శేఖర్ కపూర్: లింగభైరవి దేవి ప్రతిష్టాపనకు ఆహ్వానం పంపుతూ, ‘శేఖర్, మీరు సృజనాత్మకత ఉన్నవారు కాబట్టి, మీరు తప్పక రావాలి అని అన్నారు’. అందుకే నా మొట్టమొదటి ప్రశ్న, భైరవికి, సృజనాత్మకతకూ ఉన్న సంబంధమేమిటి ?సధ్గురు: ఈ భౌతిక సృష్టిలో అత్యద్భుతమైన సృజనాత్మకత ఏదైనా ఉంటే— అది మానవ శరీరమే! దీన్ని మించిన మహత్తర యంత్రం ఈ భూమిమీద మరొకటి లేదు, మరొక విశేషమేమిటంటే ఇందులో పురుషత్వం యొక్క పాత్ర ఉన్నా, స్త్రీమూర్తి గర్భంలోనే అది పుడుతుంది. భైరవి పరమోత్తమ ‘స్త్రీ’త్వం – సృజనాత్మకతే దాని సారం.శేఖర్ కపూర్: అంటే నా సృజనాత్మకతకు మూలం నాలోని ఈ స్త్రీత్వమనే మీరంటారు?


సద్గురు: ఓ మనిషిలో సృజనాత్మకత ఉంటుందని నేను అనుకోవడం లేదు. మన చుట్టూ ఉన్న సృష్టిని ఓ ప్రగాఢ దృష్టితో జాగ్రత్తగా పరిశీలిస్తే, దాన్ని మనమెన్నో విధాలుగా అనుకరించవచ్చు. దాన్ని రకరకాలుగా అభివ్యక్తం చేస్తూ, సమాజంలో ఓ సృజనాత్మక మనిషిలా కనిపించవచ్చేమో కానీ, నిజానికి మనలో సృజనాత్మకతనేది లేదు. సృష్టింపదగ్గదంతా ఈ సృష్టిలో సృష్టింపబడింది. మహా ఐతే మనం తెలివైన పనిమంతులనమని చెప్పుకోవచ్చు. ఒకవేళ ‘సృజనాత్మకతకు నిర్వచనం‘ చెప్పాలంటే ‘దేన్నైనా సృష్టించడం‘ అని అన్నా, ఒకవేళ —ఓ సినిమా తీసినా, చిత్రలేఖనం గీసినా, లేదా నేనో భవనం నిర్మించినా, మరేది చేసినా, నిజానికది సృజనాత్మకత కాదు, మీరు తెలివిగా దేన్నో అనుకరిస్తున్నారు, అంతే! జీవితంలోని భిన్నమైన అంశాలను ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాము అందుకే దుస్సాధ్యమైనదేదో చేస్తున్నామని చుట్టూ ఉన్నవారు మురిసిపోయేలా, అనుకరిస్తున్నాం. సరే, మీకొకవేళ అనుకరించడం అన్న పదం వినసొంపుగా లేకపోతే, ప్రతిరూపాన్ని సృష్టించారని అందాము!శేఖర్ కపూర్: నాకెందుకో అనుకరణ బాగుంది అనిపిస్తోంది, లేదా మీరు ఓ సృజనాత్మక వ్యక్తిగా చూస్తున్నారు కాబట్టి, ‘అనువదించడం’ అన్న పదం వాడుకోనిస్తారా?సద్గురు: లేదు, ‘ప్రసరణ’ అన్న పదం ఇవ్వదలుచుకున్నాను. ప్రసరణలో మీక్కావలసిన మార్పులూ-చేర్పులూ చేయొచ్చు కాబట్టి, అది నయం.

శేఖర్ కపూర్: సరే ఐతే సృజనాత్మకతకు బదులు ప్రసరణ అన్న పదానికి వచ్చేద్దాం, ఇక దాని గురించి మాట్లాడుకుందాం, నేనెలా ప్రసరణ చేయను? ఈ ప్రసరణకీ, భైరవి దేవికి ఏదైనా సంబంధముందా? నేను దీనిలో భాగమైపోవచ్చా? తద్వారా సృష్టి మూలాన్ని అందుకోవచ్చా?

