యం మేరకు పనిచేస్తే, ఎదో రకంగా మీరు గొప్ప వారే. ఎందుకంటే మీరు సహజంగా "నా చుట్టూ ఉన్న జీవనానికి నేనేమి చేయగలను" అన్న విషయం మీద దృష్టి పెడతారు. కాబట్టి మీరు సహజంగానే మీ సామర్ధ్యాన్ని పెంచుకుంటారు ఎందుకంటే చేయవలసింది ఏంతో ఉంది కనుక

#6 విజయానికి యోగా

సద్గురు: భుజాలు, దాని పై దేహ భాగాల నుండి, నాడీ వ్యవస్థ, శక్తి వ్యవస్థలు, శాఖోప శాఖలుగా విస్తరిస్తాయి. కాబట్టి మెడ భాగాన్ని మంచి స్థితిలో ఉంచడం అనేది ఎంతో ముఖ్యం. ఈ మెడ సంబంధమైన సాధనలు చేసిన 3-4 నిమిషాలలో మీరు మరింత చురుకుగా ఉన్నట్లు ఖచ్చితంగా గమనిస్తారు. నాడుల పునరుజ్జీవనం ఉత్తమ స్థాయిలో జరిగి, జ్ఞాపక శక్తి, మేధస్సు కూడా పదునెక్కుతాయి.# 7 సమబుద్ధితో, ఉల్లాసంగా ఉండండి

సద్గురు: ఈ ప్రపంచంలో విజయం పొందాలంటే, మీకు ముఖ్యంగా కావాల్సినవి, శక్తివంతమైన మనస్సు, దేహం. మీరు మనస్సును నియంత్రించుకోవాలంటే, అతి ముఖ్యమైన లక్షణం సమబుద్ధి. ఈ సమబుద్ధి, మీకు మనస్సులోని వివిధ కోణాల్లోకి ప్రవేశం కల్పిస్తుంది. సమబుద్ధి లేనట్లయితే, మీరు మనస్సుని ఉపయోగించగల శక్తి ఎంతో క్షీణిస్తుంది. మీ శక్తి స్థాయి అనేది మరో ముఖ్యమైన లక్షణం. మీకు భౌతికంగాను, అంతర్గతంగాను ఎంతో ఉల్లాసం కావాలి. మీ శక్తులు ఉల్లాసంగా ఉన్నప్పుడే, దైనిందిన జీవితంలో ఎదుర్కొనే అవరోధాలను అధిగమించే సమర్థత ఉండి, విజయం వైపు సాగుతారు. ఈ సమబుద్ధి, ఉల్లాసమూ, మీ మనస్సు, దేహాల్లోకి తెచ్చినప్పుడు, సాఫల్యం అనేది ఏంతో సులభంగా చేకూరుతుంది..

#8 మీ అంతర్దృష్టిని తీర్చి దిద్దండి.

సద్గురు:అంతర్దృష్టి అంటే, మరెవరూ చూడలేని విషయాలు, మీ చుట్టూ ఉన్న జీవనంలో మీరు చూడగలగడం. అంతర్దృష్టి లేనట్లయితే, అనుసరించడానికి గాని, శ్రమ పడటానికి గాని మరేమి లేనట్లే. సామాన్యమైన దాన్ని, అసాధారణమైన దానిగా పరివర్తన చేయగలిగేది, కేవలం దానిమీద గాఢమైన అంతర్దృష్టి ఉన్నప్పుడు మాత్రమే.

#9 మీకేది స్ఫూర్తిని ఇస్తుందో గుర్తించండి.

సద్గురు: మరొక ముఖ్యకోణం ఏమిటంటే, నిరంతరం స్ఫూర్తితో ఉండండి. మీరు ఏమి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నదానికి కారణం గుర్తించి, దాని పరమార్థం తెలుసుకోండి, ప్రతి చిన్న పని ద్వారా మీరు మీ జీవితంలో చేస్తున్న మీవంతు సహాయం గమనించండి. మనిషి చేస్తున్న ప్రతిపనీ ప్రపంచంలో ఏదో దానికి ఒకరకమైన సహాయమే, తోడ్పాటే. మీరు ఏమి చేస్తున్నప్పటికీ, ఎవరో ఒకరు దానివల్ల లబ్దిపొందుతూ ఉండవచ్చు. మీరు చేసే మీవంతు సహాయం గుర్తించి దాని ద్వారా స్ఫూర్తి పొందండి.

#10 చిత్తశుద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటించండి.

సద్గురు: ఈ ప్రపంచంలో మెలగాలంటే చిత్తశుద్ధి ఎంతో అవసరం. మీరు మీతో మెలిగే మనుష్యుల్లో ఎంత నమ్మిక కలగ చేశారనే దాన్ని బట్టి, మీ దైనిందిన జీవితం ఎంత సులభమో లేదా కష్టమో అన్నది నిర్ణయమవుంది. ఒక నమ్మకంతో కూడిన వాతావరణం ఉంటే, మీ పనిచేయగల సామర్ధ్యం ఇనుమడిస్తుంది - ఎందుకంటే ప్రతివారు మీ మార్గానికి అడ్డంకులు వేయకుండా, మీ మార్గం సుగమం చేస్తారు.

Editor's note: Check out the 5-minute tools of transformation that Sadhguru has created for Yoga Day, that anyone can practice. You can also join or host a workshop, or train to become a facilitator.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Photo courtesy: StockMonkeysMenage a Moidave_mckeaguemomokacma @Flickr