సద్గురు: దేవి అంటేనే ప్రసరణ. యోగాలో తరచూ 'కిటికీ' అన్న పదాన్ని వాడుతూ ఉంటాం. కాకపొతే ఈ పదాన్ని బిల్ గేట్స్ మన దగ్గరనుండి ఎలాగో దొంగిలించాడు! విండోస్ ని అంత పాపులర్ చేయడం మనకి చాతకాలేదు! మీరో కొత్త కిటికీ తెరవగానే, అమాంతంగా ఓ కొత్త ప్రపంచం మీ ముందుంటుంది. ఒకవేళ మీ జీవితమంతా మీ ఇంట్లోనే బావిలో కప్పలా ఉన్నారనుకోండి, ఒకసారి కిటికీ తెరిచి బైటకి చూసినప్పుడు మీకో గుడి కనిపిస్తే ప్రపంచమంతా ఓ గుడి అని మీరు అనుకుంటారు. అదే, మరో కిటికీ తీసినప్పుడు పర్వతం కనిపిస్తే, ప్రపంచం పర్వతమనీ, లేదా ఇంకో కిటికీ తీసినప్పుడు, ప్రపంచం అరణ్యమనీ అనుకుంటారు. ఒకవేళ మీకో ఊరు కనిపిస్తే, ప్రపంచమో ఊరని అనుకుంటారు. మీరు అలా లక్షల కిటికీలు తీస్తున్న కొద్దీ, ఎదో ఓ కొత్త ప్రపంచం రెక్కలు విప్పుకుంటూనే ఉంటుంది, ఈ సృష్టి యొక్క అద్భుతమలాంటిది మరి!దేవి స్వయానా తానే ఓ గవాక్షం. మనం దేన్నైనా గవాక్షంగా, కిటికీగా మరల్చుకోవచ్చు, కాకపొతే ఇప్పటిదాకా ఆ పని చేయలేదంతే. దేవి అనే గవాక్షం సృష్టించి, దాన్ని తెరిచి ఉంచడం ద్వారా, ఎంతో మంది చూడగలుగుతున్నారు. భైరవి ద్వారా ఇదివరకెన్నడూ అనుభవంలోకి రానివి అనుభూతి చెందుతున్నారు, తమకై తాము చేయలేనివి ఆమె ద్వారా చేయగలుగుతున్నారు. మీరొకసారి, దేవి యంత్రాలున్న సాధకుల భక్తి గాధలను వినాలి, నమ్మశక్యంగా ఉండవు! ఆమెనో గవాక్షంగా ఉపయోగించుకుంటే ఉన్నట్లుండి ఆమె మీలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరింపచేస్తుంది! మునుపెన్నడూ లేని సామర్థ్యతా, నైపుణ్యం మీలో వికసిస్తుంది!యంత్రం- శక్తి యంత్రం!

మరో విధంగా చూస్తే అన్ని దేవతా మూర్తులనూ ఓ విధమైన యంత్రాలనే అనవచ్చు. ఓ విధంగా ఈ యంత్రం ఒక రకంగా యంత్ర పరికరమే! “యంత్రం” అన్న పదానికి అర్థం “రూపం”. ఎన్నో రూపాల సంక్లిష్ట కలయికే యంత్రం. మనం యంత్రాలని ఎందుకు సృష్టిస్తాం? మనం సృష్టించిన ప్రతి యంత్రం మన సామర్థ్యాన్ని, మనకున్న నైపుణ్యాన్నీ పెంచడానికే పనికొస్తుంది! ఏ పనినైతే చిన్నమోతాదిలో చేయగలమో, అదే పనిని యంత్రం పదింతల సామర్ద్యతతో చేస్తుంది. ఎలాగంటే- మనం నడవగలం, అందుకే సైకిల్ ని సృష్టించాము. ఒకవేళ చెట్లల్లా పాతుకుపోయి ఉంటే సైకిల్ గురించి ఆలోచించే వాళ్ళమే కాము.

మీరే యంత్రాన్నైనా తీసుకోండి, అది ఫోన్ కావొచ్చు, కార్, లేదా సైకిల్, లేదా కంప్యూటర్ –ఏదైనా కావొచ్చు, ఇవన్నీ కూడా మనకు చాతనైన పనిని పదింతల సామర్థ్యతతో చేసిపెడతాయి. అలా చూస్తే భైరవి కూడా ఓ యంత్రమే!కాకపొతే ఆమె భౌతిక రూపంలో కాక శక్తి రూపంలో ఉన్న యంత్రం కాబట్టి ఆమెతో పనిచేసే తీరు భిన్నంగా ఉంటుంది. భైరవి దగ్గర సరైన కోడ్- అంటే సరైన మంత్రం వాడితే ఇక ఆమెతో ఒక సంబంధం ఏర్పడినట్లే! మీ సామర్ధ్యత ఉన్నట్లుండి రెట్టింపు ఔతుంది. ఆమె వివిధ స్థాయిల్లో మీకు దోహదం చేయబట్టే మీ శక్తి సామర్ధ్యాలు అమాంతంగా పెరిగినట్లు అనిపిస్తుంది.మీరు సైకిల్ నడపం నేర్చుకున్న రోజుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మొట్టమొదటిసారి బాలన్స్ వచ్చినప్పుడు – స్వేచ్చా విహంగంలా గాలిలో తెలిపోయారుగా! అన్ని యంత్రల్లోకీ సైకిల్ మౌలికమైనది, మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు, మీ కదలిక నడవడం నుండి మరో మెట్టుకి ఎదిగింది, అలా ఎదగడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. సరిగ్గా ఈ కారణం మూలంగానే మనిషి అన్ని జీవరాశులకి అధిపతి అయ్యాడు. ఎందుకంటే ఈ భూమండలంలో శక్తిమంతమైన పనిముట్లనీ, యంత్రాలనీ సృష్టించాడు గనుకనే! నిజానికి, మీరు చిరుత కంటే వేగంగా పరుగెత్తలేరు, రిక్తహస్తాలతో పులిని ఎదురుకోలేరు, సరే, ఏనుగుతో పోటీకి అసలు నిలబడలేరు. కనీసం, ఆవుని, ఎద్దునైనా ఎదుర్కోలేరు.. మన రోజూవారి జీవితాల్లో యంత్రాలు ఉండబట్టే మన జీవితాలు మెరుగుపడ్డాయి. ఈ యంత్రాలు పూర్తిగా భిన్నమైన కోణంలో పని చేస్తాయి. ఇవి మానవ అంతర్గత శ్రేయస్సుకు ఉపయోగపడే యంత్రాలు. నేనెప్పుడైనా ధ్యానలింగాన్ని సాధనం అని అన్నప్పుడు, నా చుట్టూ ఉన్నవారు చిన్నబుచ్చుకుంటారు “సద్గురు దయచేసి అలా అనకండి, మాకది సాధనం కాదు, సాక్షాత్తూ దైవం, అనంటారు. అప్పుడు నేను, దేవుడు కూడా సాధనమే కదా అంటాను.” మనుషులు ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి 'శివా, నాకది చేసిపెట్టు, ఇది చేసిపెట్ట’మని అడుగుతారు.. అంటే, వారు ఆయన్ని ఓ సాధనం లాగే ఉపయోగించుకుంటున్నారుగా? కాని, అదెంత అద్భుతమైన సాధనమో వారికి అర్థం కావడం లేదు, అద్భుతమైనది దైవం కాదు..సాధనం. ఒకవేళ నేను మిమ్మల్ని మీ వేళ్ళతో ఈ కుర్చీలోనుండి, స్క్రూలు, బోల్ట్ లూ, అన్నీ ఉత్తిచేతులతో విప్పిపెట్ట మంటే, మీ వేళ్ళూ, పళ్ళూ అన్నీ ఊడిపోతాయేమో కానీ అవి మాత్రం ఊడి రావు.. ఔనా? అదే నేనో చిన్న స్క్రూ డ్రైవర్ ఇస్తే? అంతే ! అవన్నీ ఇట్టే, క్షణాల్లో తీసేస్తారు... ఓ సాధనం గొప్పదనం అదే! మీఅంతట మీరు చేయలేని పనులు దాని సహాయంతో చేయగలరు

మీరు శీర్షాసనంలోనో, రకరకాల వింత వింత భంగిమల్లోనూ కూర్చుని ధ్యానం చేయడానికి ప్రయత్నించారు, అయినా మీ వల్ల కాలేదు. అదే ఒకసారి ధ్యానలింగ సన్నిధిలో కూర్చుంటే సునాయాసంగా ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతారు. తమ జీవితకాలంలో ఒక్కసారైనా ధ్యానం అంటే ఏంటో చవి చూడని వారు కూడా, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని అటు వైపు మళ్లించే ఓ శక్తిమంతమైన సాధనం అది! అందుకే దాన్ని ధ్యానలింగం అని అంటారు. అలాగే భైరవి కూడా మీ శ్రేయస్సుకై రూపొందించబడింది. ఈ రూపాలన్నీ మీ అంతట మీరు చేరుకోలేని కోణాలకు మిమ్మల్ని చేరుస్తాయి.ప్రతిష్టీకరించిన స్థలాలుఅటువంటి స్థలాలకు నేను వెళ్లకపోయుంటే, ఈ భైరవిని ఇలా, ఇప్పుడున్నట్లుగా సృష్టించలేకపోయేవాణ్ని. ఎటువంటి సాధనం, ఎటువంటి పరికరం లేకుండా ప్రయాణం చేయాలంటే అదెవరికైనా ఎంతో శ్రమతో కూడిన పని.. నిజం చెప్పాలంటే ఇటువంటి సాధనాలూ, యంత్రాలూ ఉండబట్టే మన పూర్వీకులు మనకిచ్చిన ఈ సాధనాలను, మళ్లీ మొదటినుండీ సృష్టించే అవసరం లేకుండా వాటినే ఇంకాస్త మెరుగు పెట్టి మనకి కావలసినట్టులుగా మరల్చుకోగలుతున్నాముఈ యంత్రాలు అత్యంత శక్తిమంతమైన సాధనాలు. కాకపొతే ఈ ప్రాచీన, ప్రగాఢ శాస్త్రం మిగితా భౌతిక శాస్త్రాలకన్నా క్లిష్టమైనది, అంతే కాదు, దీన్ని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలం. ఈనాటి శాస్త్ర విజ్ఞానం చూస్తే, అది ఈ విశ్వం యొక్క భౌతిక తత్వాన్ని గురించే ఎక్కువగా శోధిస్తుంది. అయితే, కేవలం భౌతిక తత్వాన్ని మార్చడం వలన బాహ్య ఆకారాన్ని మార్చగలమేమో కానీ, జీవితం యొక్క లక్షణాన్ని ఏ మాత్రం మార్చలేము. మీరొకవేళ బాగా కసరత్తు చేసి, సైకిల్ తొక్కి, కండల్ని బాగా పెంచితే, మీ ఆకారం మారొచ్చేమో కానీ, మీ జీవితానుభవం మాత్రం శూన్యం. బలిష్టమైన కండరాలతో బాధపడుతూ ఉన్న మనిషిలా ఉంటారు, అంతేఅయితే ఈ భౌతికాన్ని మించి అభౌతిక కోణాన్ని తాకినప్పుడు, మీ ఉనికీ, మీ జీవితానుభవం, అన్నీ అనూహ్యంగా మారిపోతాయి. ఈ విశ్వంతో మీకున్న అనుబంధమే మారిపోతుంది. జీవం అనే దాన్ని మీరు సృష్టించలేరు.. మీ అవగాహనతో, అనుభవంతో దాన్ని ఆస్వాదించడానికే ఉందీ జీవితం.
మీకున్న ప్రత్యామ్నాయం అల్లా దాన్ని ప్రగాఢంగా తెలుసుకోవడమే! దురదృష్ట్టవశాత్తూ భౌతిక వలయంలో చిక్కుకుపోయి, ఈ కోణాన్ని మనం పూర్తిగా అలక్ష్యం చేశాము.

ప్రేమాశీస్సులతో,

సద్గురు